TDP

శ్రీకాళహస్తి నియోజకవర్గం

1).యువగళాన్ని అడ్డుకునేందుకు వైసిపి పేటిఎం బ్యాచ్ కుట్ర పాపానాయుడుపేట స్కూలువద్ద రాళ్లదాడికి సిద్ధమైన గూండాలు

శ్రీకాళహస్తి: యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం 24వరోజు పాదయాత్రకు శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలు నీరాజనాలు పలికారు. కోబాకలోని విడిది కేంద్రం నుంచి ప్రారంభమైన పాదయాత్రం జనం అడుగడుగునా పూలవర్షం కురిపిస్తూ హారతులిస్తూ ఘనస్వాగతం పలికారు. పాత వీరాపురం, కొత్తవీరాపురంలో లోకేశ్‌ను పూలమాలలతో ఘనంగా సత్కరించారు. మోదుగులపాలెంలో స్థానికులతో మాట్లాడేందుకు ప్రయత్నించిన లోకేష్ ను పోలీసులు అడ్డుకున్నారు. ఆయన నిలబడిన స్టూల్ ను కూడా లాగేసుకునే ప్రయత్నం చేశారు. బుధవారం యువగళం పాదయాత్ర రేణిగుంట మండలం పాపానాయుడుపేట చేరుకునే సరికి వందలాది గ్రామస్తులు యువనేతకు నీరాజనాలు పలికారు. కందాడ వద్ద స్వాగతం నారా లోకేష్ అంటూ బంతిపూలతో అలంకరించి గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. గోవిందవరంలో గ్రామస్తులు గజమాలతో స్వాగతం పలికారు. పాపానాయుడుపేటలో పూలవర్షం కురిపిస్తూ బాణాసంచా కాల్చుతూ అభిమానులు, కార్యకర్తలు కేరింతలు కొట్టారు.  ఏవిధంగానైనా పాదయాత్రను అడ్డుకోవాలని భావించి 10మంది వైసిపి పేటిఎం బ్యాచ్ గ్రామంలోని స్కూలు వద్ద గులకరాళ్లతో నక్కి ఉన్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన టిడిపి కార్యకర్తలు వారిని ప్రతిఘటించి తరిమికొట్టారు.  విషయం ముందే తెలిసినా చోద్యం చూస్తున్న పోలీసులు TDP కార్యకర్తలు వారిని గుర్తించగానే స్కూలులోకి తీసుకెళ్లి ఒక రూమ్ లో పెట్టి వారికి రక్షణగా నిలచారు.

వరి సాగులో ఈ ఏడాది రూ.1.6లక్షల నష్టం -రామచంద్రరాజు, సదాశివపురం

నేను 8.5ఎకరాల్లో వరి నాటాను. మొత్తం 1.6లక్షల నష్టం వచ్చింది. వడ్లు కొనడం లేదు..కొన్నా డబ్బులిస్తారని నమ్మకం లేదు. రైతు భరోసా కేంద్రాల్లో నచ్చిన వారికి ఫోన్లు చేసి విత్తనాలు, ఎరువులు అందిస్తున్నారు. చంద్రబాబు ఉన్నప్పుడు తప్ప ఈ ప్రభుత్వం వచ్చాక వడ్లు అమ్మలేదు వరి కోతకు కూలీలు రాకపోవడం వల్ల మిషన్లతో కోయిస్తున్నాం. గంటకు రెండు వేలు మిషన్లకు తీసుకుంటున్నారు.

అగ్గి తెగులుతో 3 ఎకరాల వరి పంట నష్టం -ఎమ్. నాగరత్నం,  కందాడ

మూడు ఎకరాలల్లో వరి నాటాను. అగ్గి తెగులుతో మాడిపోయింది. పరిహారం కోసం ఎన్ని సార్లు తిరిగినా ప్రయోజనం లేదు. రూ.70 వేల పెట్టుబడి పెట్టా. రైతు బతకాలా.. వ్యవసాయాన్ని వదిలేయాలా?

2). వరిచేలో దిగి రైతుల కష్టాలు విన్న యువనేత లోకేష్

శ్రీకాళహస్తి నియోజకవర్గం కుక్కలవారి కండ్రికలో యువనేత లోకేష్ వరిచేలోకి దిగి రైతులతో మాటకలిపి వారి సాదకబాధలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు తమ గోడు విన్పిస్తూ… ప్రభుత్వం వడ్లు కొనడం లేదు..కొన్నా డబ్బులిస్తారని నమ్మకం లేదు. రైతు భరోసా కేంద్రాల్లో నచ్చిన వారికి ఫోన్లు చేసి విత్తనాలు, ఎరువులు అందిస్తున్నారు. చంద్రబాబు ఉన్నప్పుడు తప్ప ఈ ప్రభుత్వం వచ్చాక వడ్లు అమ్మలేదు. ఈ  క్రాప్ నమోదు చేయడం లేదు..పరిహారం అందించడం లేదు. వరి కోతకు కూలీలు రాకపోవడం వల్ల మిషన్లతో కోయిస్తున్నామని తెలిపారు.

రైతుల సమావేశంలో ఆసక్తికర సంఘటన!

ప్యాంటు వేసుకున్న ఒక రైతు సమస్యలు చెబుతున్న సందర్భంలో లోకేష్ సరాదాగా మాట్లాడుతూ… మిమ్మల్ని పేటిఎం గ్యాంగ్ ట్రోలింగ్ చేస్తుంది. రైతులు ప్యాంట్లు వేసుకోవడం వైసిపి వారికి ఇష్టం ఉండదు, మహిళలు పసుపు చీర కట్టుకున్నా పెయిడ్ ఆర్టిస్టులు అంటూ పేటిఎం గ్యాంగ్ ట్రోల్ చేస్తుందని అని అన్నారు. పర్వాలేదు నేను వ్యవసాయం చేసే రైతుని ఏమి ట్రోల్ చేస్తారో చెయ్యనివ్వండి.. నేను రైతు సమస్యల గురించి మాట్లాడి తీరుతానంటూ ఆ రైతు సమస్యలను ఏకరువు పెట్టారు.  దేశంలో రాహుల్ గాంధీ తరువాత అతి ఎక్కువ ట్రోలింగ్ కి గురి అయ్యింది నేనే. వాళ్ళు ఎంత ట్రోల్ చేస్తే నేను అంత బలపడుతున్నా. నేను లక్ష కోట్లు ప్రజాధనం దోబ్బి జైలుకి వెళ్ళలేదు. పదో తరగతి ప్రశ్నా పత్రాలు దొంగలించలేదు.16 నెలలు జైలుకి వెళ్ళలేదు,  నేను ప్రజా సమస్యల పై పోరాడేందుకు ప్రజల్లోకి వచ్చి పాదయాత్ర చేస్తున్నానని లోకేష్ పేర్కొన్నారు.

4).పాపానాయుడుపేటలో లోకేష్ ను కలిసిన కైకాల సామాజికవర్గీయులు

శ్రీకాళహస్తి: టిడిపి యువనేత నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా పాపానాయుడుపేటలో కైకాల సామాజికవర్గీయులు కలిసి సమస్యలను విన్నవించారు. పాపానాయుడుపేటలో వెయ్యిమంది కైకాల సామాజికవర్గీయులం ఉన్నాం. మూడుతరాలుగా ఇక్కడే ఉంటూ కటిక దారిద్ర్యంలో మగ్గుతున్నాం. ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి సాయం అందడం లేదు. మా సామాజికవర్గంలో చాలామందికి ఇటీవల పించన్లు తీసేశారు. గతంలో 150కుటుంబాలు మరమగ్గాలపై ఆధారపడి జీవించేవారం, ప్రస్తుతం నాలుగైదు కుటుంబాలు మాత్రమే ఈ వృత్తిలో ఉన్నాం. టిడిపి హయాంలో పవర్ సబ్సిడీ ఇచ్చి మాకు అండగా నిలిచేది, ప్రస్తుత ప్రభుత్వం ఆ రాయితీలన్నీ ఎత్తేసింది. దీంతో వ్యవసాయం, ఇతర పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. మా కుటుంబాల్లో చదువుకున్న పిల్లలకు ఉద్యోగావకాశాలు లేవు. మాకు మరమగ్గాల కొనుగోలుకు రాయితీతోపాటు, విద్యుత్ సబ్సిడీ సౌకర్యం కల్పించి ఆదుకోవాలి. ఈ ఏడాది అతివృష్టివల్ల మా పొలాలు నీటిముంపునకు గురయ్యాయి, ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందలేదు. రేణిగుంట నుంచి పాపానాయుడుపేట వరకు రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి. గ్రామంలో రోడ్లు ఇరుకుగా ఉండటం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.

Tagged #LokeshPadaYatra #Padayatra #YuvaGalamLokesh #YuvaGalam #NaraLokeshPadaYatra #NaraLokesh #Yuvagalam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *