TDP

యువనేతలో అదే  ఉత్సాహం… అదే దూకుడు!విజయవంతంగా నెలరోజులు పూర్తిచేసుకున్న యువగళంనేడు 400 కిలోమీటర్ల మైలురాయి చేరుకోనున్న యువనేత

చంధ్రగిరి: రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలనపై గళమెత్తుతూ టిడిపి యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర మంగళవారంతో నెలరోజులు పూర్తిచేసుకుంది. 30వరోజు పాదయాత్ర పూర్తయ్యే సమయానికి 397.3 కిలోమీటర్లకు చేరుకుంది. బుధవారం ఉదయం యువగళం పాదయాత్ర 400 కిలోమీటర్లు పూర్తిచేసుకుంది. ముందుగా నిర్ణయించిన ప్రకారం రోజుకు సగటును 10కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించాల్సి ఉండగా, తొలి నెలరోజుల్లో రోజుకు 13కిలోమీటర్లకు పైగా యువనేత యాత్ర సాగింది. 30వరోజు పాదయాత్ర… చంద్రగిరి నియోజకవర్గం మామండూరు విడిది కేంద్రం నుండి పాదయాత్ర ప్రారంభమైంది. మామండూరు గ్రామ ప్రజలు యువనేతకు హారతులు ఇచ్చి, స్వాగతం పలికారు.  నడింపల్లి గ్రామ ప్రజలు యువనేతకు నీరాజనాలు పట్టారు. ఎం.కొంగరవారిపల్లి వద్ద గ్రామస్తులు లోకేష్ ను ఘనంగా తమ గ్రామంలోకి స్వాగతించారు. మరవపల్లి గ్రామస్తులు యువనేతకు గజమాలతో స్వాగతం పలికారు. కాశిపెంట్ల గ్రామంలోని హెరిటేజ్ కంపెనీ ఉద్యోగులు యువనేతకు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. సిబ్బందిని యువనేత ఆప్యాయంగా పలకరించారు.  కాశిపెంట్ల, ముంగిళిపట్టు గ్రామం వద్ద పాదయాత్ర 30వరోజు సందర్భంగా గ్రామస్తులు 30 నెంబరు ఆకృతితోగల కేకును యువనేతతో కట్ చేయించారు. పనపాకం గ్రామ శివార్లలో జాతీయ రహదారిపై పూలతో అలంకరించిన భారీస్వాగత ద్వారం, ఏర్పాటుచేసి యువనేతను స్వాగతించారు. గాదంకి టోల్ ప్లాజా వద్ద మురుగన్ కేఫ్ లో యువనేత తేనీరు సేవించి, షాపు యజమానితో సరదాగా ముచ్చటించారు.  పనపాకం గ్రామస్తులు మార్గమధ్యంలో యువనేత లోకేష్ ను కలిశారు. పనబాకం నుంచి కోనంగివారిపల్లి మధ్యలో ఉన్న సుమారు 2.5 కిలోమీటర్ల జాతీయ రహదారి మరమ్మతులకు నోచుకోక అధ్వాన్నంగా తయారైంది. వైసిపి అధికారంలోకి వచ్చాక ఈరోడ్డుపై గుప్పెడు మట్టికూడా వేయలేదని గ్రామస్తులు వాపోయారు. గోతులను తప్పించే క్రమంలో వాహనాలను యాక్సిడెంట్ లకు గురై అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. పాదయాత్ర ప్రారంభంలో మామండూరు విడిదికేంద్రంలో రజకులతో యువనేత సమావేశమై వారి సాదకబాధలు తెలుసుకున్నారు. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో కాశిపెంట్లలో మహిళలతో యువనేత ముఖాముఖి సమావేశమయ్యారు. ప్రజల ఆశీస్సులతో యువగళం పాదయాత్ర రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతుండటంతో పార్టీ శ్రేణులు ఆనందోత్సాహాలు వ్యక్తంచేస్తున్నాయి.

అధికారంలోకి వచ్చిన వెంటనే రజకుల దోబీఘాట్లకు ఉచిత విద్యుత్!100రోజుల్లో తిరుపతిలో రజక భవనానికి స్థలం కేటాయిస్తాంరాజకీయంగా మెరుగైన అవకాశాలు కల్పిస్తాంవైసిపి నేతల వేధింపులకు గురైన మునిరాజమ్మకు 3రోజుల్లో షాపురజకులతో ముఖాముఖిలో యువనేత నారా లోకేష్

చంద్రగిరి: టిడిపి అధికారంలోకి వచ్చాక రజకుల దోబీఘాట్లకు ఉచిత విద్యుత్ అందజేస్తామని టిడిపి యువనేత నారా లోకేష్ ప్రకటించారు. చంద్రగిరి నియోజకవర్గం మామండూరు విడిది కేంద్రం నుంచి 30వరోజు పాదయాత్రకు బయలుదేరే ముందు మంగళవారం నాడు రజకులతో యువనేత ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… రజకుల్లో పేదరికం ఉండటానికి వీలులేదు.  రజకులను ఎస్సీల్లో చేర్చడానికి టీడీపీ గతంలో కమిటీ వేసింది. ఆ కమిటీ నివేదిక ప్రభుత్వం వద్ద ఉంది. టిడిపి అధికారంలోకి రాగానే కమిటీ నివేదిక మేరకు న్యాయం చేస్తా,. రజకుల భవనాలు కూడా నిర్మిస్తాం. అధికారంలోకి వచ్చిన వందరోజుల్లో రజక భవనానికి తిరుపతిలో భూమి కేటాయిస్తాం. రజకులకు ప్రత్యేక రక్షణ చట్టం కావాలని రజకులు అడుగుతున్నారు. దీనికి ఐపీసీ సవరణ కేంద్రం చేయాల్సి ఉంది. దీనిపై ఎలా నిర్ణయం తీసుకోవాలో అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. రజకుల వృత్తిపని కోసం దోబీఘాట్ ల నిర్మాణం చేపడతాం. రజకులను రాజకీయంగా ప్రోత్సహిస్తాం. రజకులకు ఎమ్మెల్సీ ఇస్తామని 2014కు ముందు హామీ ఇవ్వలేదు..అయినా రాజకీయంగా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఎమ్మెల్సీ ఇచ్చాం.

ప్రశ్నించకపోతే బతకనివ్వరు!

ప్రభుత్వాన్ని సమస్యలపై నిలదీసేందుకు యువగళం ఒక వేదిక. ఈ ప్రభుత్వంపై ఇక తిరగబడకపోతే బతకలేం.    ప్రభుత్వాన్ని నిలదీస్తే ఇబ్బంది పెడుతున్నారు. చంద్రబాబను నోటికొచ్చినట్లుగా వైసీపీ నేతలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడారు. నా జీవితంలో జైలు చూడలేదు..కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక  ప్రజల కోసం వెళ్లాల్సి వస్తోంది. ఏ ప్రభుత్వమూ ఖర్చు పెట్టని విధంగా రజకులకు రూ.70 కోట్లు ఖర్చు చేశాం.  ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెద్దఎత్తున రజకులపై దాడులు జరుగుతున్నాయి. దొంగ కేసులు పెట్టి లొంగదీసుకోవాలని చూస్తున్నారు. దొంగ కేసులు పెట్టిన అధికారులపై విచారణ వేసి, వారి బట్టలూడదీస్తాం. కొందరి అధికారుల వల్ల పోలీసు వ్యవస్థకు చెడ్డపేరు వస్తోంది. తప్పుడు కేసులు పెడుతుండటం వల్ల అట్రాసిటీ కేసు తీసేయాలన్న చర్చ కూడా నడుస్తోంది.

రజకుల సమావేశంలో వ్యక్తమైన అభిప్రాయాలు:దోబీఘాట్ లకు విద్యుత్ బిల్లులు వసూలు చేస్తున్నారు : జయమ్మ

TDP ప్రభుత్వం దోబీఘాట్ లకు కరెంట్ ఉచితంగా ఉండేది. ఇప్పుడు మాతోనే వసూలు చేస్తున్నారు. దోబీఘాట్ కు నీళ్ల సరఫరాలేదు. మధ్యాహ్నం అన్నం తినడానికి షెడ్ నిర్మించాలి. 90 శాతం రాయితీతో టీడీపీ ప్రభుత్వం వాషింగ్ మెషీన్లు ఇచ్చింది. వాటిని ఈ ప్రభుత్వం రద్దు చేసింది. మీరు ఏం చేసినా మా పిల్లల భవిష్యత్ ఉపయోగపడేలా చేయాలి.

తిరుపతిలో రజకులకు ప్రాధాన్యం కల్పించాలి : వెంకటమ్మ

తిరుపతిలో ఎక్కడెక్కడి నుండో వచ్చి వేల మంది బతకుతున్నారు. తిరుపతిలో ఉతకాల్సిన వస్త్రాలను రజకులకు కాకుండా వేరే కాంట్రాక్టర్లకు ఇస్తున్నారు. వాటి వల్ల మేము వారి కింద పనిచేయాల్సి వస్తోంది. వాటిని నేరుగా రజకులకు కేటాయించాలి.

రజక భవనం నిర్మించాలి : వెంకటకృష్ణ

నేను టీటీడీలో సూపరింటెండెంట్ గా చేశాను. తిరుపతిలో రజక భవనం కోసం పోరాడుతున్నాం. స్థలం కేటాయించి నిధులు విడుదల చేస్తే రజకులకు అన్ని విధాలా ఉపయోగపడుతుంది. వాటి నుండి వచ్చే అద్దెల సొమ్ముతో పేదలకు ఆర్థికసాయం చేసేందుకు ఉపయోగపడుతుంది.

రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి : గంధం బాబు

17 రాష్ట్రాల్లో రజకులు ఎస్సీలుగా ఉన్నారు. మిగతా రాష్ట్రాల్లో బీసీల్లో ఉన్నాం. 1984లో ఎన్టీఆర్ కేంద్రానికి రజకులను ఎస్సీలుగా మార్చాలని తీర్మాణం చేసి పంపారు. కానీ పార్లమెంట్ లో అది నిలిచిపోయింది. చంద్రబాబు మళ్లీ 2019లో కమిటీ వేశారు. ఆ కమిటీ నివేదికను ఈ ప్రభుత్వం బయటపెట్టడం లేదు. మేము గుడ్డలు ఉతికి అన్నం అడుక్కునే పరిస్థితి ఉంటోంది. రజకులను శాసనసభకు పంపాలి.

నిత్యవసర సరకుల ధరల పెరిగాయి : అన్నపూర్ణ

రోజంతా నిలబడి ఇస్త్రీ చేస్తే రూ.5వందలు సంపాదిస్తున్నాం. మార్కెట్లో ఏదైనా కొనాలంటే ధరలు మండిపోతున్నాయి. నూనె ప్యాకెట్ రూ.2వందలుంది. ఏం కొని ఏం తింటారు.? పిల్లల్ని ఏం చదవించుకుంటారు.? నాయీ బ్రాహ్మణులకు టీటీడీలో ప్రాధాన్యం కల్పించారు..మరి రజకులు ఏం పాపం చేశారు.? మా కష్టాన్ని గుర్తించాలి. నేను సిమ్స్ లో కాంట్రాక్టు పోస్టులో పనిచేస్తున్నా. కటింగ్ పోను రూ.16వేల జీతం వస్తోంది. మమ్మల్ని రెగ్యులరైజ్ చేయడం లేదు. కాంట్రాక్టు ఉద్యోగుల గురించి ఆలోచించాలి.

చెరువులను వైసీపీ నేతలు కబ్జా చేస్తున్నారు : శంకర్

దోబీ ఘాట్ లను చంద్రబాబు ఉన్నప్పుడు ఆదర్శంగా రూపొందించారు. కానీ ఈ ప్రభుత్వం ఇప్పుడు పట్టించుకోవడం లేదు.  మేము ఎస్సీ జాబితా కోసం ప్రయత్నిస్తున్నాం. గతంలో చంద్రబాబు పోరాడారు..ఈ ప్రభుత్వం మర్చిపోయింది. మాపై దాడులు జరుగుతున్నాయి..రక్షణ చట్టం తీసుకురావాలి. చెరువులను వైసీపీ నేతలు ఆక్రమిస్తున్నారు. వాటిని రక్షించాలి.

చంద్రగిరి: ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించిన వారిని వైసిపి ప్రభుత్వం అనేక రకాలుగా వేధిస్తోంది. మహిళలు భయపడాల్సిన అవసరం లేదు… జనాభాలో సగభాగం ఉన్న మహిళలు తిరగబడితే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? మీరు పోరాడండి …మీకు అండగా మేముంటామని టిడిపి యువనేత నారా లోకేష్ భరోసా ఇచ్చారు. చంద్రగిరి నియోజకవర్గం కాశిపెంట్లలో మహిళలతో ముఖాముఖి సమావేశంలో లోకేష్ మాట్లాడుతూ… శ్రీకాళహస్తిలో ఓ రజక మహిళ తన సమస్యను నాకు విన్నవించుకుంది. సదరు మహిళకు సంబంధించిన టిఫిన్ బడ్డీని ధ్వంసం చేశారు. అక్కడి ఎమ్మెల్యే తన కాళ్లు పట్టుకుంటే వదిలేస్తానని ఆ మహిళను బెదిరిస్తున్నాడు. దిశచట్టం ఏం పీకుతోంది? హక్కుల కోసం పోరాడే మహిళలకు యువగళం గొంతుకగా నిలుస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా యువకలు, మహిళల్లో చైతన్యం నింపేందుకే ఈ యువగళం ప్రారంభించాను…అన్ని విధాలుగా నేను మహిళలకు అండగా ఉంటాను. మీ జోలికి వైకాపా కుక్కలు వస్తే నాకు చెప్పండి….ఆ కుక్కల తోలు తీస్తాం. మహిళలపై అసభ్యకర పోస్టులు పెడితే…వాళ్లను చెప్పులతో కొట్టండి. మీకు అండగా మేం నిలబడతాం. మహిళలకు చట్ట సభల్లో రిజర్వేషన్ బాధ్యతను తెలుగుదేశం తీసుకుంటుంది. మహిళల రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో పెండింగ్ లో ఉంది. దానిపై మన ఎంపీలు పోరాడుతున్నారు. మీకు రిజర్వేషన్ వర్తించే బాధ్యతను తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని హామీ ఇస్తున్నాం.

*మహిళలతో ముఖాముఖి సమావేశంలో వ్యక్తమైన అభిప్రాయాలు:*

కామేశ్వరి, వెల్లంపల్లి, చంద్రగిరి మండలం: టిడిపి ప్రభుత్వ హయాంలో డ్వాక్రా పథకం అద్భుతంగా అమలైంది. ఎవరైనా సభ్యురాలు చనిపోతే రూ.2లక్షలు ప్రమాద బీమా అమలయ్యేది. అభయహస్తం పథకాన్ని నిలిపేశారు. కొంత కాలం క్రితమే వాటిని కట్టాలని చెబితే కట్టాం. కానీ నేటికీ మాకు రశీదులు లేవు. మాకు తెలియకుండానే మా డబ్బులు మళ్లించారు. మమ్మల్ని ఇబ్బందిపెట్టే విధానాలను రద్దు చేసి, మీరు అధికారంలోకి వచ్చాక సంక్షేమాన్ని రెట్టింపు చేయాలని కోరుతున్నాం. మా పంచాయతీ నుండి రోజుకు 100మంది పిల్లలు బస్సు మార్గంలోనే పాఠశాల, కాలేజీకి వెళ్లాలి. ప్రైవేటు బస్సు మాత్రమే నడుస్తోంది. ఆర్టీసీ బస్సు తీసేశారు. దీనివల్ల పిల్లల్ని వారంలో ఒకరోజు మాత్రమే పంపుతున్నాం. హాజరులేదని అమ్మఒడి, విద్యాదీవెన నిలిపేస్తున్నారు.

దేవి, చిన్నగొట్టిపల్లి మండలం: నిత్యావసరధరలు పెరిగిపోవడంతో మాకు చాలా ఇబ్బందిగా ఉంది. కుటుంబాన్ని పోషించుకోవడం కష్టంగా ఉంది.

వేలేరు గ్రామ మహిళ: మా వేలేరు పంచాయతీలో మంచినీటి చెరువును పార్కుగా మార్చేశారు. మా పక్కన తుమ్మలగుంట పంచాయతీల్లో వైసిపినేతలు చెరువులను దోచుకుంటున్నారు. పాఠశాల గోడలు పగిలిపోయాయి. ప్రమాదకర స్థాయిలో స్కూల్ బిల్డింగ్ లు ఉన్నాయి. చెరువు స్థలాన్ని ప్లాట్లుగా అమ్ముకుంటున్నారు. డీకేటీ స్థలాల్లో ఇళ్లు కట్టుకుంటే 3ఏళ్లుగా కరెంటు కనెక్షన్లు ఇవ్వడం లేదు. విషపురుగుల మధ్య దీపాల మధ్య బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నాం. మాకు పార్కు ముఖ్యం కాదు. మంచినీరు, మంచి పాఠశాల ముఖ్యం. స్కూల్ సమీపంలో గంజాయి బ్యాచ్ తిరుగుతోంది. మీరు అధికారంలోకి వచ్చాక మా గ్రామాన్ని ఆదుకోవాలి. మా సమస్యల్ని పరిష్కరించాలి.

రాధ, నాయుడుగారిపల్లి: మహిళలకు చట్టసభల్లో సరిపడినంత ప్రాతినిధ్యం ఇవ్వడం లేదు. వంక పొంగితే మా ఊరికి రాకపోకలు నిలచిపోతున్నాయి. బ్రిడ్జి నిర్మించి శాశ్వత పరిష్కారం చూపాలి.

జానకి, నాగయ్యవారిపల్లి: ఇసుక అక్రమాల కోసం మా ఇంటి వద్ద వైసీపీ నాయకులు మమ్మల్ని కొట్టారు. మేం నిలదీశామని కక్షపూరితంగా వ్యవహరించారు. కేసు పెడితే కనీసం నేటికీ పోలీసులు కేసు పెట్టలేదు. గ్రామమంతా మాపై కక్షకట్టి ఫోన్లు చేస్తున్నారు. చంపేస్తామని బెదిరిస్తున్నారు. మేము చస్తాం కాని…మా పోరాటాన్ని వదిలిపెట్టం. కొట్టాల చంద్రశేఖర్ రెడ్డి(సర్పంచ్) మా గ్రామంలో చాలా దారుణాలు చేస్తున్నాడు. నీతిగా రెండు సంవత్సరాల నుండి పోరాడుతున్నాం. మాకు అండలేదు. మాకు న్యాయం లేదు. మీరు అధికారంలోకి వస్తేనే మాకు న్యాయం జరుగుతుందనే ఆశతో ఉన్నాము. మేం చెప్పుకుంటున్నాం. చెప్పుకోలేని వాళ్లు వేలల్లో ఉన్నారు.

మహిళా రేషన్ డీలర్: నేనొక రేషన్ డీలర్ ను. సంక్రాంతి పండుగ వచ్చిన సమయంలో మా రేషన్ షాపులో పండుగ కానుకల పంపిణీతో సందడిగా ఉండేది. కానీ వైసీపీ పాలనలో ఇటువంటివన్నీ రద్దు చేశారు. మాకు వచ్చే రేషన్ బస్తాల్లో తూకం తక్కువగా ఉంటుంది. ప్రజలకు మాత్రం రేషన్ కచ్చితంగా ఉండాలి. మేం చాలా నష్టపోతున్నాం. నిన్న పాదయాత్రకు వచ్చామని, నేడు ఉదయమే మా లైనుకు మంచినీరు ఆపేశారు. గత ప్రభుత్వంలో పథకాలు అమలయ్యేవి..నేటి పాలనలో అమలుకు నోచుకోవడం లేదు. టీడీపీ అధికారంలోకి వచ్చాక మహిళలకు ఉద్యోగాల్లో పెద్దపీట వేయాలని కోరుతున్నాం.

వాణి, కమ్మకండ్రిగ పంచాయతీ: లైంగిక వేధింపులపై ఎన్నో చట్టాలు తెస్తున్నారు…అమలు కావడం లేదు. చిన్నారుల నుండి ముసలివారి వరకు లైంగిక దాడులకు గురవుతున్నారు. వైసీపీ పాలనలో లైంగిక దాడులు చాలా పెరిగాయి. నాకొక కూతురు ఉంది నా బిడ్డ బయటకు వెళ్లి ఇంటికి వచ్చే వరకు చాలా టెన్షన్ ఉంది. మీరు అధికారంలోకి వచ్చాక లైంగిక దాడుల నివారణకు చర్యలు తీసుకోండి.

సుభద్రమ్మ, పాకాల మండలం, టిటి పల్లి: మా పంచాయతీని పక్క గ్రామానికి మార్చేశారు. గతంలో మా గ్రామంలోనే పంచాయతీ కార్యాలయం ఉండేది. మీరు అధికారంలోకి వచ్చాక మా గ్రామానికి పంచాయతీని తిరిగి తీసుకురావాలని కోరుతున్నాం.

కవిత, రామచంద్రపురం మండలం: గతంలో మా గ్రామం నుండి తిరుపతికి రూ.15 ఆర్టీసీ ఛార్జీ ఉండేది. నేడు రూ.35కు పెరిగింది. మీరు అధికారంలోకి వచ్చాక ఆర్టీసీ ఛార్జీలు తగ్గించండి.

ఇళ్లస్థలాలను పరిశీలించిన నారా లోకేష్

చంద్రగిరి నియోజకవర్గం ఎం.కొంగరవారిపల్లిలో  వైసిపి ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లస్థలాలను యువనేత నారా లోకేష్  పరిశీలించారు.  ఈ సందర్భంగా లోకేష్ ఎదుట ఎదుట ఎం.కొంగవారిపల్లి గ్రామస్తులు సమస్యలను విన్నవించారు. ఇక్కడ స్థలాలు పొందిన వారిలో ఎక్కువమంది తమ గ్రామంతో సంబంధం లేనివాళ్లే ఉన్నారు. వారిలో కూడా ఎక్కువ శాతం వైసిపి కార్యకర్తలు, నాయకులకే కేటాయించారు. స్థలాలు పొంధిన స్థానికులకు ముందు ఇళ్లు కట్టించి ఇస్తామని చెప్పారు. ఇప్పుడు మీరే ఇళ్లు కట్టుకోండి అంటున్నారు. ఇప్పటివరకు మా గ్రామంలో ఒక్క ఇళ్లు కూడా ఇప్పటి వరకూ నిర్మించలేదు. స్థలాలిచ్చిన ప్రాంతంలో కనీస మౌలిక సదుపాయాలు లేవు, ఇంటినిర్మాణానికి అవసరమైన నీటిని కూడా ట్యాంకర్ల ద్వారా కొనుక్కోవాల్సి వస్తోంది. ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం మూడువిడతలుగా ఇచ్చే 1.8లక్షలు ఏ మూలకు సరిపోవడం లేదు. ఇసుక, సిమెంటు, ఐరన్, కూలీరేట్లు అన్నీ పెరిగిపోయాయి. ఇప్పటిధరల ప్రకారం ఇల్లు నిర్మించుకోవాలంటే కనీసం రూ.5లక్షల నుండి 7 లక్షలు రూపాయలు కావాలి. బయట అప్పుచేయనిదే ఇల్లు పూర్తయ్యే పరిస్థితులు లేవు.  శానంబట్ల లో ఎకరానికి కోటి రూపాయిలు ఇచ్చారు. ఇక్కడ రైతులకు మాత్రం ఎకరానికి 23 లక్షలే ఇచ్చారు.

వైసీపీ నేతలు నడివీధిలో నా చీర విప్పుతామన్నారు సమస్యలు చెప్పానని టిఫిన్ కొట్టును ధ్వంసం చేశారు చాకలిది ఏం చేస్తుందని అవహేళనచేసి అవమానించారు నా సమస్యలు లోకేష్ తో చెప్పుకోవడం తప్పా? ప్రాణం పోయినా ఎమ్మెల్యేకి క్షమాపణలు చెప్పను లోకేష్ ను కలిసి అన్యాయాన్ని వివరించి మునిరాజప్ప

శ్రీకాళహస్తిలో వైసిపి నేతల కారణంగా వేధింపులకు గురైన మునిరాజమ్మ మామండూరు క్యాంప్ సైట్ లో యువనేత నారా లోకేష్ ను కలిసి తనను వైసిపి నేతలు ఏవిధంగా ఇబ్బంది పెట్టారో తెలియజేసింది. నాకున్న బాధలు ఇటీవల శ్రీకాళహస్తిలో పర్యటనలో మీతో చెప్పుకున్నా. దీన్ని ఓర్చుకోలేని వైసీపీ నేతలు నా టిఫిన్ కొట్టు ధ్వంసం చేసి..నడివీధిలో నా చీర వితప్పుతామన బెదిరించారు. నాకు ఏడు లక్షలు అప్పుంది. దాని వడ్డీ తీర్చేందుకు టిఫిన్ కొట్టు పెట్టుకున్నా. లోకేష్ తో మాట్లాడినందుకు ఊరి వదిలి ఏడాదిపాటు బయటకు పొమ్మంటున్నారు. వైసీపీ కార్యాలయానికి వచ్చి క్షమాపణ చెప్పంటున్నారు. నేను చనిపోవడానికైనా సిద్ధమే..క్షమాపణ చెప్పను. నా దగ్గర కోట్ల ఆస్తి లేదు..నా ప్రాణం తప్ప. రజక అమ్మాయి చనిపోయిందని చరిత్రలో ఉంటుంది. చెట్టుకిందైనా ఉందామని నా భర్తతో చెప్పా. శ్రీకాళహస్తిలో రజకులు భయస్తులు, నేను రజకుల కోసమే మాట్లాడా. చాకలిది ఏం చేస్తుంది అని వైసీపీ నేతలు అవహేళనగా మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో రజకులకు స్వేచ్ఛ లేదు. మా కిడ్నీలైనా అమ్ముతాం..కానీ అప్పులు ఎగ్గొట్టం. నా బాధలు లోకేష్ తో చెప్పుకోవడానికి వచ్చా. నా భర్త గుడిలో సెక్యూరిటీగా చేస్తుంటే తొలగించారని ఆవేదన వ్యక్తంచేశారు.

లోకేష్ స్పందిస్తూ… వైసిపి నేతల అరాచకానికి మునిరాజమ్మ సంఘటన అద్దంపడుతోంది. సమస్యలపై ప్రశ్నించడం తప్పా? మునిరాజమ్మకు టిడిపి అన్నివిధాలా అండగా ఉంటుంది. ఆమె భర్తకు టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే తిరిగి ఉద్యోగమిస్తాం. వైసిపి ముష్కరుల చేతిలో ధ్వంసమైన ఆమె టిపిన్ దుకాణాన్ని 3రోజుల్లో ఏర్పాటుచేస్తాం. మునిరాజమ్మకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.

Also read this blog: Reason to take the way -“Yuvagalam Padayatra”

Tagged #LokeshPadaYatra #Padayatra #YuvaGalamLokesh #YuvaGalam #NaraLokeshPadaYatra #NaraLokesh 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *