TDP

300 కిలోమీటర్ల మైలురాయి దాటిన యువగళం! తొండ‌మానుపురానికి లోకేష్ వరం… 100రోజుల్లో తాగునీటి పథకం

13 గ్రామాల దాహార్తి తీర్చే తాగునీటి కొరత తీరుస్తానని యువనేత ప్రకటన

శ్రీకాళహస్తి: టిడిపి యువనేత నారా లోకేష్ చేప‌ట్టిన యువ‌గ‌ళం పాద‌యాత్ర… వైసీపీ స‌ర్కారు అడుగ‌డుగునా పెడుతున్న అడ్డంకుల‌ని అధిగ‌మిస్తూ ముందుకు సాగుతోంది. వేసే ప్ర‌తీ డుగు ప్రజ‌ల కోస‌మేనంటున్న నారా లోకేష్‌… ప్రతీ వంద కిలోమీట‌ర్ల మ‌జిలీలోనూ ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రకటిస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రతి 100 కిలోమీటర్లను చేరుకున్నాక సంబంధిత పట్టణం లేదా గ్రామంలో ఒక ప్రధాన స‌మ‌స్యని గుర్తించి అధికారంలోకి వచ్చాక వందరోజుల్లో సంబంధిత సమస్యను ప‌రిష్కార‌నంటూ భరోసా కల్పిస్తున్నారు. శ్రీకాళ‌హ‌స్తి నియోజ‌క‌వ‌ర్గంలోని తొండ‌మానుపురం పంచాయ‌తీలో యువగళం పాద‌యాత్ర  మంగళవారం 300 కిలోమీట‌ర్ల మైలురాయికి చేరుకుంది. ఈ సంద‌ర్భంగా ఈ పంచాయ‌తీ ప‌రిధిలో 13 గ్రామాల దాహార్తి తీర్చే ర‌క్షిత మంచి ప‌థ‌కాన్ని టిడిపి ప్రభుత్వం వ‌చ్చిన వంద రోజుల్లో ఏర్పాటు చేస్తాన‌ని  లోకేష్ ప్రక‌టించారు. ప‌క్కనుంచే న‌ది ప్రవ‌హిస్తున్నా చ‌ల్లపాలెం, వెంక‌టాపురం, సుబ్బనాయుడు కండ్రిగ‌, తొండ‌మ‌నాడు, చెర్లోప‌ల్లి, అమ్మపాళ్యం, కొత్తపాలెం, మున్న స‌ముద్రం, బొక్కసం పాలెం, సిద్ధయ్య గుంట‌, మ‌ర్లపాకు, రాచ‌గున్నేరి, మ‌ద్దిలేడు గ్రామ‌వాసులు తాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ స‌మాచారం తెలుసుకున్న నారా లోకేష్ త‌న పాద‌యాత్ర 300 కి.మీ. మ‌జిలీ చిర‌కాలం గుర్తుండేలా తాగునీటి ప‌థ‌కం ఏర్పాటుచేసి, ప్రతీ ఇంటికి నీరందించే ఏర్పాటు చేస్తాన‌ని హామీ ఇచ్చారు. లోకేష్ హామీ ఇచ్చారంటే..అది చెప్పిన స‌మ‌యానికి  చెప్పిన‌ట్టే అమ‌లు చేసి తీరుతారు. ఇప్పటికే ఈ విషయాన్ని పలు సందర్భాల్లో ఆయన రుజువు చేశారు.

పాదయాత్రలో లోకేష్ వద్ద వ్యక్తమైన అభిప్రాయాలు:

కౌలు రైతులను పట్టించుకోవాలి- చంద్రమ్మ, కౌలు రైతు

భూమి కౌలుకు తీసుకుని వరి సాగు చేశాం. ఎకరాకు పది బస్తాలు చొప్పున కౌలు ఇవ్వాలి.  గత ఏడాది అన్నీ పోగా రూ.50 వేల నష్టం వచ్చింది. పురుగు మందులు, ఎరువుల ధరలు, కూలీలు పెరిగాయి. రైతు భరోసా కౌలు రైతులకు ఇవ్వకుండా భూమి కలిగిన వారికే ఇస్తున్నారు. నష్టపరిహారం కూడా మాకు ఇవ్వడం లేదు. వడ్లను ప్రభుత్వం కొనక పోవడం వల్ల  తక్కువ రేటుకు మిల్లర్లకు అమ్ముకుంటున్నాం.  ఇలాగైతే కౌలు రైతులు  వ్యవసాయం ఎలా చేయాలి.? (తొండమనాడు ఊరు శివారులో వరి రైతులను లోకేష్ కలిసినప్పుడు చెప్పారు).

మా ఇసుక చెన్నై, బెంగళూరు తీసుకెళ్తున్నారు! – ఎన్.సుధాకర్, సుబ్బానాయుడు కండ్రిక

స్థానికంగా లభించే ఇసుక ఇక్కడి వాసులు వేల రూపాయలు పెట్టి కొంటున్నారు. వైసీపీ నాయకులు చెన్నై, బెంగళూరు తరలించి లక్షల్లో సంపాదిస్తున్నారు. ఇసుక రీచ్ లలో యంత్రాలు పెట్టడం వల్ల పని చేసుకునేవారికి కూలీ కూడా దొరకడం లేదు. శ్రీకాళహస్తిలో ప్రతి శుక్రవారం నిర్వహించే సంతను కూడా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తీసేయించారు. (సుబ్బానాయుడు కండ్రికలో స్థానికులతో చెట్టుకింద కూర్చుని మాట్లాడినప్పుడు చెప్పాడు)

పంటకు గిట్టుబాటు ధర లేదు: రైతుల ఆవేదన

శ్రీకాళహస్తి: పాదయాత్ర దారిలో తొండమానుపురంలో వరి పొలంలో పురుగుల మందు పిచికారి చేస్తున్న రైతులతో లోకేష్ కొద్దిసేపు ముచ్చటించి వారి సాదకబాధలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు తమ గోడు విన్పిస్తూ… విత్తనం దగ్గర నుండి పురుగుల మందులు, ఎరువుల వరకూ రెట్లు విపరీతంగా పెరిగిపోయాయి.  నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల వలన తీవ్రంగా నష్టపోతున్నాం. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదని ఆవేదన వ్యక్తంచేశారు.

గ్యాస్ ధరలు పెరిగాయి, సబ్సిడీ రావడంలేదు -లోకేష్ ఎదుట మహిళల ఆవేదన

శ్రీకాళహస్తి: తొండమానుపురం గ్రామంలో గ్యాస్ సిలిండర్ తీసుకోవడానికి వచ్చిన మహిళలతో లోకేష్ మాట్లాడారు. నిత్యావసర సరుకుల ధరలు, గ్యాస్ ధర విపరీతంగా పెరిగిపోయాయి. గతంలో గ్యాస్ కి ఇచ్చిన సబ్సిడీ కూడా రావడం లేదు.  పన్నులు విపరీతంగా పెరిగిపోయాయి. కరెంట్ ఛార్జీలు, చెత్త పన్ను, ఇంటి పన్ను అంటూ ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. ఆదాయాలు మాత్రం పెరగడంలేదని మహిళలు ఆవేదన వ్యక్తంచేశారు.

లోకేష్ స్పందన:

వైసిపి ప్రభుత్వం వేస్తున్న పన్నుల వలనే నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. గ్యాస్ ధర ఆకాశానికి చేరింది. ప్రజల పై పన్ను భారం తగ్గించాలి.  సామాన్యులు, పేద వారు బ్రతికే పరిస్థితి లేదు. టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే పన్నుల భారం తగ్గించడానికి ప్రత్యేక ప్రణాళిక సిద్దం చేస్తాం.

మహిళా రెసిడెన్షియల్ కాలేజి ఏర్పాటుచేస్తాం!

 గతంలో ఈ ప్రాంతంలో ముస్లిం విద్యార్థినులకు రెసిడెన్షియల్ కాలేజీ కేటాయించింది పనులు ప్రారంభిస్తే ఈ ప్రభుత్వం నిలిపేసింది.  ముస్లింలు ఎక్కువగా ఉన్న పార్లమెంట్ పరిధిలో మహిళా రెసిరెన్షియల్ కాలేజీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది..చేస్తాం.  తిరుపతి పార్లమెంట్ లో మహిళలకు రెసిరెన్షియల్ కాలేజీ ఏర్పాటు చేస్తాం. వైసిపి ప్రభుత్వం యువతను గంజాయి మత్తులో దించుతోంది. ప్రతి గ్రామంలో గంజాయి ఉంది. ఉడ్తా పంజాబ్ చూశాం..ఇప్పుడు ఉడ్తా ఏపీ చూస్తున్నాం. సీఎం నివాసం పరిధిలోనే గంజాయి ఎక్కువగా ఉంది.

ముస్లింలపై పెరిగిన అకృత్యాలు

వైసిపి అధికారంలోకి వచ్చాక ముస్లింల హత్యలు, అత్యచారాలు పెరిగాయి. హజీరా అనే యువతిని కర్నూలు జిల్లాలో చంపేశారు. పలమనేరులో మిష్బాను బెదిరించడంతో చనిపోయింది.  ముస్లింలు విద్యార్థులు బాగా చదవకూడదా.?  శ్రీకాళహస్తిలో నిర్మించిన టిడ్కో ఇళ్లలో 20 శాతం మైనారిటీలకు ఇస్తాం. మైనారిటీ కార్పొరేషన్ మళ్లీ ఏర్పాటు చేస్తాం. 31 మంది వైసీపీ ఎంపీలు పార్లమెంట్ లో ఉన్నారు..కానీ ఎన్.ఆర్.సీ, సీఏఏ గురించి మేమే మాట్లాడాం.   ప్రభుత్వ షరతులతో దుల్హన్ 90 శాతం మందికి రాదు. 2014 నుండి 2019 వరకు ముస్లింలపై దాడులు జరిగాయా? ఈ ప్రభుత్వం ఐదుగురికి పదవులు ఇస్తే ముస్లింలకు న్యాయం జరగదు.  ఇంట్లో వృద్ధులు ఉన్నా..ఒంటరి మహిళలు ఉన్నా చంద్రబాబు పెన్షన్ ఇచ్చారు. కానీ ఈ ప్రభుత్వం ఒకరికే ఇస్తోంది.  టీడీపీ రాగానే ముస్లింలకు ఇచ్చిన హామీలు మూడేళ్లలోపే అమలు చేస్తాం.

లోకేష్ ఎదుట సమస్యల ఏకరువు

ముఖాముఖి సమావేశంలో లోకేష్ ఎదుట ముస్లింలు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. ముస్లింలకు ఈ సీఎం ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు.  దుల్హన్ పథకం పొందాలంటే ఎన్నో ఆంక్షలు పెట్టారు. ముస్లింలకు రెసిడెన్షియల్ కాలేజీ ఏర్పాటు చేయాలి. గత ప్రభుత్వం కేటాయించిన ఇళ్లులు మా ముస్లింలకు ఇవ్వడం లేదు.  ఒంటరి మహిళలకు పెన్షన్ ఇవ్వడం లేదు. మైనారిటీ కార్పొరేషన్ పున:ప్రారంభించాలి. ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేయాలి. ముస్లింలపై జరిగే దాడులు అరికట్టాలి.

లోకేష్ ను కలిసిన గాండ్ల సామాజిక వర్గీయులు

శ్రీకాళహస్తి: పాదయాత్ర దారిలో యువనేత నారా లోకేష్ ను  శ్రీకాళహస్తి నియోజకవర్గ గాండ్ల సామాజికవర్గ ప్రతినిధులు కలిసి వినతిపత్రం సమర్పించారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… రాష్ట్రంలో మా సామాజికవర్గం ప్రజలు విభజిత ఆంధ్రప్రదేశ్ లో 15లక్షల మంది ఉన్నాం. చిత్తూరు జిల్లాలో సుమారు 4లక్షల మంది ఉన్నారు. కుప్పంలో 80వేల మంది ఉన్నారు. మా ప్రధాన కుల వృత్తి చెక్కగానుగ, యాంత్రికగానుగ, నూనె ఉత్పత్తి. గాండ్ల, తెలికుల, దేవ తెలికుల కార్పొరేషన్ కు సంవత్సరానికి రూ.100కోట్లు నిధులిచ్చి అభివృద్ధి చేయాలి. గానుగలు నడుపుతున్న కుటుంబాలకు 300 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా అందించాలి. గతంలో ప్రముఖ దేవాలయాలకు దీపారాధన కోసం నూనె సరఫరాలో కేవలం గాండ్ల, తెలికుల కులస్తులకు ప్రాధాన్యత ఉండేది. దాన్ని పునరుద్ధరించాలి. ప్రముఖ పట్టణాల్లో మా సామాజిక భవనాల నిర్మాణానికి వెయ్యి చదరపు గజాల ప్రభుత్వ స్థలాలు కేటాయించాలి. రాజకీయంగా వెనుకబడిన మా సామాజికవర్గానికి దేవాలయాల పాలక మండళ్లలో నామినేటెడ్ పదవులు కేటాయించాలి. చట్టసభల్లో ఒక ఎమ్మెల్సీ పదవికి మా సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని నామినేట్ చేయాలి. మా సామాజికవర్గంపై కొనసాగుతున్న అస్పృశ్యతను అరికట్టి, గౌరవించబడేందుకు చట్టబద్ద చర్యలు చేపట్టాలి. 60ఏళ్లు నిండిన మా సామాజికవర్గ వృద్దులకు రూ.5వేలు పెన్షన్ మంజూరు చేయాలి. గాండ్ల సామాజికవర్గ పిల్లలకు విద్యావసతులకై మెరుగైన ఆర్థిక సాయాన్ని ప్రకటించాలని కోరారు.

లోకేష్ స్పందన:

గాండ్ల సామాజికవర్గానికి గుర్తింపునిచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదే. అన్ని రంగాల్లో గాండ్ల, తెలికుల, దేవతెలికుల అభ్యున్నతికి గతంలో అనేక సంక్షేమ చర్యలు చేపట్టాం. గాండ్ల సామాజికవర్గం నుండి గౌనివారి శ్రీనివాసులు, గోపినాథ్, బగిడి గోపాల్, బచ్చల పుల్లయ్య వంటి వారికి ఎమ్మెల్సీలుగా అవకాశాలిచ్చి పెద్దపీట వేశాం. గాండ్ల కులస్తులను ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లేందుకు చంద్రబాబు ఇప్పటికే ప్రణాళికతో ఉన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక గాండ్ల, తెలికుల, దేవ తెలికుల కులస్తులకు న్యాయం చేస్తాం. న్యాయబద్దమైన డిమాండ్లన్నింటినీ పరిశీలించి అవకాశాలు కల్పిస్తాం.

దిగుబడులు తగ్గాయి… ఖర్చులు పెరిగాయి! ప్రతిఏటా నష్టమే తప్ప లాభం లేదన్న వేరుశనగ రైతన్న

వెంకటాపురంలో పాదయాత్ర దారిలో వెంకటరెడ్డి అనే వేరుశనగ రైతును యువనేత లోకేష్ కలిశారు.  ఈ సందర్భంగా రైతు వెంకటరెడ్డి తమ ఇబ్బందులను వివరిస్తూ… మూడేళ్లుగా వ్యవసాయంలో తీవ్రమైన నష్టాలను ఎదుర్కొంటున్నాం. సకాలంలో విత్తనాలు దొరకడం లేదు…దొరికే విత్తనాలన్నీ నకిలీవే. ఎకరాకు ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు అన్నీ కలిపి పెట్టుబడి రూ.80వేలు ఖర్చవుతోంది. ఎరువులు, కూలీ రేట్లు రెండింతలు పెరిగాయి. పెట్టుబడులు పెరిగిపోవడంతో వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదు. గతంలో ఎకరాకు 40బస్తాల దిగుబడి వచ్చేది. నేడు నకిలీ ఎరువులు, నకిలీ విత్తనాల వల్ల ఎకరాకు 20 బస్తాలకు మించి దిగుబడి రావడం లేదు. గత మూడున్నరేళ్లుగా ప్రతియేటా నష్టాలబారిన పడుతూ వస్తున్నాం, అప్పుల ఊబిలో కూరుకుపోయాం.. కనీసం మీరైనా మా రైతులను ఆదుకోవాలని కోరారు.

రేణిగుంటలో వన్యకుల క్షత్రియులకు 5 ఎకరాలు!

రేణిగుంటలో వన్యకుల క్షత్రియులకు 5ఎకరాల భూమిని అధికారంలోకి వచ్చాక కేటాయిస్తాం. వన్యకుల క్షత్రియులను ఎంబీసీ లోకి చేర్చే అంశాన్ని సత్యపాల్ కమిటీ రిపోర్టును ఆధారంగా చేసుకుని మీ కోరికను నెరవేరుస్తాం. శ్రీకాళహస్తి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీలో 2వేల మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు నిలిపేశారు. మనం అధికారంలోకి వచ్చిన 3నెలల్లో సర్టిఫికెట్లు ఇచ్చేస్తాం. ఆ కాలేజీని ప్రక్షాళన చేస్తాం.

వన్యకుల క్షత్రియుల సమావేశంలో అభిప్రాయాలు:

సుబ్రహ్మణ్యం: శ్రీకాళహస్తి నుండి కుప్పం వరకు వన్యకుల క్షత్రియులు అధిక సంఖ్యలో ఉన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక వన్యకుల క్షత్రియుల సంక్షేమానికి పెద్దపీట వేయాలని కోరుతున్నాం.

సుబ్రహ్మణ్యం రెడ్డి: టీడీపీ హయాంలో మాకు అనేక అభివృద్ది కార్యక్రమాలు జరిగాయి..కొన్ని పెండింగ్ లో ఉండిపోయాయి. మాకు ఆర్థికంగా, రాజకీయంగా, వ్యవసాయరంగంలో మాకు ఊతమివ్వండి..మీతోనే మేము వెన్నంటి నడుస్తాం..మా నియోజకవర్గంలో భారీ మెజారిటీతో టీడీపీని గెలిపిస్తాం.

దొరయ్యరాజు రెడ్డి: మా నియోజకవర్గంలో కమ్యూనిటీ భవనం అవసరం ఉంది, దాన్ని మాకు ఏర్పాటు చేయండి. మా నియోజకవర్గంలోని నామినేటెడ్ పోస్టుల్లోనూ మాకు రిజర్వేషన్ అమలు చేసి పదవులు ఇప్పించాలని కోరుతున్నాం.

గుణశేఖర రెడ్డి: 1985 నుండి వన్యకుల క్షత్రియులు టీడీపీ కి అనుకూలంగా ఉన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు మమ్మల్ని అన్ని రంగాల్లో తొక్కేస్తున్నారు. మాకు టీటీడీ, తుడా చైర్మన్ పదవిని మాకు ఇవ్వాలి. 139బీసీ కులాల్లో మాకు 7శాతం రిజర్వేషన్ కల్పిస్తే మాకు న్యాయం జరుగుతుంది. ఆ దిశగా మీరు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.

చిన్నారెడ్డి: టీడీపీ హయాంలో మన నియోజకవర్గం అభివృద్ధి చెందింది. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మన నియోజకవర్గానికి కంపెనీలు తెచ్చి యువతకు ఉద్యోగాలిచ్చారు. మాకున్న రిజర్వేషన్ శాతాన్ని పూర్తిగా అమలు చేయాలని కోరుతున్నాం.

అనూష: మహిళలకు ఉద్యోగ అవకాశాలు,  ఉచిత శిక్షణా శిబిరాలు తీసుకురావాలి. వర్క్ ఫ్రం హోమ్ పథకాలు తీసుకురావాలి. మద్యపాన నిషేధాన్ని ప్రథమ కర్తవ్యంగా భావించాలని కోరుతున్నాం.

సుధాకర్ రెడ్డి: పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ జగన్ రెడ్డి ప్రభుత్వం నిలిపేసింది. ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్మా కోర్సు చేసి, రూ.70వేలు కట్టి బయటకు వచ్చాం. కుప్పం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు అన్ని నియోజకవర్గాల్లో జరగాలి. రేణిగుంటలో వన్యకుల క్షత్రియ భవనం నిర్మాణానికి 5ఎకరాల స్థలం కేటాయించాలి. మా కులాన్ని ఎంబీసీ కింద పరిగణించాలి.

బాలాజీ: మా నియోజకవర్గంలో 60వేల మంది వన్యకుల క్షత్రియులం ఉన్నాం. మమ్మల్ని ఆర్థికంగా, రాజకీయంగా, అన్ని విధాలా ముందుకు నడిపించాలని కోరుతున్నాం. సుధీర్ రెడ్డి ద్వారా బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కాలపు పాలనను తీసుకురావాలని మనవి.

అన్నెపురెడ్డి: వన్యకుల క్షత్రియులు బీసీ-ఏ లో ఉన్నారు. మాకు ఉద్యోగాలు రావడం లేదు. కానీ బీసీ-ఈ లో ఉన్నవాళ్లకు ఉద్యోగావకాశాలు వేగంగా వస్తున్నాయి. మాకు కూడా ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్ ను అమలు చేయాలని కోరుతున్నాం.

మునిరామయ్య: శ్రీకాళహస్తిలో బీసీలకు పెద్దపీఠ అనేది 1985 నుండే అమల్లో ఉంది. నిజాయితీగా ఉన్న పార్టీ కార్యకర్తలకు టీడీపీ అన్ని విషయాల్లోనూ ఆదుకుంటూ వస్తోంది. తుడా చైర్మన్, నియోజకవర్గ ఇన్చార్జి పదవులకు బీసీలను చంద్రబాబు ఎంపిక చేశారు. జగన్ రెడ్డి మాయమాటలకు మోసపోయి నేను కూడా వైసీపీకి ఓటు వేశా..నన్ను మీరు క్షమించాలి. జగన్ రెడ్డి పాలన ఇంత నిరంకుశంగా ఉంటుందని కలలో కూడా ఊహించలేదు.

=========

*టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర వివరాలు:* *ఇప్పటి వరకు నడిచిన దూరం 312.5 కి.మీ.*

Tagged #LokeshPadaYatra #Padayatra #YuvaGalamLokesh #YuvaGalam #NaraLokeshPadaYatra #NaraLokesh #Yuvagalam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *