TDP

చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో యువనేతకు జన నీరాజనం అడుగడుగునా యువనేతపై పూలవర్షం, మంగళహారతులు

చంద్రగిరి: యువనేత Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర 28వరోజు (ఆదివారం) చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని తిరుపతి రూరల్ మండలంలో కొనసాగింది. తిరుచానూరు సర్కిల్ లో పాదయాత్ర ప్రారంభానికి ముందు సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమంలో భాగంగా తనను కలిసేందుకు వచ్చిన యువతీయువకులతో యువనేత ఫోటోలు దిగారు. ఎవరినీ నిరాశపర్చకుండా అందరికీ ఓపిగ్గా సెల్ఫీలు ఇచ్చారు. తిరుచానూరు సర్కిల్ వద్ద క్యాంప్ సైట్ నుండి 28వరోజు పాదయాత్ర ప్రారంభమైంది. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ సమీపంలోని కూరగాయల మార్కెట్ వద్ద పార్టీ కార్యకర్తలు గజమాలతో యువనేతకు ఘన స్వాగతం పలికారు. అనంతరం తిరుచానూరు పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వేదపండితులు యువనేతకు ఆశీర్వచనాలు అందించారు. తిరుచానూరు వసుంధరానగర్ సర్కిల్ వద్ద పార్టీ కార్యకర్తలు స్వాగతించారు. తిరుచానూరు వసుంధరానగర్ లో యువనేతకు గ్రీన్ కార్పెట్, పూల బాటతో పార్టీ కార్యకర్తలు, నాయకులు నీరాజనాలు పలికారు. పాదయాత్ర దారిలో స్వర్ణముఖి నదిపై నిర్మించిన 7 లో లెవల్ కాజ్ వే ను పరిశీలించి, అక్కడి ప్రజల సమస్యలపై స్థానిక నాయకులతో చర్చించారు. స్వర్ణముఖి నదిని చెత్తతో పూడ్చేస్తున్న స్థలాన్ని యువనేత పరిశీలించారు. తనపల్లి సెంటర్లో యువనేతకు గ్రామస్తులు గజమాలతో ఘనస్వాగతం పలికారు. తనపల్లి సెంటర్ నుండి భాగ్యనగర్ వెళ్లే రోడ్డు ప్రారంభంలో రైతులు యువనేతపై పూలవర్షం కురిపించారు. భాగ్యనగరం గ్రామంలో మహిళలు హారతులు పట్టారు. మహిళలను ఆప్యాయంగా పలకరిస్తూ, వారికి సెల్ఫీలు ఇస్తూ పాదయాత్ర లోకేష్ ముందుకు సాగారు. భాగ్యనగర్ వద్ద ఎపిటిఎఫ్ కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు యువనేతను కలిసి తమ సమస్యలను విన్నవించారు. కెసిపేటలో యువతీయువకులు కేరింతలు కొడుతూ పెద్దఎత్తున బాణా సంచా కాల్చి అభిమానాన్ని చాటుకున్నారు. ఇటీవల కన్నుమూసిన తారకరత్న చిత్రపటానికి యువనేత పూలమాలలు వేసి నివాళులర్పించారు. దుర్గసముద్రంలో స్థానికులు యువనేతను గజమాలతో సత్కరించి నాగలిని బహుకరించారు.

మా పొలాలకు పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వడం లేదు -ముచ్చకాయల లక్ష్మి, తనపల్లి

మాకు నాలుగు ఎకరాల పొలం ఉంది. కానీ ఈనామ్ భూములని సాకులు చెబుతూ మా పొలాలకు పట్టా పాస్ పుస్తకం ఇవ్వడం లేదు. దీనివల్ల మేము మా పొలం అమ్ముకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. నేను గెలిస్తే  పట్టా చేయిస్తానని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పారు. తమ గ్రామం వచ్చినప్పుడు అడిగితే మాత్రం స్పందించడం లేదు.

యాదవ మేయర్ ను అవమానిస్తున్నారు!

యాదవులకు ఈ ప్రభుత్వంలో కార్పొరేషన్ ఉంది..కానీ నిధుల్లేవు. TDP అధికారంలోకి ఉన్నప్పుడు తుడా చైర్మన్, టీటీడీ, ఫైనాన్స్ మంత్రి యాదవులకు ఇచ్చాం. ఇప్పుడు ఎవరికి ఇచ్చారో ఆలోచించుకోవాలి. తిరుపతి మేయర్ గా యాదవ చెల్లెలు ఉంది..కానీ ఆమెను పనిచేయకుండా అభినయ్ రెడ్డి అడ్డంకులు పెడుతున్నారు. పదవి ఇవ్వడం కాదు..గౌరవం ఇవ్వాలి. తిరుపతి మేయర్ ను డమ్మీని చేసి అవమానిస్తున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే యాదవులకు గోమేతకు పచ్చికబయళ్లు కేటాయించి, ఫీడ్ సబ్సిడీ అందిస్తాం.

వడ్డెర్ల స్థితిగతులు మారుస్తాం!

వైసీపీ ప్రభుత్వ విధానాలపై వడ్డెర్లు మాట్లాడలేకపోతున్నారు. ఎన్టీఆర్ సీఎం అయ్యాక అనంతజిల్లాలో క్వారీలు వడ్డెర్లకు కేటాయించారు. ఈ ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి వడ్డెర్ల మైన్ లు లాక్కుని ధనవంతులకు ఇచ్చారు. వడ్డెర్లకు ఫెడరేషన్ ఏర్పాటు చేసి రూ.60 కోట్లు ఖర్చు చేశాం. ఈ ప్రభుత్వం మీ గురించి పార్లమెంట్ లో మాట్లాడటం లేదు. ఎస్టీల్లో కొన్నికులాలను కలిపారు. కానీ మన రాష్ట్రంలో తీర్మానం కూడా చేయలేదు. అంబేద్కర్ రాజ్యాంగం అమలుకే ఈ యువగళం పాదయాత్ర చేస్తున్నా. టిడిపి అధికారంలోకి వచ్చాక వడ్డెర్ల స్థితిగతులు మారుస్తాం.

బిసిలతో ముఖాముఖిలో వ్యక్తమైన అభిప్రాయాలు:

జగన్మోహన్, వన్నెకాపు: మాకు కార్పొరేషన్ కూడా లేదు. విద్య, రాజకీయంగా, సామాజికంగా వెనకబడిఉన్నాం. మేము మీవెంట రావాలంటే మాకు భరోసా ఇవ్వండి.

రామయ్య, గౌడ: బీసీలంటే టీడీపీ..టీడీపీ అంటే బీసీలు. జనాభాలో బీసీలు ఎంత మంది ఉన్నారో తేల్చాలి. జిల్లాకొక బీసీ భవన్ ఏర్పాటు చేయాలి. నియోజకవర్గానికి కూడా ఏర్పాటు చేయాలి. గౌడలకు గతంలో కార్పొరేషన్ ద్వారా రుణాలు వచ్చేవి. ఇప్పుడు దాన్ని కుక్కలు చింపిన విస్తరలా చేశారు. గుర్తింపు వచ్చేలా బీసీలకు పథకం రూపొందించాలి. నీరా ప్రాజెక్టు ఏర్పాటు చేసి, గౌడలకు ఉపయోగపడేలా చేయాలి. మాకు మద్యం షాపుల్లో 25 రిజర్వేషన్ అందించాలి. చేపలు ఇవ్వడం కాదు..పట్టడం నేర్పించాలి.

ఎ.వాణి, గౌడ: 45 ఏళ్లకు పెన్షన్ అన్నారు కానీ అమలు చేయలేదు. చెట్టు నుండి పడితే ప్రమాద బీమా అందడం లేదు. బయట చదువులు మా పిల్లలు చదివేందుకు రుణాలు అందడం లేదు. మాకష్టంతోనే చదవించుకుంటున్నాం. మహిళలకు ఇంట్లో ఉండేలా ఉపాధి కల్పించాలి.

జీవరత్నం, యాదవ: మా సంఘానికి కార్పొరేషన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి. యాదవ భవనాలు ప్రతి భవనంలో నిర్మించాలి. రామచంద్రాపురం మండలంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని..శ్రీకృష్ణుని రూపంలో ఏర్పాటు చేయాలి.

లక్ష్మీ ప్రసన్న కుమార్, కుమ్మరి: మా కుమ్మరి కులం అభివృద్ధికి మీ సహాయం కోరుతున్నాము. శాలివాహన కార్పొరేషన్ ఏర్పాటు చేశారు..కానీ నిధులు ఇవ్వలేదు. టీడీపీ వచ్చాక మా కుమ్మరులకు సరపడా నిధులు ఇవ్వాలి. కార్పొరేషన్ ద్వారా చదువుకునే వారికి నిధులు కేటాయించాలి. రాజకీయంగానూ మాకు అవకాశం కల్పించాలి. జనాభా ప్రాతిపదికన సబ్సిడీలు ఇవ్వాలి.

మణికంఠ,వన్యకుల క్షత్రియ: జిల్లాలో పది లక్షల మంది బీసీలు ఉన్నారు. విద్య, ఉద్యోగం, రాజకీయ పరంగా ప్రాధాన్యం లేదు. మా బీసీలకు అన్నివిధాలా న్యాయం చేయాలి.

కె.నాగరాజు, వడ్డెర: వడ్డెర్లు 40 లక్షల మంది ఉన్నారు. ఎస్టీల్లో చేర్చాలని ఇంగ్లీష్ లో వినతిపత్రం ఇస్తే మీరు ఐఎఎస్ లా..ఐపీఎస్ లా అని ఎమ్మెల్యే అవమానించారు. ఎదన్నా చెప్పుకోవాలంటే భయంగా ఉంది. 15 ఏళ్లుగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగం చేస్తుంటే మమ్మల్ని బయటకు పంపారు. దీంతో 200 కుటుంబాలు వీధిన పడ్డాయి.

లక్ష్మీ, ముదిరాజు: మా కులాన్ని చాలా తక్కువగా చూస్తున్నారు. బీసీ – డి నుండి బీసీ-ఏ లోకి మార్చారు. పిల్లల విద్యకు చాలా ఇబ్బంది పడ్డాం.

కొట్టుకుపోయిన లోలెవల్ కాజ్ వేను పరిశీలించిన లోకేష్

తనపల్లిలో వరదలకు కొట్టుకుపోయిన లెవల్ కాజ్ వే ని యువనేత లోకేష్ పరిశీలించారు. 2021 నవంబర్ లో వచ్చిన వరదలకు స్వర్ణ ముఖి నది పై ఉన్న 7 లో లెవల్ కాజ్ వే లు కొట్టుకుపోయాయని స్థానికులు ఈ సందర్భంగా వివరించారు. ఆ తర్వాత దీనిని పటిష్టంగా నిర్మించకుండా పైపులు, మట్టి పోసి పైపైన రోడ్డు పోసారే తప్ప పూర్తిస్థాయిలో పటిష్ఠమైన కాజ్ వే లు నిర్మించలేదని చెప్పారు. నాసిరకం పనులవల్ల మళ్లీ వరదలు వస్తే నాణ్యత లేకుండా వేసిన పైపులు, మట్టి కొట్టుకు పోవడంతో పాటు తమ ప్రాణాలకు ప్రమాదం ఉందని పొంచి ఉందని తనపల్లి వాసులు ఆవేదన వ్యక్తంచేశారు.

యువనేతను కలిసిన ప్రభుత్వ ఉపాధ్యాయులు

చంద్రగిరి నియోజకవర్గం భాగ్యనగర్ లో యువనేత లోకేష్ ను ఎపిటిఎఫ్ కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు కలిసి తమ సమస్యలను విన్నవించారు. టీచర్లు మాట్లాడుతూ… సి.పి.యస్ విధానాన్ని రద్దుచేసి  ఓ.పి.యస్ విధానాన్ని అమలు చేయాలి. 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలలో విలీనం చేయడాన్ని రద్దుచేయాలి. పాఠశాలల్లో ఇంగ్లీష్ తోపాటు తెలుగు మీడియంను కూడా కొనసాగించేలా చర్యలు తీసుకోవాలి. ఉపాధ్యాయ బదిలీలకు స్పష్టమైన శాశ్వత విధివిధానాలను రూపొందించాలి. ప్రతినెలా 1వ తేదీన జీతాలు వచ్చేటట్లు చట్టం చేయాలి. ఉద్యోగులు దాచుకున్న పి.యఫ్, ఎ.పి.జి.యల్.ఐ.సి సొమ్ముకు భద్రత కల్పించి ఉద్యోగులు కోరుకున్న సమయంలో ఇచ్చేటట్లు చర్యలు తీసుకోవాలి. ఫేషియల్ అటెండెన్స్ విధానాన్ని రద్దుపరచి బయోమెట్రిక్ విధానాన్ని అమలు పరచాలి. యాప్ ల భారాన్ని తగ్గించి వాటిని సచివాలయ ఉద్యోగులకు అనుసంధానం చేయాలి. ఉద్యోగులపై ఉన్న అక్రమకేసులు, అక్రమ సస్పెన్స్లను తొలగించాలని కోరారు.

30ఏళ్లుగా గుడిసెల్లో నివసిస్తున్నా ఇళ్లపట్టాలు లేవు లోకేష్ ఎదుట అచ్చన ఇళ్లు గ్రామస్థుల ఆవేదన

దుర్గసముద్రం పంచాయితీ పరిధిలోని అచ్చనఇళ్లు గ్రామస్థుల పాదయాత్ర దారిలో యువనేత లోకేష్ ను కలిశారు. 30సంవత్సరాలుగా తాము ఇక్కడి నివసిస్తున్నామని, గతంలో తమకు ఇక్కడ స్థలం చూపించగా గుడిసెలు వేసుకుని జీవిస్తున్నామని చెప్పారు. తాము నివసిస్తున్న చోటే పట్టాలు ఇప్పించి ఇళ్లు నిర్మించి ఇవ్వాల్సిందిగా గ్రామస్థులు కోరారు.

Also Read:Reviving the State: Yuvagalam Padayatra and TDP’s Vision for a Poverty-Free Future

Tagged #LokeshPadaYatra #Padayatra #YuvaGalamLokesh #YuvaGalam #NaraLokeshPadaYatra #NaraLokesh #Yuvagalam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *