TDP

ప్రజల కష్టాలు గుర్తించి అండగా నిలిచేవాడే అసలైన నాయకుడు

పాతికమంది దివ్వాంగ విద్యార్థుల భవిష్యత్తును కాపాడిన లోకేష్

జాతీయస్థాయి ఉన్నత విద్యాసంస్థల్లో సీట్లు సాధించిన విద్యార్థులు

రాజకీయ నేతలపై గౌరవం పెరిగిందంటున్న దివ్యాంగ విద్యార్థులు


అమరావతి: అధికారమిచ్చింది ప్రజలకు సేవ చేయడానికే గానీ లేనిపోని బంధనాలు సృష్టించి ఇబ్బందుల్లో నెట్టడానికి కాదని నిరూపించారు విద్యా, ఐటీ మంత్రి నారా లోకేష్. అధికార యంత్రాంగాన్ని పరుగులు తీయించి…ఇక తమ భవిష్యత్తు ముగిసిపోయిందనుకున్న 25మంది ప్రతిభావంతులైన దివ్యాంగ విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపారు యువనేత లోకేష్. దివ్యాంగ విద్యార్థులకు ఎదురైన సున్నితమైన ఒక సమస్య తమ దృష్టికి వచ్చిన వెంటనే వేగవంతంగా సమయస్పూర్తితో స్పందించి వారి జీవితాల్లో వెలుగులు నింపారు. నాయకుడు అంటే అధికార దర్పాన్ని ప్రదర్శించడానికి కాదని, ప్రజల సమస్యను తమ సమస్యగా భావించి వారికి అండగా నిలబడే సేవకుడిగా ఉండాలని చేతల్లో నిరూపించారు. లోకేష్ చొరవ కారణంగా దేశవ్యాప్తంగా ఐఐటి, ఎన్ఐటి వంటి ప్రఖ్యాత సంస్థల్లో సీట్లు సాధించిన దివ్యాంగ విద్యార్థులు తమ జీవితాంతం లోకేష్ అన్న చేసిన సాయాన్ని గుర్తుంచుకుంటామని ఉద్వేగంతో చెబుతున్నారు. స్టాన్ ఫోర్డ్ లాంటి ప్రఖ్యాత సంస్థలో ఎంబిఎ చేసిన లోకేష్…. చదువు విలువను గుర్తించి కష్టాల్లో ఉన్న విద్యార్థులకు బాసటగా నిలచారు. వందలాదిమంది పోలీసు భద్రత నడుమ పరదాలచాటున ఎన్నికలకోసమే బయటకొచ్చిన నాయకుడు ఒకవైపు, అధికారం వచ్చిన మరుసటి రోజునుంచే నిత్యం ప్రజల్లోనే ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్న నేత మరోవైపున చూసిన ప్రజలు ఇద్దరు నేతల మధ్య వ్యత్యాసాన్ని గమనిస్తూ ఆనందం వ్యక్తంచేస్తున్నారు.

మెసేజ్ పెట్టిన అర్థగంటలోనే స్పందించారు!
-పృధ్వీ సత్యదేవ్, విజయవాడ
ఐఐటి, మద్రాసు అధికారులు సీటు తిరస్కరించాక ఏం చేయాలో పాలుపోలేదు. వెంటనే లోకేష్ అన్న కు వాట్సాప్ మెసేజ్ పెడితే అర్థగంటలో స్పందించారు.మా సమస్య పరిష్కారం అయ్యేవరకు పేషీ అధికారులు నిరంతరం ఫాలో అప్ చేస్తూనే ఉన్నారు. ఇక సీటుపై ఆశలు వదులుకున్న సమయంలో లోకేష్ సర్ భగవంతుడిలా అండగా నిలిచారు, ఆయనకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.

మాలో కొండంత ఆత్మవిశ్వాసం, ధైర్యం నింపారు!
-తేజిత చౌదరి, తిరుపతి.
లోకేష్ అన్న చేసిన సాయం మాలాంటి వారిలో కొండంత ఆత్మవిశ్వాసం, ధైర్యాన్ని నింపింది. ఇందుకు ముందుగా ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సార్ చేసిన సాయంతో నా లక్ష్యాన్ని సాధించేందుకు మార్గం దొరికింది. సమస్య చెప్పగానే వెంటనే స్పందించి… ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకున్నారు. సార్ చేసిన సాయానికి ఎలా ధ్యాంక్స్ చెప్పాలో నాకు అర్ధం కావడంలేదు. ఐఐటీ గౌహతీలో కంప్యూటర్ సైన్స్ జాయిన్ అవుతున్నా. ఇంజనీరింగ్ తర్వాత సివిల్స్ రాసి ప్రజలకు సేవచేద్దామని అనుకుంటున్నాను.

మా భవిష్యత్తుకు బాటలు వేశారు!
-రఘునాథరెడ్డి, కడప.
కౌన్సిలింగ్ అధికారులు కొర్రీ వేశాక ఇక మా భవిష్యత్తు ముగిసిపోయిందని భావించాం. లోకేష్ అన్న దృష్టికి తీసుకెళ్లినపుడు నేనున్నాను, అధైర్య పడొద్దు, సమస్య పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. నిరంతరం అధికారులతో మాట్లాడి జిఓ విడుదల చేసి మా భవిష్యత్తును కాపాడారు. ప్రస్తుతం నాకు ఎన్ఐటి, కాలికట్ లో సీటు వచ్చింది. ఈ ఆనందంలో నాకు నోట మాటలు రావడం లేదు. లోకేష్ అన్న చేసిన సాయాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం.

రాజకీయ నేతలపై గౌరవం పెరిగింది!
-స్నేహిత, నెల్లూరు
మంత్రిగా లోకేష్ అన్న పనివిధానం చూశాక రాజకీయ నాయకులపై నాకు గౌరవం పెరిగింది. మాటల్లో చెప్పలేని సంతోషంగా ఉంది. తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే లోకేష్ అన్న నా జీవితంలో వెలుగులు నింపారు. నాలాంటి ఎందరికో అండగా నిలిచారు. జీవో ఇచ్చారని చెప్పగానే నా ఉన్నత చదవులకు ఇక ఢోకా లేదని నమ్మకం కలిగింది. కౌన్సిలింగ్ లో 3వ రౌండ్ కే నేను సెలక్ట్ అయిపోయాను. బీటెక్ తర్వాత నేను ఎంటెక్ చేస్తాను. ఆ తర్వాత సాఫ్ట్ వేర్ సైడ్ వెళదామనుకుంటున్నాను. మంచి పేరున్న కంపెనీలో జాబ్ కొట్టడమే నా లక్ష్యం. లోకేష్ అన్న చేసిన సాయంతో నాపై మరింత బాధ్యత పెరిగింది.

లోకేష్ అన్న చొరవచూపకపోతే మా జీవితం ప్రశ్నార్థకం అయ్యేది!
-జ్యోతి, అనంతపురం
సార్ సాయం చేయకపోతే మా భవిష్యత్ ప్రశ్నార్థకమయ్యేది. లోకేష్ అన్న ఇంత త్వరగా స్పందించి జీవో విడుదల చేస్తారని ఊహించలేకపోయాం. సార్ చొరవచూపకపోతే మాకు ప్రతిష్టాత్మకమైన కాలేజీకి వెళ్లే అవకాశం వచ్చేదికాదు. అన్న చేసిన సాయానికి జీవితాంతం నేను, నా కుటుంబసభ్యులు రుణపడి ఉంటాము. సాఫ్ట్ వేర్ ఇంజనీరీర్ అవ్వాలన్నది నా కల. నన్ను ఇంత దాన్ని చేసిన నా తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి. నా చదువు ద్వారా సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలన్నదే లక్ష్యం.

మా భవిష్యత్తును కాపాడారు!
-పి.నిస్మిత నెల్లూరు
సీటు రాదని ఆశ వదిలేసిన సమయంలో లోకేష్ అన్న జీవో విడుదల చేసి మా భవిష్యత్ ను కాపాడారు. ఉన్నతాధికారులతో మాట్లాడి యుద్ధప్రాతిపదికన మా సమస్య పరిష్కరించారు. ప్రఖ్యాత విద్యాసంస్థల్లో చదువుకునే అవకాశం కల్పించారు. మాపై అన్న పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాము. నాకు ఎన్ ఐటీ నాగపూర్ లో ఇంజనీరింగ్ సీటొచ్చింది. బీటెక్ తర్వాత ఇంకా ఉన్నత చదువులకు వెళతాను. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్నదే నా లక్ష్యం.

లోకేష్ అన్న దేవుడిలా ఆదుకున్నారు!
-మోక్షశ్రీ , అనంతపురం
ప్రఖ్యాత విద్యాసంస్థల్లో ఉన్నత చదువుకి అవకాశం రాదేమోనని డిసైడ్ అయిపోయాం. నారా లోకేష్ అన్న దేవుడిలా మమ్మల్ని ఆదుకున్నారు. పై చదువులకు దారి చూపించారు. ఐఐటీ నాగపూర్ లో కెమికల్ ఇంజనీరింగ్ జాయిన్ కాబోతున్నాను. ఆ తర్వాత ఎంటెక్ చేసి మంచి జాబ్ కొట్టాలన్నదే నా లక్ష్యం. సార్ రుణం ఎప్పటికీ తీర్చుకోలేము. బాగా చదువుకుని నా కుటుంబానికి మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకొస్తాను.

జీవితాతంతం రుణపడి ఉంటాం!
-రాణి, కాకినాడ
నారా లోకేష్ అన్న చేసిన సాయానికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. మొదట మేము హోప్స్ వదిలేశాము. అన్న చొరవ చూపడం వల్లే సమస్య పరిష్కారమైంది. నాకు ఐఐటీ ఖరగ్ పూర్ లో ఇంజనీరింగ్ సీటొచ్చింది. సివిల్ సర్వెంట్ అవ్వాలనుకుంటున్నాను. సమాజానికి సేవ చేయాలన్నదే నా లక్ష్యం. మా భవిష్యత్ కు భరోసా కల్పించిన లోకేష్ అన్న కి ధ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.

వేగంగా స్పందించి భవిష్యత్తు కాపాడారు
-రేష్మిత, ఎనికేపాడు
ప్రభుత్వ పరంగా వేగంగా స్పందించి మా చదువులకు ఆటంకం కలగకుండా భవిష్యత్తును కాపాడారు. లోకేష్ అన్న చేసిన సాయం జీవితంలో మర్చిపోలేము. నేను ఐఐటీలో చదువుకునేందుకు వెళుతున్నానని మా అమ్మనాన్నలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఐఐటీ శ్రీసిటీలో నాకు సీటొచ్చింది. ఇంజనీరింగ్ తర్వాత పై చదువులు చదివి పేరొందిన కంపెనీల్లో ఉద్యోగం సాధించాలన్నదే నా లక్ష్యం.

నా కలను లోకేష్ సాకారం చేశారు
-గోకుల్ సాయి, గుంటూరు
ఉన్నత విద్యాసంస్థల్లో చదువుకోవాలనే నా కలను నారా లోకేష్ అన్న సాకారం చేశారు. ఆయనకు నేను , నా కుటుంబ ఎప్పటికీ రుణపడి ఉంటాము. అన్న చొరవ తీసుకోకపోతే మాకు సీట్లు వచ్చేవి కాదు. మా భవిష్యత్ కు లోకేష్ అన్న కొండంత అండగా నిలిచారు. నాకు ఎన్ ఐటీ, తాడేపల్లి గూడెంలో సీటొచ్చింది. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్నదే నా కల.

లోకేష్ అన్న …వ్యక్తిగతంగా చొరవ తీసుకున్నారు!
-పిఎస్ భరధ్వాజనాయుడు, తాళ్లవలస.
మార్కులలిస్టు లోపాలపై అధికారులు అభ్యంతరం చెప్పాక తీవ్ర మానసిక వత్తిడికి గురయ్యాం. సీటుక్ క్యాన్సిల్ అవుతుందేమోనని ఢీలా పడ్డాం. లోకేష్ అన్న పర్సనల్ కేర్ తీసుకుని సమస్య పరిష్కరించారు. అన్న చూపిన చొరవతో మాకు ధైర్యం వచ్చింది. సీటు వచ్చిందని సమాచారం వచ్చాక మా కుటుంబం మొత్తం ఆనందంలో మునిగిపోయాం. చదువు పూర్తయ్యాక లోకేష్ అన్న ను స్పూర్తిగా తీసుకుని మంచి ఉద్యోగం సాధించి ప్రజలకు సేవచేస్తాను.

గత అక్టోబర్ 26న ప్రారంభమైన ‘టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం 2024-26’లో

ప్రజల కష్టాలు గుర్తించి అండగా నిలిచేవాడే అసలైన నాయకుడు https://www.youtube.com/watch?v=ZZmc_sqgm7c పాతికమంది

వాట్సప్ సమాచారంతో మెరుపువేగంతో స్పందించిన మంత్రి లోకేష్ https://www.youtube.com/watch?v=mfLVx7dJ-O0 దివ్యాంగ విద్యార్థుల