వాయల్పాడులో యువగళానికి అనూహ్య స్పందన 38వరోజు పాదయాత్రలో పెద్దఎత్తున పాల్గొన్న మహిళలు మదనపల్లి నియోజకవర్గంలో ప్రవేశించిన యువగళం పాదయాత్ర
పీలేరు: TDP యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర పీలేరు నియోజకవర్గంలో పూర్తిచేసుకుని బుధవారం సాయంత్రం మదనపల్లి నియోజకవర్గంలో ప్రవేశించింది. 38వరోజు యువగళం పాదయాత్రకు పీలేరు నియోజకవర్గ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. నాలుగురోజులపాటు పీలేరు నియోజకవర్గంలో విజయవంతంగా సాగిన యువగళం పూలవాండ్లపల్లి వద్ద మదనపల్లి నియోజకవర్గంలో ప్రవేశించింది. పీలేరు నియోజకవర్గంలో వరుసగా నాలుగోరోజు కూడా యువనేత పాదయాత్రకు జనం జేజేలు పలికారు. వాయల్పాడులో యువనేతను చూసేందుకు ప్రజలు రోడ్లవెంట బారులు తీరారారు. చింతపర్తిలోని బోయపల్లి క్రాస్ వద్దనుంచి పాదయాత్ర ప్రారంభమైంది. తొలుత అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా క్యాంప్ సైట్ లో మహిళలకు పాదాభివందనం చేసిన యువనేత… వారితో సమావేశమై ఇబ్బందులను తెలుసుకున్నారు. అనంతరం మహిళలు పెద్దఎత్తున యువనేతకు సంఘీభావంగా పాదయాత్రలో పాల్గొన్నారు. పాదయాత్ర జమనపల్లి వద్దకు చేరుకోగానే బాణాసంచా మోతలతో దద్దరిల్లింది. చింతలవారిపల్లిలో మహిళలు యువనేతకు ఎదురేగి హారతులిచ్చి స్వాగతం పలికారు. విటలం గ్రామంలో యువనేతపై పూలవర్షం కురిపించి బాజాభజంత్రీలతో తమ గ్రామంలోకి ఆహ్వానించారు. మధ్యాహ్నం పునుగుపల్లిలో భోజన విరామానంతరం పాదయాత్ర వాయల్పాడు చేరుకున్న సమయంలో అక్కడి ప్రజలు యువనేతకు నీరాజనాలు పలికారు. వాయల్పాడు పట్టణంలో దారిపొడవునా యువతీయువకులు, మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు రోడ్లవెంట బారులు తీరారు.
యువనేత ఎదుట వ్యక్తమైన అభిప్రాయాలు:
వ్యవసాయం చేయాలంటే భయమేస్తోంది!
మల్ రెడ్డి, మాదిగుంతకణం, కోళ్లబయలు గ్రామం, వాయల్పాడు మండలం: వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాను. గత ఏడాది శనగ,టమోటా, వరిపంట వేశాను. భార్య, కొడుకులు, కోడళ్లు అంతా పొలంమీద పనిచేసుకుంటేనే రూ.6లక్షల నష్టం వచ్చింది. టమోటా పంట చేతికొచ్చే సమయానికి 30కేజిల బాక్స్ రూ.60పలికింది. కూలీకూడా గిట్టుబాటుగాక పంటను చేలోనే వదిలేశాను. గత ప్రభుత్వంలో సబ్సిడీ పోగా డ్రిప్ పైపు 150రూపాయలకు లభించేది. ఇప్పుడు సబ్సిడీ లేకపోవడంతో రూ.400 పెట్టి కొనాల్సి వస్తోంది. ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు, కూలీల ఖర్చు కూడా భారీగా పెరిగింది. ప్రస్తుతం పొలం దున్ని ఖాళీగా పెట్టాను. టమోటా పంట వేయాలంటే భయమేస్తోంది. జగన్మోహన్ రెడ్డి పేరుకే మా కులపోడు, ఆయన వల్ల మాకు ఒరిగిందేమీ లేదు. చంద్రబాబు వస్తేనే కష్టాలనుంచి గట్టెక్కుతాం. లేకపోతే పొలాలు అమ్ముకుని వెళ్లాల్స వస్తుంది. మోటార్లకు మీటర్లు పెడతామని వత్తిడిచేసి బలవంతంగా ఆధార్ తీసుకెళ్లారు.
చంద్రబాబు చలవతోనే సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేస్తున్నాం!
నారాయణరెడ్డి, శ్యామ్, పునీత్ (వాయల్పాడు): మేము ప్రస్తుతం బెంగుళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేస్తున్నాం. మేం 2019లో ఎస్వీ యూనివర్సిటీలో ఎంసిఎ పూర్తిచేశాం. ఈరోజు మేం ఉద్యోగాలు చేస్తున్నామంటే చంద్రబాబు చలవే. చంద్రబాబు సిఎం అయి ఉంటే మేం ఉద్యోగాల కోసం పొరుగు రాష్ట్రానికి వెళ్లాల్సి వచ్చేది కాదు. ఐటి మంత్రి అంటే లోకేష్ మాదిరి ఉండాలికానీ కోడిగుడ్డు అమర్నాథ్ లా కాదు. ఇప్పుడు ఇంజనీరింగ్ , ఎంసిఎ పూర్తిచేసిన వారికి ఎటువంటి ఉద్యోగాలు రావడం లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రీఎంబర్స్ మెంట్ ఇవ్వకపోవడంతో ఫీజులు బకాయిపడి సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రాష్ట్రానికి పరిశ్రమలు రావాలంటే మళ్లీ చంద్రబాబుగారు సిఎం కావాలి. పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు బెంగుళూరు నుంచి వచ్చాం.
మహిళలను గౌరవించేలా కేజి నుంచి పీజీ వరకు ప్రత్యేక పాఠ్యంశాలు! మహిళల భద్రతకు ఈశాన్య రాష్ట్రాల తరహాలో పటిష్టమైన విధానాలు అధికారంలోకి వచ్చాక విదేశీ విద్యా పథకాన్ని పునరుద్దరిస్తాం మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలతో యువనేత ముఖాముఖి
పీలేరు: అమ్మ లేనిదే జన్మ లేదు…భూమి కంటే ఎక్కువ భారం మోసేది మహిళలు…మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు… అంటూ మహిళలకు పాదాభివందనం చేశారు యువనేత Nara Lokesh. పీలేరు నియోజకవర్గంలో చింతపర్తిలో అంతర్జాతీయ మహళా దినోత్సవం సందర్భంగా యువనేత మహిళలతో బుధవారం ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… ఏనాడూ రాజకీయాల్లో లేని మా అమ్మ ని అసెంబ్లీ సాక్షిగా వైసిపి నాయకులు అవమానించారు. చట్టాల ద్వారా మాత్రమే మహిళలకు రక్షణ రాదు. చిన్న వయస్సు నుండే మగ వాళ్లకు మహిళల గౌరవం తెలిసేలా ప్రత్యేక పాఠ్యాంశాలు ఉండాలి. టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే కేజీ నుండి పీజీ వరకూ మహిళల గొప్పతనం, వారు పడే కష్టాలు తెలిసేలా ప్రత్యేక పాఠ్యాంశాలు పెడతాం. ఈశాన్య రాష్ట్రాల్లో మాదిరిగా మహిళల భద్రతకు పటిష్టమైన విధానాలు అమలుచేసేలా అధ్యయనం చేస్తాం. మహిళా మంత్రులే మహిళల్ని కించ పరిచేలా మాట్లాడుతున్నారు. మహిళా మంత్రి రోజా నాకు చీర, గాజులు పంపుతాను అన్నారు. మహిళలు అంటే ఈ ప్రభుత్వానికి ఎందుకు అంత చిన్న చూపు. జగన్ పాలన లో మహిళలకు రక్షణ లేదు. కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం 52 వేల మహిళల పై వేధింపులు జరిగాయి. 900 మంది మహిళలపై అత్యాచారాలు జరిగాయి. సిఎం సొంత నియోజకవర్గం లో నాగమ్మ అనే మహిళ పై అత్యాచారం జరిగితే పోరాడిన దళిత మహిళా నాయకురాలు అనిత పై ఎస్సీ,ఎస్టీ కేసు పెట్టారు.
దిశ పేరుతో మహిళలను మోసగించిన జగన్
మహిళల్ని మోసం చేసింది జగన్. దిశ చట్టం లేకుండానే జగన్ హడావిడి చేశారు. 900 మహిళల పై అత్యాచారాలు జరిగితే 21 రోజుల్లో ఒక్కరికీ న్యాయం జరగలేదు. సంపూర్ణ మద్యపాన నిషేధం తర్వాతే ఓట్లు అడుగుతా అన్నారు జగన్. అమ్మ ఒడి ఎంత మంది పిల్లలు ఉన్నా ఇస్తా అన్న జగన్ మోసం చేశారు. 45 ఏళ్లకు బీసీ, ఎస్టీ, ఎస్సీ మహిళలకు పెన్షన్ ఇస్తా అని మోసం చేశాడు జగన్. వైసిపి కేసులకు బయపడొద్దు. అక్రమ కేసులు పెట్టిన అధికారుల పై టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే జ్యూడిషియల్ ఎంక్వైరీ వేస్తాం చర్యలు తీసుకుంటాం.
డ్రాపవుట్స్ తగ్గించడానికి చర్యలు తీసుకుంటాం
ఎక్కువ మంది మహిళలు చదువు కోవడానికి, డ్రాప్ అవుట్స్ లేకుండా చెయ్యడానికి టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రత్యేక ప్రణాళిక సిద్దం చేస్తాం. ప్రత్యేక కళాశాలలు, ఉన్నత విద్య కు సహాయం, విదేశీ విద్య కు సహాయం అందిస్తాం. సమాన వేతనం కోసం అనేక చర్యలు గతంలో తీసుకున్నాం. అనేక పరిశ్రమలు తీసుకొచ్చిన్నప్పుడు మహిళలకు ప్రత్యేకంగా ఉద్యోగాలు కల్పించడం తో పాటు మంచి జీతాలు ఇవ్వాలని మేము కంపెనీలను కోరేవాళ్ళం. ఎన్నికల ముందు కులం, మతం చూడము అన్నారు. ఇప్పుడు ఉపాధి హామీ లో ఫీల్డ్ అసిస్టెంట్ల దగ్గర నుండి సంఘమిత్ర ల వరకూ అడ్డగోలుగా తొలగిస్తున్నారు. ఆఖరికి డ్వాక్రా మహిళలు దాచుకున్న అభయహస్తం డబ్బులు కూడా వైసీపీ ప్రభుత్వం కొట్టేసింది. వన్ టైం సెటిల్మెంట్ ఒక పెద్ద మోసం. 10 వేలు కట్టించుకొని ఇచ్చిన ధ్రువ పత్రం తీసుకొని రుణం కోసం బ్యాంక్ కు వెళ్తే బయటకి పొమ్మని తిడుతున్నారు. టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే కర్నాటక మోడల్ డికెటి విధానాన్ని తెచ్చి భూములు, స్థలాలపై హక్కులు కల్పించే అంశాన్ని పరిశీలిస్తాం.
మహిళలకు భరోసా కల్పించడమే లోకేష్ లక్ష్యం
-వంగలపూడి అనిత, తెలుగుమహిళా అధ్యక్షురాలు
వైసీపీ పాలనలో మహిళలకు గౌరవం, రక్షణ, భరోసా లేదు. వైసిపి పాలనలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయి. గంజాయి మత్తు లో మృగాళ్లు రెచ్చిపోతున్నారు. తొమ్మిది నెలల పాప నుండి తొంభై ఏళ్ల ముసలివాళ్లపైనా అత్యాచారాలు జరగుతున్నాయి. అయినా ఈ ప్రభుత్వం చీమకుట్టనట్లైనా వ్యవహరించడంలేదు. స్వాతంత్ర్య దినోత్సవం రోజు రమ్య అనే దళిత యువతిని చంపేస్తే వెంటనే స్పందించి పోరాడింది మా నేత లోకేష్. రమ్య కుటుంబానికి నాయ్యం చెయ్యాలని పోరాడితే లోకేష్ పై కేసు పెట్టింది వైసిపి ప్రభుత్వం. మహిళలకు భద్రత, భరోసా కల్పించాలని లోకేష్ తాపత్రయ పడుతున్నారు. సనాతన ధర్మంలోనూ మహిళలను గౌరవించారు. స్త్రీని శక్తిగా భావించే వ్యక్తిగా లోకేష్ మన మహిళందరికీ దొరికారు. తల్లిని దైవంగా భావించే నా సోదరుడు లోకేష్. మహిళను అక్క, అమ్మ అని పిలవడం తప్ప మరో పేరుతో ఏనాడూ పిలవలేదు.
మహిళల సమావేశంలో వ్యక్తమైన అభిప్రాయాలు:
ధరణి : ఉన్నత విద్యలో మహిళలు 29 శాతం మాత్రమే ఉంటున్నారు. పై చదువులకు వెళ్లేకొద్దీ మహిళల శాతం తగ్గిపోతోంది. దాని పెంపుదలకు మీరు అధికారంలోకొచ్చాక అవకాశాలు కల్పిస్తారా?
సావిత్రి: మహిళలకు భద్రత లేదు. మాకు కూడా మగవారితో సమానంగా జీతాలు ఇవ్వాలి.
ఉష : నేను సంగమిత్రగా గత ప్రభుత్వంలో చేశాను. ఈ ప్రభుత్వం వచ్చి మమ్మల్ని ఉద్యోగాల నుండి తొలగించారు. మీరు వచ్చాక సంగమిత్రలను ఆదుకోండి.
శోభారాణి: 2006లో నాకు కాలనీలో స్థలం వచ్చింది. ఇంటి నిర్మాణం కోసం నేను సౌదీ వెళ్లి రూ.3 లక్షలు సంపాదించుకుని వచ్చి ఇళ్లు నిర్మించుకున్నాం. కానీ ఈ ప్రభుత్వం దాన్ని కూల్చేసింది. ఇంట్లో బంగారం, బియ్యం, అన్నీ పోయాయి. పట్టా కాగితాలు తీసుకుని వైసీపీ నేతలు చించేశారు.
రెడ్డమ్మ: నా కొడుకు చనిపోయాడు. ఇద్దరు పిల్లలున్నారు. నాకు రేషన్ కార్డు లేదు.
కుసుమకుమారి: మహిళలకు భద్రత, భరోసా కల్పించాలన్న తాపత్రయం లోకేష్ లో ఉంది.
నాగవేణి: ఇళ్ళ స్థలం అడిగినందుకు వైసిపి నాయకులు కేసు పెట్టించారు.
లక్ష్మి కాంతమ్మ: విదేశీ విద్య పథకం రద్దు అయ్యింది. మీ ప్రభుత్వం వచ్చాక పునరుద్దరించండి.
యువనేతను కలిసిన ఫిజియో థెరపిస్టులు
చింతపర్తి విడిది కేంద్రం వద్ద యువనేత నారా లోకేష్ ని ది ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజియోథెరపిస్ట్స్ ప్రతినిధులు కలిసి సమస్యలను విన్నవించు. రాష్ట్ర వ్యాప్తంగా 7000 మంది ఫిజియోథెరపిస్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. మరో 4 ఏళ్లలో 9000 మంది విద్యార్థులు ఫిజియోథెరపి కోర్సు పూర్తి చేసుకోబోతున్నారు. కానీ ఇప్పటి వరకూ కేవలం ప్రభుత్వం సేవల్లో 7 మంది మాత్రమే పనిచేస్తున్నాం. మిగిలిన వాళ్ళు అంతా ప్రైవేట్ గానే ప్రాక్టీస్ చేస్తున్నాం. పిహెచ్ సి లెవల్ లో మా సేవలు వినియోగించుకోవాలని కోరారు.
లోకేష్ మాట్లాడుతూ…
రాష్ట్ర వ్యాప్తంగా ఫిజియోథెరపిస్ట్స్ ఎదుర్కుంటున్న సమస్యల పై నాకు అవగాహన ఉంది. త్వరలోనే మీతో ప్రత్యేకంగా నేను సమావేశం అవుతాను. మీ సేవల్ని ఎలా వినియోగించుకోవాలి, మీ సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాల పై ప్రత్యేక సమావేశంలో చర్చించి మీకు నిర్ధిష్టమైన హామీలు ఇస్తాను.
జగన్ కోసం ప్రమాదంలో పడ్డాడు, చంద్రబాబు ప్రాణాలు కాపాడారు- లోకేష్‌ని కలిసి కృతజ్ఞత తెలిపిన వైసీపీ నేత
కులం షూడం, మతం షూడం, ప్రాంతం షూడం అంటూ లెక్చర్లు దంచుతూ..కులం చూసుకుని పదవులు, మతం చూసుకుని సహాయాలు, ప్రాంతాల పేరుతో విద్వేషాలు చిమ్మే జగన్ రెడ్డి కోసం వైసీపీ నేత ప్రమాదం బారినపడ్డాడు. ప్రాణాపాయస్థితిలో మంచంపట్టాడు. అప్పుడు కులం,మతం,ప్రాంతం, పార్టీలు చూడకుండా సాయం అందించింద Nara Chandrababu Naidu ప్రభుత్వం. కష్టంలో ఉన్నది వైసీపీ నేత, సాయం చేయాల్సింది వైసీపీ అనుకోలేదు టిడిపి. టిడిపి ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి సిఫారసు మేరకు చంద్రబాబు ప్రభుత్వం 30 లక్షలు అందించి అశోక్ ప్రాణాలు నిలబెట్టింది. తమ కుటుంబసభ్యుడి ప్రాణాలు కాపాడిన తెలుగుదేశానికి కృతజ్ఞతలు తెలియజేసింది ఆ కుటుంబం. పీలేరు నియోజకవర్గం చింతలవారిపల్లి మాజీ సర్పంచ్ అశోక్ వైసీపీ నేత. జగన్ పాదయాత్ర సందర్భంగా బ్యానర్లు తెస్తూ ప్రమాదానికి గురయ్యాడు. వైసీపీ పట్టించుకోలేదు. మంచానికే పరిమితమై 2 నెలలపాటు మృత్యువుతో పోరాడాడు. అశోక్ కుటుంబసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని సహాయం కోరారు. ఆయన చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళి 30 లక్షలు సిఎంఆర్ఎఫ్ ద్వారా సహాయం అందించారు. వైద్యంతో అశోక్ ప్రాణాలు నిలిచాయి. పీలేరు నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర చేస్తూ చింతపర్తి విడిది కేంద్రంలో ఉన్న నారా లోకేష్‌ని అశోక్ కుటుంబ సభ్యులు కలిసి చంద్రబాబుకి, తెలుగుదేశం పార్టీకి కృతజ్ఞతలు తెలియజేశారు.
యువనేత లోకేష్ ను కలిసిన మాలమహానాడు ప్రతినిధులు
వాయల్పాడు శివార్లలో మాలమహానాడు ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. దళితులు నేటి సమాజంలో ఆర్థిక, సామాజిక రంగాల్లో పూర్తిగా వెనకబడి ఉన్నారు. దళితుల అభివృద్ధికి గతంలో ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాయి. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఆర్థిక చేయూత అందించి మమ్మల్ని ఆదుకునేవారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నవరత్నాల పేరుతో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు మళ్లించడమేగాక గతంలో మా సంక్షేమానికి అమలుచేసిన 27 పథకాలను రద్దుచేసింది. బెస్ట్ ఎవైలబుల్ స్కీమ్ రద్దుచేయడం వల్ల దళితుల పిల్లలు నాణ్యమైన విద్యకు దూరమవుతన్నారు. గతంలో అంబేద్కర్ విదేశీవిద్య పథకం ద్వారా వందలాది దళిత విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించే అవకాశం ఉండేది. టిడిపి హయాంలో ల్యాండ్ పర్చేజ్ స్కీమ్ ద్వారా వేలాది కుటుంబాలు భూమిని పొంది ఆర్థికంగా నిలదొక్కుకున్నాయి. గతంలో దళిత నిరుద్యోగులకు ఇన్నోవా వాహనాలు ఇచ్చి స్వయం ఉపాధి కల్పించారు. ఆ పథకాలన్నింటినీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రద్దుచేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఒక్క రూపాయి సాయం అందించిన పాపానపోలేదు. ఎస్సీ, ఎస్టీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్ అమలుకు వైసిపి ప్రభుత్వం నిరాకరిస్తోంది. జిఓఎంఎస్ 77 ద్వారా విద్యాదీవెన, వసతిదీవెన తప్ప ఏ కోర్సులో ఉన్నత విద్య అభ్యసించినా ఉపకార వేతనాలు ఉండవని ప్రభుత్వం తెలిపింది. ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులను నాలుగేళ్లుగా ప్రకటించలేదు. ఇళ్లస్థలాల పేరుతో దళితులకు చెందిన 11వేల ఎకరాల భూములను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బలవంతంగా లాక్కుంది. నూతన పారిశ్రామిక విధానంలో దళితులకు ఎటువంటి రాయితీలు ఇవ్వలేదు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రద్దుచేసి సంక్షేమ పథకాలన్నీ పునరుద్దరించి మాకు న్యాయం చేయండి.
*నారా లోకేష్ మాట్లాడుతూ…*
ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీలకు మాయమాటలుచెప్పి ఓట్లువేయించుకొని అధికారంలోకి వచ్చాక వారిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఎస్సీ సంక్షేమ పథకాల రద్దు, ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు మళ్లింపుతో దళితులకు తీరని అన్యాయం చేసిన జగన్ రెడ్డి. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన దళితులపై వైసీపీ ఉక్కుపాదం మోపుతూ అణచివేత చర్యలకు పాల్పడుతున్నారు. వైసిపి పాలనలో దళిత మహిళలకు కూడా రక్షణలేకుండా పోయింది. పులివెందులలో దళితమహిళ నాగమ్మపై కిరాతకంగా అత్యాచారం చేసి హత్యచేస్తే చర్యలు లేవు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దళితులకు న్యాయం చేస్తాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రద్దుచేసిన సంక్షేమ పథకాలన్నీ పునరుద్దరిస్తాం. దళితులపై వేధింపులకు పాల్పడిన వైసిపి నేతలను కఠినంగా శిక్షిస్తాం. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది.
యువనేత లోకేష్ ను కలిసిన వాల్మీకిపురం మండల మైనారిటీలు
వాయల్పాడులో వాల్మీకిపురం మండల మైనారిటీ సోదరులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. వాల్మీకిపురం మండలంలో సుమారు 20వేలమంది మైనారిటీ కుటుంబాలు ఉన్నాం. మండల పరిధిలోని 8 మసీదులు, రెండు దర్గాలు, రెండు తాత్కాలిక ఈద్గాలు ఉన్నాయి. మా బిడ్డల వివాహాలు, ఫంక్షన్లు చేసుకునేందుకు షాదీ ఖానా లేదు. మండలంలో 80శాతం మైనారిటీలు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వాయల్పాడులో షాదీఖానా నిర్మించండి. ఖబరస్థాన్ కాంపౌండ్ వాల్ నిర్మాణం, అప్రోచ్ రోడ్డుకు రూ.40 లక్షల నిధులు కావాలి. మండలంలోని మసీదులు, క్వాజాపూర్ మస్తాన్ వలి మరియు ఇబ్రహీంషా ఖాద్రీ దర్గా అభివృద్ధికి రూ.1.5కోట్లు అవసరం. మైనారిటీ పిల్లల సాంకేతిక విద్యాభ్యాసానికి వాయల్పాడులో మైనారిటీ బాయ్స్ పాలిటెక్నిక్ కళాశాల నిర్మించండి. ముస్లిం బాలికల కోసం మైనారిటీ జూనియర్ కళాశాల క్యాంపస్ లో మైనారిటీ డిగ్రీ కళాశాల ఏర్పాటుచేయండి. వాయల్పాడు ప్రజల సౌకర్యార్థం వాయల్పాడు రైల్వేస్టేషన్ లో ఎక్స్ ప్రెస్ రైళ్ల స్టాపేజికి చర్యలు తీసుకోండి. మండలంలోని ముస్లింల సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణకు వాయల్పాడులో రోడ్డుపక్కన 6ఎకరాల డికెటి భూమిని కేటాయించాలి.
*నారా లోకేష్ మాట్లాడుతూ…*
ఉమ్మడి రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమం కోసం మొట్టమొదటిసారిగా మైనారిటీ కార్పొరేషన్ ఏర్పాటుచేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. టిడిపి అధికారంలో ఉన్నపుడు మైనారిటీల కోసం దుల్హాన్, రంజాన్ తోఫా తదితర పథకాలను అమలుచేశాం. ముస్లింసోదరుల మక్కా యాత్రకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముస్లింల సంక్షేమం కోసం గత టిడిపి ప్రభుత్వం అమలుచేసిన సంక్షేమ కార్యక్రమాలన్నీ రద్దుచేశారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 10మంది మైనారిటీ సోదరులు హత్యకు గురికాగా, 36మందిపై దాడులు జరిగాయి. పుంగనూరులో 12మంది మైనారిటీ విద్యార్థులపై మంత్రి పెద్దిరెడ్డి తప్పుడు కేసులు బనాయించారు. పలమనేరులో చదువుల తల్లి మిస్బాను వైసిపినేత సునీత అన్యాయంగా పొట్టనబెట్టుకున్నారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ముస్లిం సోదరుల న్యాయమైన డిమాండ్లను పరిశీలించి చర్యలు తీసుకుంటాం. రాబోయే ఎన్నికల్లో టిడిపిని గెలిపించి చంద్రన్నను ముఖ్యమంత్రి చేసేందుకు సహకరించండి.
చంద్రన్న సంక్షేమ ముద్రలు చెరపలేవు జగన్ చంద్రన్న కానుకల సంచిని యువనేతకు చూపిన అవ్వ
చంద్రన్న ముఖ్యమంత్రిగా చేసిన సంక్షేమాన్ని చెరిపేయలేవు, సాధించిన ప్రగతిని ధ్వంసం చేయలేవు జగన్ మోహన్ రెడ్డి. పథకాలు రద్దు చేయగలవు కానీ వాటి ఫలాలు రద్దు చేయలేవని యువనేత నారా లోకేష్ వ్యాఖ్యానించారు. పీలేరు నియోజకవర్గం వాయల్పాడు మార్కెట్ మీదుగా పాదయాత్ర చేస్తున్నపుడు మార్కెట్లో సరుకులు కొనుక్కుని వెళ్తున్న అవ్వ యువనేత కంటపడింది. టిడిపి ప్రభుత్వ హయాంలో సంక్రాంతి సందర్భంగా చంద్రన్న ఇచ్చిన కానుకల సంచిని లోకేష్ కు చూపించింది. ఈ సందర్భంగా యువనేత మాట్లాడుతూ…. కానుకలు ఆపేస్తావు, వాటి గుర్తులు చెరిపేయలేవు. నిర్మాణాలను ధ్వంసం చేస్తావు, సాధించిన ప్రగతిని ఏం చేయలేవు. దీనికి నిదర్శనమే ఈ అవ్వ చేతిలో చంద్రన్న అందించిన సంక్రాంతి కానుక సంచి. చంద్రన్న సంక్షేమం ముద్ర ఎంతగా చెరిపేయాలన్నా చెరిగిపోదు జగన్! ఆ పథకాలు ఆపేయడం, కానుకలు రద్దు చేయడం, రంగులు వేసుకుని ఆనందం పొందడం అవసరమా జగన్ రెడ్డీ అంటూ ముఖ్యమంత్రిని ప్రశ్నించారు.
Also read this blog: Recent Progress of Nara Lokesh Yuvagalam Padayatra
Tagged #LokeshPadaYatra #Padayatra #YuvaGalamLokesh #YuvaGalam #NaraLokeshPadaYatra #NaraLokesh