TDP

తిరుపతిలో యువనేతకు బ్రహ్మరథం అడుగడుగునా నీరాజనాలు పలికిన జనం యువగళంతో జనసంద్రమైన ఆధ్యాత్మిక నగరం

తిరుపతి: అరాచకపాలనను అంతమొందించడమే లక్ష్యంగా యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 27వరోజు (శనివారం) తిరుపతిలో కార్యకర్తలు, అభిమానుల నీరాజనాల నడుమ ఉత్సాహంగా సాగింది. తిరుపతి వీధుల్లో జనం యువనేతకు ఎదురేగి అపూర్వస్వాగతం పలికారు.  తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర తిరుపతిలో అట్టహాసంగా కొనసాగుతోంది. నగర ప్రజలు వేలాదిగా రోడ్లపైకి వచ్చి యువనేతకు హారతులతో స్వాగతం పలికి, సంఘీభావం తెలిపారు. యువతీయువకులు కేరింతలు కొడుతూ పాదయాత్రకు బ్రహ్మరథం పట్టారు. తిరుపతి నగరానికి చెందిన పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీ గజమాలలతో యువనేతకు నీరాజనాలు పలికారు. మంగళ వాయిద్యాలు, తీన్మార్, షింకరి మేళంతో లయబద్దమైన వాయిద్యాలు, ఉరకలెత్తే ఉత్సాహం నడుమ పాదయాత్ర సాగింది. 27వ రోజు యువగళం పాదయాత్ర అంకుర హాస్పటల్ సమీపంలోని విడిది కేంద్రం నుంచి సాయంత్రం 4.30గంటల ప్రాంతంలో ప్రారంభమైంది.  ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలు తెలుసుకున్నారు. నిరుద్యోగ జెఎసికి చెందిన యువకులు తాము ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్యను లోకేష్ ఎదుట ప్రస్తావించారు. మార్గమధ్యంలో చిరు వ్యాపారుల వద్దకు వెళ్లిన లోకేష్ వారు పడుతున్న ఇబ్బందులు, టిడిపి ప్రభుత్వం వస్తే ఎం సహాయం ఆశిస్తున్నారో తెలుసుకున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే చిరువ్యాపారులకు అండగా నిలుస్తానని భరోసా ఇచ్చారు. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. వచ్చే ఆదాయంతో బతుకు భారంగా మారిందంటూ తిరుపతి నగర మహిళలు తమ ఇబ్బందులను లోకేష్ కు తెలియజేశారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ధరలు తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పి ముందుకు సాగారు. కళాంజలి షాపింగ్ మాల్ సెంటర్ వద్ద భారీ గజమాలతో స్వాగతించారు. దారిపొడవునా యువనేతపై పూలవర్షం కురిపించారు. తిరుపతిలోని 4వ డివిజన్లోని ఎస్.ఎస్.ఎన్. ఆర్. కల్యాణమండపం వద్ద భారీ గజమాలతో స్వాగతం పలికారు. హోటల్ ఉదయ్ సెంటర్ వద్ద 2వేల మంది యువనేతకు ఎదురేగి ఆహ్వానం పలికారు. బస్టాండ్ మొదలు గాంధీ సర్కిల్ వరకు రోడ్లవెంట జనం బారులు తీరి నీరాజనాలు పట్టారు. రైల్వే స్టేషన్ వద్ద మొదలు నేతాజీ రోడ్డు, బేరి వీధి వరకు రోడ్డుకిరువైపులా సుమారు 2వేలమంది పూలవర్షం కురిపించారు. బేరి వీధిలో 50మంది న్యాయవాదులు యువనేతకు సంఘీభావం తెలిపారు. బేరి వీధి వద్దనున్న పంచముఖ ఆంజనేయస్వామి సర్కిల్ వద్ద వెయ్యిమంది స్థానికులు భారీ గజమాలతో సత్కరించారు.  ప్రకాశం రోడ్డు ఎన్ఠీఆర్ సర్కిల్ వద్ద కార్యకర్తలు బాణాసంచా కాలుస్తూ కేరింతలు కొడుతూ యువనేతను స్వాగతించారు. ప్రకాశం రోడ్డు, బాలాజీ కాలనీ సర్కిల్, శ్రీ వెంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల, క్రైస్ట్ సర్కిల్ వద్ద జనం లోకేష్ కు నీరాజనాలు పట్టారు. రాత్రి 9.30గంటల ప్రాంతంలో కూడా రోడ్లవెంట జనం లోకేష్ ను చూసేందుకు బారులు తీరడం కన్పించింది. ముఖ్యంగా దారిపొడవునా యువతీయువకులు పెద్దఎత్తున యువనేత పాదయాత్రను అనుసరించారు. పాదయాత్ర ప్రారంభించాక కనీవినీ ఎరుగని జనం తిరుపతిలో హాజరుకావడంతో తెలుగుదేశం శ్రేణులు ఆనందంతో పొంగిపోయాయి.

జగన్ రెడ్డి ఇసుక దోపిడీ ఏడాది రూ.5వేల కోట్లు! ధనదాహంతో 35లక్షలమంది కార్మికులను రోడ్డున పడేశాడు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమనిధిని కూడా మింగేశాడు! అధికారంలోకి వచ్చాక ఇసుక ధరలు అందుబాటులోకి తెస్తాం! భవన నిర్మాణ కార్మికులకు చేతినిండా పనిదొరికేలా చేస్తాం భవన నిర్మాణ కార్మికుల సమావేశంలో యువనేత నారా లోకేష్

తిరుపతి: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే మెరుగైన ఇసుక పాలసీ తెచ్చి, ధర తగ్గిస్తామని టిడిపి యువనేత నారా లోకేష్ తెలిపారు. తిరుపతిలోని అంకుర ఆసుపత్రి సమీపంలోని విడిదికేంద్రంలో భవన నిర్మాణ కార్మికులతో యువనేత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా యువనేత మాట్లాడుతూ… గతంలో టిడిపి అధికారంలో ఉన్నపుడు ఇసుక ఉచితంగా ఇచ్చాం. లోడింగ్ చార్జీలు, వాహన చార్జీలు తప్ప ఏమీ లేవు. ఇప్పుడు లారీ 50వేల రూపాయలు పెట్టినా ఇసుక దొరకని పరిస్థితి నెలకొంది. గతంలో కేవలం 5రూపాయలకు అన్న క్యాంటీన్ ద్వారా శుభ్రంగా అన్నం అందించేవాళ్లం..కానీ ఈ ప్రభుత్వం రద్దు చేసింది..దాన్ని మళ్లీ వంద రోజుల్లోనే అధికారంలోకి వచ్చాక ప్రవేశపెడతాం.

పనుల్లేక 60మంది కార్మికుల ఆత్మహత్య!

వైసిపి దొంగలు మన ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ వేలకోట్లు దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఇసుకపై ఏడాదికి రాష్ట్రవ్యాప్తంగా రూ.5వేలకోట్లు దోచుకుంటున్నాడని, ఒక్క చిత్తూరు జిల్లాలోనే రోజుకు రూ.3కోట్లరూపాయలు వసూలు చేస్తున్నాడని ఆరోపిస్తూ, ఈ దోపిడీని తాను ఆధారాలతో సహా నిరూపించగలనని సవాల్ విసిరారు.  జగన్ సీఎం అయ్యాక ఎక్కువ ఇబ్బంది పడింది భవన నిర్మాణ కార్మికులే. టీడీపీ తీసుకొచ్చిన ఇసుక విధానం రద్దు చేసి మెరుగైన ఇసుక విధానం తెస్తానని బినామీలతో దోపిడీపర్వానికి తెరలేపాడు. ఏపీలో బంగారం సులభంగా దొరుకుంది కానీ ఇసుక దొరకదు. ఇసుక అందుబాటులో లేకపోవడవంతో పనుల్లేక 60 మంది కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. బాధిత కుటుంబాలకు అండగా నిలబడి ఆర్థికంగా ఆదుకుంది టీడీపీనే. ప్రభుత్వం కూడా మందుకు రాలేదు. భవన నిర్మాణ కార్మికులే కాదు..పురోహితులు, ఫాదర్ లు కూడా ఇసుక లేక ఇబ్బంది పడుతున్నారు. తాపీ మేస్త్రీ నుండి పెయింటర్, వుడ్ వర్కర్ వరకూ అందరూ ఇసుకపైనే ఆదారపడతారు. చంద్రబాబు ఉన్నప్పుడు ట్రక్కు ఇసుక వెయ్యి ఉంటే ఇప్పుడు ఐదు వేలు. ఎక్కడ చూసినా ఇసుక ఉంది..ప్రొక్లెయిన్ ఉంటోంది..కానీ కార్మికులకు మాత్రం పని దొరకదు.

ఇసుకలో ఏడాదికి రూ.5వేలకోట్లు దోపిడీ!

ఒక్క ఇసుక లోనే జగన్ ఏడాదికి రూ.5వేల కోట్లు దోచుకుంటున్నారు.  జగన్ రోజుకు ఇసుక ద్వారా ఒక్క ఉమ్మడి చిత్తూరుజిల్లాలోనే రోజుకు రూ.3 కోట్లు సంపాదిస్తున్నారు..నేను నిరూపిస్తా. ఏపీ ఇసుక తెలంగాణ, కర్నాటకలో ఉంటోంది. ఆంధ్రా ఇసుక ఈ రాష్ట్రంలో మాత్రం దొరకదు. భారతీ సిమెంట్ జగన్ దే. చంద్రబాబు సీఎంగా ఉనప్పుడు సిమెంట్ ధర పెరిగితే యజమానులను పిలిచి ధర తగ్గించకపోతే కరెంట్ కట్ చేస్తామని చెప్పారు. దీంతో వారు తగ్గించేవారు.  కానీ ఈ ప్రభుత్వం వచ్చాక 60 శాతం పెంచింది. ప్రతి బస్తాకు జె-ట్యాక్స్ వసూలు చేస్తున్నారు.  స్టీల్, పెయింట్, ఐరన్ రేట్లు కూడా పెరిగాయి.సామాన్యుడు ఇళ్లు కట్టుకునే స్థితిలో ఇప్పుడు లేరు. రోడ్లు, భవనాలు, ప్రహరీల నిర్మాణం మా హయాంలో బాగా జరిగేవి. దీంతో అందరికీ పని దొరికేది. పంచాయతీ రాజ్ మంత్రి ఏం పీకుతున్నారు? డిప్యూటీ సీఎం నియోజకవర్గంలో రోడ్లన్నీ గుంతలే.

కార్మిక సంక్షేమ బోర్డు నిధులనూ దారిమళ్లించారు!

మీకు ప్రత్యేక చట్టం తీసుకొచ్చి బోర్డు ఏర్పాటు చేసి, కాంట్రాక్టు వర్కులో సెస్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించేవాళ్లం. ఆర్థికంగా మిమ్మల్ని ఆదుకునేందుకు ఏర్పాటు చేసిన బోర్డు అది. రూ.850 కోట్లు ఈ ప్రభుత్వం బోర్డు నుండి దారి మళ్లించింది. వెబ్ సైట్ నడిపించే పరిస్థితిలోనూ వాళ్లు లేరు. మెంబర్ షిప్ కు మీ నుండి రూ.110లు లాగుతున్నాడు. ఆసుపత్రిలో చేరితో రీయింబర్స్ ఇవ్వడంలేదు. 1214 సర్క్యులర్ తెచ్చి బీమా క్లెయిమ్ చేయొద్దొని నిబంధనలు పెట్టారు. మీ సంక్షేమం కోసం కేంద్రం నిధులు కేటాయించింది. 30 శాతం నిధులు మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి ఆసుపత్రులు నిర్మాణానికి భూమి కూడా కేటాయించాం. భవన నిర్మాణ కార్మికులకు కట్టే ఆసుపత్రి భూమిని కూడా వేరే దానికి కేటాయించుకున్నారు. టిడిపి హయాంలో పనిముట్లు ఇచ్చాం..అన్న క్యాంటీన్ మీకోసం ఏర్పాటు చేశాం.

35లక్షలమంది కార్మికులూ జగన్ బాధితులే!

కానీ ఒక్క అవకాశం అనగానే జగన్ కు మీరు అవకాశం ఇచ్చారు. నేను చేసే ఆరోపణలు ఖండించే స్థితిలో కూడా మంత్రులు లేరు. నన్ను బూతులు తిట్టడం తప్ప సబ్జెక్టుపై మాట్లాడరు. కార్మిక శాఖా మంత్రిగా జయరాం ఒక్కరోజు కూడా కార్మికుల గురించి మాట్లాడలేదు. 35 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులుగా ఉన్నారు. మీరందరూ ఈ ప్రభుత్వం చేతిలో బాధితులు. తప్పుడు హామీలిచ్చి మీతో డబ్బులు ఖర్చు పెట్టించారు. దాని వల్ల జిరాక్స్ షాపులో బాగుపడ్డాయి. కనీసం కేంద్రం ఇచ్చే నిధులు కూడా ఈ ప్రభుత్వం ఖర్చు చేయడం లేదు. గతంలో మీకోసం బోర్డు పెట్టాం..దాన్ని మళ్లీ ప్రవేశపెడతాం. మీనెత్తిన ఎంత  అప్పు తీశారో తెలీదు..భవన నిర్మాణ కార్మికుల పేరుతో అప్పు చేసినా ఆశ్చర్యం లేదు. మద్య నిషేధం అని ఓ వైపు చెప్పి..దాని ఆదాయాన్ని చూపి రూ.25 వేల కోట్లు అప్పులు తెచ్చారు. గతంలో ఎన్ని క్లెయిమ్ లు వచ్చాయి..ఎంత మందికి బీమా అందించారో కూడా చంద్రబాబు ఉన్నప్పుడు సమీక్ష చేసేవారు.  మీరు ప్రభుత్వం చుట్టూ తిరగడం కాదు.. మీ చుట్టూ ప్రభుత్వం తిరిగేలా చేస్తాం.

తిరుపతి ఎమ్మెల్యే పుత్రరత్నం అడ్డగోలు దోపిడీ!

తిరుపతికి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు..తండ్రి మద్యం తాగొద్దు అంటే మద్యం సిండికేట్ ఏర్పాటు చేసింది మాత్రం కొడుకు అభినయ్ రెడ్డి. తిరుపతిలో భూముల రిజిస్ట్రేషన్ ఆపింది కూడా ఎమ్మెల్యే కొడుకే. ఇక్కడ కరుణాకర్ రెడ్డి ఎమ్మెల్యే కాదు..అభినయ్ రెడ్డి ఎమ్మెల్యే. తన స్నేహితులను రిజిస్ట్రేషన్ ఆఫీసుల ముందు కూర్చోబెడతారు. బోరు వేయాలన్నా..ప్రహరీ కట్టాలన్నా అభినయ్ రెడ్డికి కప్పం కట్టాలి. కరుణాకర్ ది తిరుపతి కాదు..కడప జిల్లా. మాటలు జబర్థస్త్ గా తండ్రి చెప్తే..కొడుకు జబర్థస్త్ గా దోచుకుంటాడు. టిడిపి అధికారంలోకి వచ్చాక రిజిస్ట్రేషన్లో కూడా ఈసారి ఆన్లైన్ విధానం తీసుకొస్తాం. తిరుపతిలో 2,300 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయకుండా ఈ ఎమ్మెల్యే కొడుకు ఆపేశారు. జగన్ పెద్ద దొంగ..అభినయ్ రెడ్డి చిన్నదొంగ. దేవుడి టికెట్లు కూడా అమ్ముకుంటున్నారు.

కార్పెంటర్లకు వర్క్ షెడ్లను నిర్మిస్తాం!

కార్పెంటర్లకు వర్క్ షెడ్ ప్రభుత్వం నిర్మించి దానికి సర్వీస్ ఛార్జ్  మాత్రమే వసూలు చేసేలా చేస్తాం. పెన్షన్ పరిమితి వయసు తగ్గించాలని చాలా మంది అడుగుతున్నారు. ఇది అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. 2019కిముందు ఇసుక ధర, పెయింట్ ధర, చెక్క ధర ఎంత ఉందో ఇప్పుడు ఎంత ఉందో కార్మికులు ఆలోచించాలి. ఉచితంగా ఏమీ వద్దు..చేతి నిండా పని చూపించండని కార్మికులు అడుగుతున్నారు. జగన్ లా ఊరూరా హామీలిచ్చి..తర్వాత నాకు తెలీదు..హామీ ఇవ్వలేదు అని నేను అనను.

భవన నిర్మాణ కార్మికుల సమావేశంలో కార్మికుల అభిప్రాయాలు:

మా నిధులు దారిమళ్లించారు!

సమావేశంలో భవననిర్మాణ కార్మికులు మాట్లాడుతూ…. ఇసుక, సిమెంట్ ధరలు పెరగడంతో పనుల్లేక ఇబ్బంది పడుతున్నాం. అన్నా క్యాంటీన్ లేక రూ.50 నుండి రూ.70ల వరకు ఖర్చు పెట్టి భోజనం కొనుక్కుంటున్నాం. భవన నిర్మాణం రంగంపై 26 రంగాలు ఆధారపడ్డాయి. మా సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన నిధులు దారి మళ్లించారు. లేబర్ కార్డుతో ఆసుపత్రికి వెళ్తే నిధులు లేవని చెప్తున్నారు. లేబర్ కార్డు ద్వారా ప్రతి కార్మికుడికి బీమా అందించాలి. కార్పెంటర్లకు వర్క్ షెడ్లు నిర్మించాలి.

అన్నక్యాంటీన్ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. -శ్రీనివాస్, భవన నిర్మాణ కార్మికుడు

ఈ ప్రభుత్వం వచ్చాక ఇసుక, సిమెంట్ ధరలు పెరగడంతో మేము పనుల్లేక ఇబ్బంది పడుతున్నాం. ఇసుక విధానం ఘోరంగా ఉంది. నిర్మాణ రంగంపై జీఎస్టీ వేయడం వల్ల పనులు చేయించేవాళ్లు భయపడుతున్నారు. అన్నా క్యాంటీన్ లేక రూ.50 నుండి రూ.70లు ఖర్చు పెట్టి బయట భోజనం కొనుక్కుని తింటున్నాం. 

లేబర్ కార్డు పనిచేయడం లేదని చెప్తున్నారు -విజయ్ కుమార్, భవన నిర్మాణ కార్మికుడు

భవన నిర్మాణ కార్మికులకు లేబర్ కార్డు ఉంది. ఆరోగ్యం బాగులేనప్పుడు లేబర్ కార్డు తీసుకుని ఆసుపత్రికి వెల్తే దానికి నిధులు లేవని చెప్తున్నారు. మీరు అప్లై చేసుకున్నా మేము ఏమీ చేయలేమని చెప్తున్నారు. సమస్య చెప్పటానికి సైట్ కూడా పనిచేయడం లేదు. లక్షల మందిని క్రోడీకరించి టీడీపీ ప్రభుత్వం వచ్చేందుకు ప్రయత్నం చేస్తాం.

ఇన్సూరెన్స్ అప్లికేషన్లు తీసుకోవడం లేదు -లక్ష్మీపతి నాయుడు, భవన నిర్మాణ కార్మికుడు

భవన నిర్మాణ కార్మికులకు చంద్రబాబు ఉన్నప్పుడు వృత్తిపనిముట్లు ఇచ్చేవారు. ఇప్పడు కనీసం బతకడానికి పనులు కూడా లేవు. బోర్డు నుండి ఎటువంటి క్లెయిమ్స్ తీసుకోవడం లేదు. లేబర్ కార్డు ద్వారా కార్మికుడికి ప్రభుత్వం ఇన్సూరెన్స్ అందించాలి.

ల్యాండ్ రిజిస్ట్రేషన్లు నిలిపేశారు -బాలాజీ, ఎలక్ట్రీషియన్

నేను ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తా. గతంలో నా వద్ద 20 మంది యువకులు పనిచేసేవారు. తిరుపతిలో 2,300 ఎకరాల్లో ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఆపేశారు. దీంతో పనులు జరగక చాలా మంది పక్కరాష్ట్రాలకు వెళ్లారు. చిన్నచిన్న పనులు, చేసుకోవడానిక కూడా లేదు. 20 మందికి పని కల్పించిన నేను ఇప్పుడు కూలీకి వెళ్తున్నా.

ఉచితాలు అవసరం లేదు..చేతినిండా పని కావాలి -సుబ్బూయాదవ్, భవన నిర్మాణ కార్మికుడు

కరోనా సమయంలో పనిలేక ఆకలితో ఇబ్బందిపడ్డాం. దేశంలో ఎక్కవ ఇబ్బంది పడింది భవన నిర్మాణ కార్మికులే. సామాన్యుడు ఇళ్లు కట్టుకోవాలంటే ఇసుక దొరకడం లేదు. అన్న క్యాంటీన్ కు కుటుంబంతో సహా వెల్లి రూ.5లతో అన్నం తినేవాళ్లం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.  పనులు వదులుకుని లేబర్ ఆఫీసుకు డాక్యుమెంట్లు సమర్పిస్తే కనీసం లేబర్ కార్డు కూడా ఇవ్వలేదు. కార్మికుల ఇంట్లో వివాహం జరిగితే పెళ్లి కానుక ఇచ్చేవారు. మాకు 45 ఏళ్లు దాటిన వారికి పెన్షన్ ఇవ్వాలి. 40ఏళ్లకు మించి భవన నిర్మాణ కార్మికులు పనిచేయలేకపోతున్నారు. టీడీపీ వచ్చాక అన్న క్యాంటీన్ తెరిపించాలి..ఇసుక ఉచితంగా అందించాలి. మాకు ఉచితాలు వద్దు..చేతినిండా పని కావాలి.

వర్క్ షెడ్లు నిర్మించాలి:రత్నమాచారి

చెక్క పనులు, గ్లాస్ పనులు చాలా ప్రమాదం. పొరపాటు జరిగిందంటే ప్రాణాలు పోతాయి. మాకు కూడా ప్రమాద బీమా వర్తింపచేయాలి. వసతులతో వర్క్ షెడ్లు నిర్మించాలి.

దిక్కూమొక్కూలేని దిశ‌చ‌ట్టానికి మ‌ళ్లీ పోలీసుస్టేష‌న్లా? దిశపోలీస్ స్టేషన్ వద్ద సెల్ఫీ దిగిన యువనేత లోకేష్

తిరుపతి పట్టణంలో పాదయాత్ర దారిలో దిశ పోలీస్ స్టేషన్ వద్ద కొద్దిసేపు ఆగిన యువనేత లోకేష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పాద‌యాత్రలో ప్రజ‌ల స‌మ‌స్యలు చూస్తున్నాను. వారి క‌ష్టాలు వింటున్నాను. జ‌గ‌న్ రెడ్డి జ‌నాల‌కి చేసిన మోసాలు ప్రతీచోటా సాక్ష్యాలుగా క‌నిపిస్తున్నాయి. దిశ చ‌ట్టమే అస‌లు లేదు. మ‌హిళ‌ల‌పై దాడుల‌కి పాల్పడితే 21 రోజుల్లో నిందితుల్ని శిక్షించే దిశ చ‌ట్టం తెచ్చామ‌ని సిగ్గులేకుండా  ప్రచారం చేసుకుంటున్నారు. జ‌గ‌న్ రెడ్డి పాల‌న‌లో వంద‌లాది యువ‌తులు, మ‌హిళ‌లు మృగాళ్ల దురాగ‌తాల‌కు బ‌ల‌య్యారు. నేషనల్ క్రైమ్​ రికార్డ్స్​బ్యూరో రికార్డుల ప్రకారం ఏపీలో ప్రతీ 45 నిమిషాలకి ఒక మ‌హిళ‌పై  దాడి జ‌రుగుతోంది. జ‌గ‌న్‌రెడ్డి పాల‌న‌లో సుమారు 2500 మందికి పైగా మ‌హిళ‌లపై అఘాయిత్యాలు జ‌రిగాయి. మ‌హిళ‌ల‌పై వేధింపులు, దాడుల‌పై పోలీసులు న‌మోదు చేసిన కేసులే 25 వేలుంటే, న‌మోదు చేయ‌ని కేసులు ఇంకెన్ని వేలున్నాయో? సీఎం ఇంటి ప‌క్కనే యువ‌తిపై అత్యాచారం జ‌రిగితే ఇప్పటివ‌ర‌కూ నిందితుడ్ని ప‌ట్టుకోలేని దిక్కుమాలిన పాల‌న‌. సీఎం ఇంటికి స‌మీపంలో అంధ ద‌ళిత యువ‌తిని న‌రికి చంపేస్తే, గంజాయి తాగి కాదు..మ‌ద్యం తాగి చంపాడు అదేం అంత పెద్ద నేరం కాద‌ని మ‌హిళా హోం మంత్రి చెప్పిన తీరు రాష్ట్రంలో మ‌హిళ‌ల ప్రాణాల‌కు ర‌క్షణ‌లేద‌ని తేల్చేసింది. ఇప్పటివ‌ర‌కూ మ‌హిళ‌ల‌పై దాడిచేసిన నిందితుల‌లో ఒక్కరిపైనా కూడా దిశ‌చ‌ట్టం కింద‌ కేసు పెట్టలేదు. అంటే చ‌ట్టమే లేద‌ని తేలిపోతోంది. లేని చ‌ట్టానికి దిశ పోలీస్ స్టేష‌న్లు మాత్రం పెట్టారు. జ‌గ‌న్ చేసిన వంద‌ల మోసాల్లో ఇదొక మోసం. గ‌న్ కంటే ముందొస్తాడ‌న్న జ‌గ‌న్ ఇన్నేళ్లయినా రాలేదు. 21 రోజుల్లో నిందితుల‌కు శిక్ష అన్నారు, ఒక నిందితుడిపైనైనా దిశ‌చ‌ట్టం కింద కేసు క‌ట్టలేదు. నా పాద‌యాత్ర తిరుప‌తి ప‌ట్టణం రైల్వేస్టేష‌న్ రోడ్డులో సాగుతుండ‌గా దిశ పోలీస్ స్టేష‌న్ క‌నిపించింది. సెల్ఫీ తీశాను. జ‌గ‌న్ రెడ్డి గారు మ‌రో ఏడాదిలో ఇంటికెళిపోతున్నారు మీరు తెచ్చాన‌ని చెబుతున్న దిశ చ‌ట్టం ఏ దిక్కుకు పోయిందో చెబుతారా? అంటూ యువనేత వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

=====

*టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర వివరాలు:*

*ఇప్పటి వరకు నడిచిన దూరం కి.మీ. 354.1 కి.మీ.*

Tagged #LokeshPadaYatra #Padayatra #YuvaGalamLokesh #YuvaGalam #NaraLokeshPadaYatra #NaraLokesh #Yuvagalam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *