పీలేరులో హోరెత్తిన జనసంద్రం! పాదయాత్రలో పాల్గొన్న కన్నా, ధూళిపాళ్ల యువగళాన్ని అడ్డుకునేందుకు వైసిపి ముష్కరుల యత్నం పాదయాత్ర సమయంలో పీలేరులో పవర్ కట్
పీలేరు: జగన్మోహన్ రెడ్డి అరాచకపాలనలో పోరాటమే లక్ష్యంగా యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్రకు పీలేరు నియోజకవర్గంలో అనూహ్య స్పందన లభించింది. జ్యోతినగర్ విడిది కేంద్రంవద్ద నుంచి 35వరోజు పాదయాత్ర ప్రారంభానికి ముందు ఆకస్మికంగా కన్నుమూసిన ప్రత్తిపాడు నియోజకవర్గ TDP ఇన్ చార్జి వరుపుల రాజా చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. పీలేరు బహిరంగసభ అనంతరం పట్టణంలో నిర్వహించిన పాదయాత్రకు జనం నీరాజనాలు పలికారు. ప్రధాన రహదార్లవెంట జనం కిక్కిరిసిపోవడంతో పీలేరు పట్టణం జనసంద్రంగా మారింది. యువగళం పాదయాత్ర 35వరోజు (ఆదివారం) ఉత్సాహపూరిత వాతావరణంలో సాగింది. నారా లోకేష్‌ని చూసేందుకు రోడ్లవెంట మహిళలు, యువకులు పోటెత్తారు. అడుగుతీసి అడుగు వేయలేనంతగా జనం రోడ్లపైకి చేరుకున్నారు. పీలేరు పట్టణంలో యువనేతపై అడుగడుగునా పూలవర్షం కురిపించారు. బాణాసంచా మోతలు, డప్పు శబ్ధాలతో పీలేరు హోరెత్తిపోయింది. జ్యోతినగర్ విడిది కేంద్రం నుండి ప్రారంభమైన 35 వ రోజు యువగళం అగ్రహారం క్రాస్ వద్ద యువగళం పాదయాత్ర పీలేరు నియోజకవర్గంలో ప్రవేశించింది. పీలేరు ప్రజలు, పార్టీకార్యకర్తలు, అభిమానులు యువనేతకు పెద్దఎత్తున స్వాగతం పలికారు. నారా లోకేష్ యువగళం పాదయాత్రలో టిడిపి నేతలు కన్నా లక్ష్మీ నారాయణ, ధూళిపాళ్ల నరేంద్ర పాల్గొని సంఘీభావం తెలిపారు. పీలేరు మార్కెట్ యార్డు వద్దకు యువగళం పాదయాత్ర చేరుకునే సమయానికి మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ గిరిధర్ నాథ్ రెడ్డి తన అనుచరులతో వైసిపి జెండాలు పట్టుకుని టిడిపి కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. టిడిపి కార్యకర్తలు ఒక్కసారిగా తిరగబడటంతో పారిపోయి మార్కెట్ యార్డులో దాక్కున్నారు. పీలేరు మెయిన్ రోడ్డుపై పాదయాత్ర కొనసాగుతుండగా టపాసులు కాల్చుతున్న సమయంలో సిఐ ఎన్ మోహన్ రెడ్డి కార్యకర్త కాలర్ పట్టుకుని పోలీసు జీపులోకి విసిరేశారు. టిడిపి కార్యకర్తను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తుండగా టిడిపి కార్యకర్తలు చుట్టుముట్టి నినాదాలు చేయడంతో వదిలివేశారు. యువనేత పీలేరు రైల్వేస్టేషన్ వద్ద నుంచి విడిది కేంద్రం వరకు సుమారు రెండుకిలోమీటర్లు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. వేలాది ప్రజల నీరాజనాల నడుమ రాత్రి 8.30గంటలప్రాంతంలో పీలేరు శివారులోని విడిది కేంద్రానికి పాదయాత్ర చేరుకుంది.
పీలేరును అడ్డంగా దోచుకుంటున్న ఆ ముగ్గురు!
చింతల రామచంద్రారెడ్డిని ఇక్కడ రెండుసార్లు గెలిపించారు. మీకు చింతలు తప్ప ఏమీ మిగల్లేదు. పాపాల పెద్దిరెడ్డి, మిధున్ రెడ్డి, ఎమ్మెల్యే బావమరిది హరీష్ రెడ్డి పీలేరును అడ్డంగా దోచుకుంటున్నారు. ఈ ముగ్గురూ నియోజకవర్గాన్ని కేకు ముక్కల్లా కోసుకుతింటున్నారు. ఈ నియోజకవర్గంలో రూ.500కోట్ల విలువైన 200 ఎకరాల భూమిని ఆక్రమించేందుకు పాపాల పెద్దిరెడ్డి ప్రయత్నిస్తే మన సింహం కిషోర్ కుమార్ రెడ్డి పోరాడి అడ్డుకున్నారు. దీన్ని తట్టుకోలేక సబ్ కలెక్టర్ ను పాపాల పెద్దిరెడ్డి ట్రాన్స్ ఫర్ చేయించాడు. పీలేరు నియోజకవర్గంలో కొండలు, గుట్టలను వైసీపీ వాళ్లు దోచుకుంటున్నారు. పీలేరు, కలికిరి, గుర్రంకొండ తదితర ప్రాంతాల్లో ఇల్లీగల్ క్వారీయింగ్ ద్వారా 600 కోట్లు స్వాహాచేశారు. బహుదా, మాండ్యా నదుల్లో రూ.500కోట్ల విలువైన ఇసుకను దోచుకున్నారు. పెద్దిరెడ్డి కన్నుబడిన ఏ భూమి అయినా అది స్వాహా అయినట్టే.రాత్రికి రాత్రే పేదల భూముల్లో ఫెన్సింగ్ వేసి, ఆ మరుసటి రోజు దొంగ పత్రాలు సృష్టించి లాక్కుంటున్నాడు పెద్దిరెడ్డి.
మదనపల్లి కేంద్రంగా ప్రత్యేక జిల్లా చేస్తాం!
పుంగనూరు, పీలేరు, మదనపల్లి, తంబళ్లపల్లిని ఓ ప్రత్యేక జిల్లాగా చేస్తాం. కిషోర్ కుమార్ రెడ్డిని 2024లో భారీ మెజారిటీతో గెలిపించండి…అసెంబ్లీకి పంపండి. గతంలో కంటే ఎక్కువగా పీలేరులో రెట్టింపు వేగంతో అభివృద్ధి చేస్తాం. హంద్రీనీవా, అడవిపల్లి రిజర్వాయర్లు పూర్తిచేయడంలో వైసీపీ ముందడుగు వేయలేదు. చుక్క నీరు మనకు ఇవ్వలేదు. చెరువులు, చెక్ డ్యామ్ లు వర్షాలకు కొట్టుకుపోతే ఈ ఎమ్మెల్యే బాగుచేయించలేదు. మేం అధికారంలోకి వచ్చాక మీకు సంక్షేమ పాలన అందిస్తాం. పెద్దఎత్తున పరిశ్రమలు తెచ్చి ఇక్కడి యువకులకు ఉద్యోగాలిస్తాం. టొమాటో రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించి ఆదుకుంటాం.
Also read this blog: yuvagalam continues to Make Strides Towards Success
Tagged #LokeshPadaYatra #Padayatra #YuvaGalamLokesh #YuvaGalam #NaraLokeshPadaYatra #NaraLokesh