TDP

400 కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్న యువగళం పాదయాత్ర నేండ్రగుంటలో 10పడకల అధునాతన ఆసుపత్రి నిర్మాణానికి హామీ అడుగడుగునా అడ్డంకుల నడుమ లక్ష్యంవైపు యువనేత అడుగులు

చంద్రిగిరి: అడుగడుగునా జగన్మోహన్ రెడ్డి పోలీసుల అడ్డంకులను అధిగమిస్తూ యువగళం పాదయాత్ర 400 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది.  చంద్రగిరి నియోజకవర్గం నేండ్రగుంట వద్ద యువనేత 400 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తిచేశారు. యువ‌గ‌ళం 400 కి.మీ చేరుకున్నసంద‌ర్భంగా పాకాల మండ‌లం నేండ్రగుంట మ‌జిలీలో ఆధునిక వ‌స‌తుల‌తో 10 ప‌డ‌క‌ల ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటుకు శిలాఫ‌ల‌కం వేశారు. యువ‌గ‌ళం మైలురాళ్లు..  ఆయా ప్రాంతాల ప్రగ‌తికి పునాది రాళ్లుగా మారబోతున్నాయి. యువ‌గ‌ళం పాద‌యాత్రలో ఒక్కో మైలురాయిని ప్రగ‌తికి పునాదిరాయిగా నిలిచేలా Nara Lokesh ప్రణాళిక‌లు రూపొందిస్తున్నారు.  తెలుగుదేశం ప్రభుత్వం వ‌చ్చిన వంద రోజుల్లో నేండ్రగుంటలో పీహెచ్ సీ ఏర్పాటు చేస్తామ‌ని యువనేత ప్రక‌టించారు. ఇక్కడ ప్రైమ‌రీ హెల్త్ కేర్ సెంట‌ర్ ఏర్పాటైతే, నేండ్రగుంట ప‌రిస‌ర ప్రాంత ప్రజ‌ల వైద్యం కోసం ప‌డే వ్య‌య‌ప్ర‌యాస‌లు త‌గ్గుతాయి. 400 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తయిన సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… జిఓ -1 ద్వారా అడుగడుగునా నా పాదయాత్రను అడ్డుకోవాలని చూసినా ప్రజల ఆశీస్సులతో 400 కిలోమీటర్లు పూర్తిచేశానని తెలిపారు.

యువనేత కాలు కదిపితే పోలీసు కేసులు!

10నియోజకవర్గాల మీదుగా సాగిన యువగళం పాదయాత్రపై ఇప్పటివరకు పోలీసులు 12కేసులు నమోదుచేశారు. ప్రతి 33 కిలోమీటర్లకు సగటున ఒకటి నమోదైంది. ఎఫ్ఐఆర్ లో లోకేష్ తోపాటు అచ్చెన్నాయుడు, అమర్ నాథ్ రెడ్డి, పులివర్తి నాని, దీపక్ రెడ్డి తదితర 55మందికిపైగా టిడిపి నేతలు, కార్యకర్తలపై కేసులు నమోదుచేశారు. కుప్పం, పలమనేరు, పూతలపట్టు, చిత్తూరు, జిడి నెల్లూరు, నగరి, సత్యవేడు, శ్రీకాళహస్తి, తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాల మీదుగా ఇప్పటివరకు యువగళం పాదయాత్ర సాగింది. కుప్పం, భైరెడ్డిపల్లి, పలమనేరు, నర్సింగరాయనిపేట, నగరి, శ్రీకాళహస్తిలో ఒక్కొక్క కేసు నమోదుచేశారు. బంగారుపాళ్యం, ఎస్ఆర్ పురం, ఏర్పేడులో 2కేసుల చొప్పున నమోదయ్యాయి.

31వరోజు ఉత్సాహంగా సాగిన పాదయాత్ర

యువగళం పాదయాత్ర 31వరోజు (బుధవారం) ఉత్సాహంగా ముందుకు సాగింది. పాకాలమండలం గాదంకి టోల్ ప్లాజా వద్ద అభిమానులకు సెల్ఫీలు ఇచ్చాక పాదయాత్ర ప్రారంభమైంది. గాదంకి గ్రామమహిళలకు యువనేతకు హారతులిచ్చి నీరాజనాలు పలికారు. గాదంకి బలిజసంఘ నాయకులు తమ సమస్యలతో కూడిన వినతిపత్రం సమర్పించారు. నేండ్రగుంట గ్రామంలో 400 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా అక్కడి గ్రామస్తులు భారీ గజమాలతో సత్కరించి స్వాగతించారు. అనంతరం 400 కిలోమీటర్ల శిలాఫలకాన్ని యువనేత ఆవిష్కరించారు. నేండ్రగుంటలో 10పడకల ఆసుపత్రిని అధికారంలోకి వచ్చిన వందరోజుల్లో నిర్మిస్తామని లోకేష్ ప్రకటించారు. దేశిరెడ్డిపల్లి వద్ద గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. ఇరంగారిపల్లిలో మహిళలు యువనేతకు హారతులుపట్టి స్వాగతం పలికారు. అనంతరం ఇదే గ్రామంలో యువతతో ముఖాముఖి సమావేశమై వారి మనోభావాలను తెలుసుకున్నారు. భోజన విరామానంతం పాదయాత్ర ప్రారంభించిన యువనేతకు పాకాల గ్రామప్రజలు భారీఎత్తున స్వాగతం పలికారు. యువతీయువకులు కేరింతలు కొడుతూ బాణాసంచా కాలస్తూ యువనేతను స్వాగతించారు. పాకాల హైస్కూలు గ్రౌండ్ విద్యార్థులతో కలిసి కొద్దిసేపు వాలీబాల్ ఆడి ఉత్సాహపర్చారు. అనంతరం విద్యార్థులు తమకు డిగ్రీ కళాశాల ఏర్పాటుచేయాలని కోరుతూ వినతిపత్రం అందించారు. పాకాల రైల్వేగేటు సమీపంలో భారీ గజమాలతో పార్టీ అభిమానులు స్వాగతం పలికారు. పాకాల మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి మతపెద్దల ఆశీర్వచనం తీసుకున్నారు. పాకాల మార్కెట్ వద్ద చిరువ్యాపారులతో యువనేత కాసేపు స్టూలుపై నిలబడి మాట్లాడారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చి ముందుకు సాగారు. పాకాల సెంటర్ లో యువనేత కలిసిన న్యాయవాదులకు ఆయనకు సంఘీభావం తెలిపారు.

చంద్రబాబు సిఎం అయ్యాక రాష్ట్రానికి పెట్టుబడుల వరద!అధికారంలోకి వచ్చాక 100 రోజుల్లోనే యువత శుభవార్త వింటారుయువతలో నైపుణ్యాన్ని పెంచేవిధంగా సిలబస్ లో మార్పులు తెస్తాం2025 జనవరిలో పూర్తిస్థాయి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేస్తాంఆర్టీసి చార్జీలు, పెట్రోలు, డీజిల్, నిత్యవర వస్తువుల ధరలన్నీ తగ్గిస్తాం యువతీయువకులతో ముఖాముఖి సమావేశంలో యువనేత లోకేష్

చంద్రగిరి: రాష్ట్రంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రానికి పెట్టుబడులు వరదలా వస్తాయని టిడిపి యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన మొదటి వందరోజుల్లో రాష్ట్రంలోని యువత శుభవార్త వింటారని చెప్పారు. చంద్రగిరి నియోజకవర్గం, పాకాల మండలం ఇర్రంగారిపల్లి గ్రామంలో యువతీయువకులతో లోకేష్ ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా యువనేత మాట్లాడుతూ…. మన రాష్ట్రంపై నెలకు రూ.20వేల కోట్ల నుండి రూ.30వేల కోట్ల వడ్డీ భారం పడుతోంది. ప్రైవేటు, ప్రభుత్వ రంగాలతో పాటు స్వయం ఉపాధి రంగంలో పెట్టుబడులు వెల్లువెత్తితేనే మనం అప్పుల ఊబినుండి బయటపడతాం. అది ఒక్క చంద్రబాబు వల్లే సాధ్యం. 15సంవత్సరాలు కంటిన్యూగా సీఎంగా ఉంటేనే మనం అప్పుల ఊబి నుండి బయటపడతాం. ఉమ్మడి ఏపీలో చంద్రబాబు సీఎంగా వచ్చే సమయానికి ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి కూడా లేదు. అయినా చంద్రబాబు దృఢ సంకల్పంతో ప్రపంచబ్యాంక్ తో మాట్లాడి రాష్ట్రాన్ని అప్పుల ఊబి నుండి బయటకు తెచ్చారు. నేడు తెలంగాణలో 80శాతం ఆదాయం చంద్రబాబు తెచ్చిన పెట్టుబడుల పుణ్యమే.

టిడిపి హయంలో రాష్ట్రానికి రికార్డుస్థాయి పెట్టుబడులు

టిడిపి ప్రభుత్వాల హయాంలో రికార్డు స్థాయిలో కంపెనీలు తెచ్చాం. 1994 నుండి ఏపీకి కంపెనీలను చంద్రబాబు తీసుకొచ్చారు. చంద్రబాబు పాలనలో 13జిల్లాల్లో ఒక్కో జిల్లాకు ఒక్కో రంగానికి ప్రాధాన్యతనిచ్చారు. చిత్తూరు జిల్లాను ఎలక్ట్రానిక్ మ్యానుఫ్య్చారింగ్ హబ్ గా చంద్రబాబు తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో పనిచేశారు.  ఐటీ హబ్ పెట్టేందుకు విశాఖలో డేటా హబ్ ను విశాఖకు చంద్రబాబు తెచ్చారు. వాటన్నింటినీ కుప్పకూల్చారు. ప్రస్తుత ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కోడిగుడ్డు మీద ఈకలు పీకే పనిలోనే ఉన్నాడు. వీళ్లు అధికారంలోకి వచ్చాక ఏపీకి ఒక్క ఐటీ కంపెనీ కూడా తీసుకురాలేదు. చిత్తూరు జిల్లాలో మేం తెచ్చిన జోహో కంపెనీలో నేడు 600మంది యువత పనిచేస్తున్నారు. గత ప్రభుత్వంలో 40వేల పరిశ్రమల ద్వారా 6లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాం. టీసీఎల్, కియా, ఫాక్స్ కార్న్ వంటి ఎన్నో పెద్ద కంపెనీలు తెచ్చాం.  2019లో చంద్రబాబు గెలిచి ఉంటే 15లక్షల కోట్ల పెట్టుబడులు, 50లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేవి.చంద్రబాబు కంపెనీలకు, అభివృద్ధికి బ్రాండ్.

సిలబస్ లో మార్పులు తెస్తాం!

ప్రస్తుత విద్యావ్యవస్థలో సిలబస్ చాలా వీక్ గా ఉంది. మేం అధికారంలోకి వచ్చాక సిలబస్ మారుస్తాం. మీకు నైపుణ్యాన్ని పెంచే విధంగా, ఇంజినీరింగ్ కు ఉపయోగపడేలా స్టేట్ బోర్డును, సిలబస్ ను పటిష్టం చేస్తాం. ప్రైవేట్, ప్రభుత్వ రంగాల్లో, స్వయం ఉపాధి రంగం ద్వారా యువతకు అవకాశాలు తెస్తాం.  2019 ఎన్నికల్లో యువతకు వైసీపీ ఇచ్చిన హామీలు జాబ్ క్యాలెండర్, 2.30లక్షల ఉద్యోగాల భర్తీ, మెగా డీఎస్సీలు అన్నీ గాలికొదిలేశాడు. చంద్రబాబు రెండు డీఎస్సీలు నిర్వహించి ఉద్యోగాలు ఇచ్చారు. 2025జనవరి నాడు మనం జాబ్ క్యాలెండర్ పూర్తి వివరాలతో స్పష్టమైన నోటిఫికేషన్ ఇస్తాం.  స్వయం ఉపాధికి కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలు ఇస్తాం. ఆర్థికంగా చేయూతనిస్తాం. యువతను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతాం. ఒక్కో యువకుడిని మరో 100మందికి ఉద్యోగాలు ఇచ్చేవారిగా మేం తీర్చిదిద్దుతాం.

విద్యార్థులపై ఫీజుల భారం తగ్గిస్తాం!

కేవలం రూ.10వేలు చేతిలోపెట్టి మీ తిప్పలు మీరు పడండని మీపై ఫీజుల భారాన్ని మోపాడు. మేం అధికారంలోకి వచ్చాక ఫీజు రీయింబర్స్ మెంట్ ను పునరుద్ధరిస్తాం. జీఓ 77 ద్వారా పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ విధానాన్ని రద్దు చేశారు. చంద్రబాబు పాలనలో ఫీజు రీయింబర్స్ మెంట్ అమలు చేశారు.  మీ ఫీజును నేరుగా కాలేజీ యాజమాన్యానికికే చెల్లిస్తాం. మీ తల్లిదండ్రులకు ఎటువంటి ఫీజు భారం లేకుండా చేస్తాం. వైసీపీ ప్రభుత్వంలో ఇంజినీరింగ్, పీజీలు చదివి ఫీజులు కట్టలేక సర్టిఫికెట్లు తెచ్చుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. బస్ పాస్ మీరు అడిగిన విధంగా ఇస్తాం. దాన్ని మా మ్యానిఫెస్టోలో పెడతాం. పేదప్రజలు విదేశాల్లో చదువుకునేందుకు విదేశీవిద్యను చంద్రబాబు అమలు చేస్తే  వైసీపీ అధికారంలోకి వచ్చాక 3సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచేశాడు. సామాన్యుడికి రవాణా సౌకర్యం భారంగా మారింది. మనం అధికారంలోకి వచ్చాక ఆర్టీసీ ఛార్జీలు కూడా తగ్గిస్తాం.  కర్నాటక రాష్ట్రంతో పోలిస్తే మన రాష్ట్రంలో లీటర్ డీజిల్ పై రూ.11 అధికంగా రేటు ఉంది. పెట్రోల్, డీజిల్ పన్నులు తగ్గిస్తాం..నిత్యావసరాల ధరలు, ఆర్టీసీ చార్జీలు తగ్గిస్తాం.

మహిళలపై అడుగడుగునా అఘాయిత్యాలు!

మహిళల్ని గౌరవించేలా సమాజంలో పరిస్థితులు ఉండాలి. కానీ ఓ మహిళా మంత్రే మహిళల్ని అగౌరవపర్చేలా మాట్లాడుతోంది. పాలకులే మహిళల్ని అవమానిస్తే మిగిలిన వాళ్లు గౌరవిస్తారా? సీఎం ఇంటికి సమీపంలోనే ఓ యువతి దారుణ హత్యకు గురైంది.  అక్కడ గంజాయి ప్రభావం ఎక్కువగా ఉంది. లా అండ్ ఆర్డర్ ను సమర్థవంతంగా నిర్వహించగలిగితేనే మహిళలపై దాడులు ఆగుతాయి.  900మంది మహిళలపై అత్యాచారాలు, 52వేల మంది మహిళలపై దాడులు జరిగాయని కేంద్ర నివేదికలు చెబుతున్నాయి. ఏకంగా అసెంబ్లీలోనే మహిళల్ని అవమానపరుస్తుంటే ఈ వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ ఉందా? లేదా? అనేది యువత ఆలోచించాలి. మహిళల్ని అవమానించే వారి తోలు తీస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చాక మహిళలను గౌరవించేలా  కేజీ నుండి పీజీ వరకూ ప్రత్యేక పాఠ్యాంశాలు పెడతాం. మహిళలు పడే కష్టాలు, వారి గొప్పతనం, విలువ తెలిసేలా విద్యార్ధి దశ నుండే తెలిసి మహిళల్ని గౌరవించే విధంగా తీర్చిదిద్దుతాం.

యువత రాజకీయాల్లోకి రావాలి!

మార్పు రావాలంటే రాజకీయాల్లో నూటికి నూరుశాతం యువత రావాలి. మీలో చైతన్యం లేకపోవడంతోనే మిమ్మల్ని ప్రభుత్వం మోసం చేస్తోంది.  యువతకు 40శాతం అవకాశాలు ఇస్తానని చంద్రబాబు చెబుతున్నారు.  గ్రామస్థాయి నుండి జాతీయస్థాయి వరకు యువతను పెద్దఎత్తున ప్రోత్సహిస్తాం. నా యువగళంలో మీరు కూడా అడుగులు కలపండి..మీకు కూడా ప్రజల సమస్యలు తెలుస్తాయి. రాష్ట్రంలోని అరాచక పరిస్థితులపై నేను పోరాడుతున్నాను. మీరు కూడా పోరాడండి.

యువతతో ముఖాముఖిలో వ్యక్తమైన అభిప్రాయాలు:

మనీషా, బీటెక్: మీ ప్రభుత్వంలో తెచ్చిన కంపెనీలు వెనక్కి పోతున్నాయి. మీరు అధికారంలోకి వచ్చాక వాటిని వెనక్కి తీసుకురండి. ఐఐటీలో రాష్ట్రం చాలా వెనకబడింది. నాణ్యతలేని విద్యతో విద్యావ్యవస్థ పతనం అయ్యింది. ఐఐటీ, ఎన్.ఐ.టీ ఏపీలో చాలా దారుణంగా ఉంది. దానికి ఓ పరిష్కారం చూపండి.

మోహన్: ప్రస్తుత ప్రభుత్వంలో మాకు ప్రోత్సాహం లేక వెనకబడిపోయాం. టిడిపి వచ్చాక దళితులకు ఎంఎస్ఎంఈ లుగా ఎదగడానికి చర్యలు తీసుకోండి.

శరణ్య: కాలేజీలో ఫీజులు భారం అధికంగా ఉంది. ఆర్టీసీ ఛార్జీలు పెరిగిపోయాయి. రాయితీ పాస్ లు  లేక కాలేజీ విద్యార్థులపై భారం పడుతోంది. తగ్గించడానికి కృషిచేయండి.

సాయిరాం: నేను ఎంసీఏ చదివాను. ఫీజులు కట్టలేదని నాకు సర్టిఫికెట్లు కాలేజీ యాజమాన్యం ఇవ్వలేదు. రూ.80 నుండి లక్ష కడితేనే సర్టిఫికెట్లు ఇస్తామన్నారు. మా సమస్యలు పరిష్కరించండి. మన పక్కనున్న బెంగళూరు, చెన్నై అన్ని రంగాల్లో అభివృద్ది చెందాయి. చంద్రగిరి, తిరుపతికి అన్ని రకాల సదుపాయాలున్నాయి. వీటిని హైదరాబాద్-సైబరాబాద్ లా అభివృద్ధి చేయండి.

జీవన్: మధ్యతరగతి కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. రాష్ట్రం కూడా అప్పుల్లో కూరుకుపోయింది. వీటి నుండి రాష్ట్రాన్నిబయటపడేసేలా చర్యలు తీసుకోండి. యువతకు క్రీడల్లో ప్రాధాన్యత లేదు. ప్రోత్సాహం లేదు.

సుధీర్: యువత ఉద్యోగావకాశాల్లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చాక ఉద్యోగాలిచ్చి ఆత్మహత్యలను నివారించండి.

సునీల్: వాహనాలు కొనుక్కున్న తర్వాత ఆర్.సి, లైసెన్సులు సకాలంలో రావడం లేదు. మీరు అధికారంలోకి వచ్చాక ఈ సమస్యను పరిష్కరించండి.

పవిత్ర: ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం సరిగా అందడం లేదు. మీరు అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ వైద్యశాలల్లో వైద్యాన్ని అందుబాటులోకి తెండి.

జయకృష్ణ: నేను చెన్నైలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం 3ఏళ్లుగా వర్క్ ఫ్రం హోం చేస్తున్నాం. తమిళనాడు వాళ్లు మనల్ని చాలా చులకనగా చూస్తున్నారు. తెలంగాణాకు వెళ్లిన అమర్ రాజాతో సహా మన రాష్ట్రానికి అన్ని రకాల పరిశ్రమలు మీరు తీసుకురావాలి.

శ్రీను: నా తమ్ముడు ఓ రైతు. పాడిపరిశ్రమల కూడా ఉంది. ఎరువులు దొరకడం లేదు. పంటలకు మద్దతు ధర దొరకడం లేదు. పాడి పరిశ్రమకు గతంలో ప్రాధాన్యత ఎక్కువగా ఇచ్చారు. నేడు అది దొరకడం లేదు. మీరు అధికారంలోకి వచ్చాక రైతులను ఆదుకోవాలి.

కీర్తి: మహిళలపై ఇటీవల అత్యాచారాలు, హత్యలు బాగా పెరిగిపోయాయి. ఇంట్లో నుండి బయటకు వెళితే మళ్లీ క్షేమంగా ఇంటికి చేరతామనే నమ్మకం లేదు. మీరు అధికారంలోకి వచ్చాక మాకు పటిష్టమైన భద్రత కల్పించండి.

ధనుంజయ్ రెడ్డి: పాడి పరిశ్రమ, వ్యవసాయంలో కూడా యువతను ప్రోత్సహించాలి. విత్తనం నుండి ఎరువులు, పురుగుల మందులు వరకూ అన్ని పెరిగిపోయాయి. ఇప్పుడు కనీసం మద్దతు ధర లేదు.

లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించిన బలిజ సామాజికవర్గీయులు

గాదంకిలో చంద్రగిరి మండల బలిజ సామాజికవర్గీయులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… గత టిడిపి ప్రభుత్వం కాపు,బలిజ,తెలగ,ఒంటరి కులాలకు 5శాతం రిజర్వేషన్ కోసం అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ప్రస్తుత ప్రభుత్వం అవకాశం ఉన్నా మాకు రిజర్వేషన్ అమలుచేయడం లేదు. కాపు, బలిజ కార్పొరేషన్ ను వైసిపి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసింది. చంద్రగిరి రాయలకోట దగ్గర రాయలవారి విగ్రహాన్ని ఏర్పాటుచేయాలి. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విదేశీవిద్య, ప్రైవేటు ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించి ఆదుకోండి. గత ప్రభుత్వం ఆదరణ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా బలిజలతోపాటు వివిధ కులవృత్తు వారికి పరికరాలు అందజేసి ఆదుకుంది. ప్రస్తుత ప్రభుత్వం ఆదరణ పథకాన్ని రద్దుచేసి తీరని అన్యాయం చేసింది. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తిరిగి ఆదరణ పథకాన్ని పునరుద్దరించండి. గత ప్రభుత్వం వివిధ కులాలకు ఫెడరేషన్లు ఏర్పాటుచేసి నిధులిచ్చి ఆదుకుంది. ప్రస్తుత ప్రభుత్వం కార్పొరేషన్లు ఏర్పాటుచేసిన ఒక్కరూపాయి నిధులు కేటాయించలేదు. పాలకవర్గాలను ఉత్సవ విగ్రహాలుగా మార్చింది. గతంలో బలిజలకు ఆర్థిక చేయూత నివ్వడానికి సబ్సిడీ, మార్జిన్ మనీతో కూడిన రుణాలను మంజూరుచేయగా, చివరలో ఎన్నికలు రావడంతో బ్యాంకర్లు సహకరించలేదు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బ్యాంకర్లతో సంబంధం లేకుండా కార్పొరేషన్లకు బడ్జెట్ లో నిధులు కేటాయించి రుణాలు మంజూరుచేయాలని కోరారు.

నారా లోకేష్ స్పందిస్తూ…

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాపు, బలిజ కార్పొరేషన్ ను నిర్వీర్యం చేసి తీరని ద్రోహం చేసింది. బలిజకాపులకు నిర్లక్ష్యం చేయడమేగాక వారిని వేధించడమే పనిగా పెట్టుకుంది. గతం ప్రభుత్వం చేపట్టిన కాపు, బలిజ భవనాల నిర్మాణాన్ని నిలిపివేశారు. స్వయం ఉపాధి రుణాలు లేకుండా చేశారు, కౌలు రైతులకు భరోసా లేకుండా చేశారు.  కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాల సంక్షేమానికి టిడిపి కట్టుబడి ఉంది. ఎపిలోనే మొట్టమొదటిసారిగా కాపు,బలిజ,తెలగ, ఒంటరి కార్పొరేషన్ ఏర్పాటుచేశాం. టిడిపి అధికారంలోకి వచ్చాక బలిజ కాపుల రాజకీయ, ఆర్థిక, సామాజికాభివృద్ధికి కృషిచేస్తాం.

యువనేతను కలిసిన కావలివారిపల్లె గ్రామస్తులు

పాదయాత్ర దారిలో చంద్రగిరి నియోజకవర్గం కావలివారిపల్లి గ్రామస్తులు లోకేష్ ను కలిశారు. కావలివారిపల్లి, కె.వడ్డేపల్లి, అచ్చమ్మ అగ్రహారం గ్రామాల్లో ఎక్కడా డ్రైనేజిలు లేవు. డ్రైనేజిలు లేకపోవడంతో దశాబ్ధాలుగా ఇబ్బందులు పడుతున్నాం. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎన్నో హామీలు ఇచ్చారు, గెలిచాక ముఖం కూడా చూపించడం లేదు. మురుగునీరు రోడ్డుపైకి వచ్చి దుర్వాసన, దోమలతో గ్రామప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. గ్రామంలో సరైన వైద్యసదుపాయాలు కూడా లేవు. పంచాయితీ, మండల అధికారులకు ఫిర్యాదుచేసినా కనీసం బ్లీచింగ్ కూడా చల్లించడం లేదు. చిన్నపిల్లలు డ్రైనేజి దాటుకొని స్కూలుకు వెళ్లాల్సి వస్తోంది. ఎమ్మెల్యేని కలవడానికి తమను అనుమతించడం లేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మా గ్రామాలకు డ్రైనేజి సౌకర్యం కల్పించండి.

నారా లోకేష్ మాట్లాడుతూ…

రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ నేతృత్వంలోని చీటింగ్ ప్రభుత్వం పంచాయితీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసింది. పంచాయితీల అభివృద్ధి కోసమని కేంద్రం కేటాయించిన 8వేలకోట్ల రూపాయల నిధులను సర్పంచ్ లకు తెలియకుండా దొంగిలించింది. జగన్మోహన్ రెడ్డికి దోచుకోవడం, దాచుకోవడంపై ఉన్న శ్రద్ధ గ్రామాల అభివృద్ధిపై లేదు.వైసిపి ప్రభుత్వం నిర్వాకం కారణంగా ఈరోజు గ్రామాల్లో కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి కూడా నిధుల్లేవు. గత టిడిపి ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో 25వేల కోట్ల కిలోమీటర్ల సిమెంటు రోడ్లు, 10లక్షలకుపైగా ఎల్ఇడి లైట్లు ఏర్పాటుచేసి అందంగా తీర్చిదిద్దాం. స్థానిక సంస్థల బలోపేతం ద్వారా గ్రామాలను అభివృద్ధి చేస్తాం.

తెలుగుదేశం కొడుకులా ఆదుకుంది!- నారా లోకేష్ కి కృత‌జ్ఞత‌లు తెలిపిన పాకాల‌వారిప‌ల్లె మోహ‌న‌రావు దంప‌తులు

చెట్టంత కొడుకు దూర‌మైతే, కొడుకులా తెలుగుదేశం పార్టీ అండ‌గా నిలిచింద‌ని, నారా లోకేష్‌ని క‌లిసి కృత‌జ్ఞత‌లు తెలిపింది ఓ కుటుంబం.  చిత్తూరు జిల్లా, చంద్రగిరి మండలం, పనపాకం పంచాయతీ, పాకాలవారిపల్లెలో కె. మోహన్ రావు కుటుంబం నివాసం ఉంటోంది. వీరి అబ్బాయి జయకృష్ణ తిరుపతిలో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. 23/5/2019న బైక్ మీద వెళుతుండగా, వెనుక నుంచి వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మరణించారు. కుటుంబానికి పెద్ద దిక్కులా నిలిచిన కొడుకు క‌న్నుమూయ‌డంతో ఆ దంప‌తులు విషాదంలో మునిగిపోయారు. టిడిపి స‌భ్య‌త్వం ద్వారా చేసిన ప్ర‌మాద‌బీమా నుంచి రూ.2ల‌క్షలు, చంద్రన్నబీమా ద్వారా మ‌రో రూ.2ల‌క్షలు బీమా ప‌రిహారం మంజూరైంది. ఆధార‌మైన కొడుకు పోయిన కొండంత క‌ష్టంలో ఉన్న వృద్ధదంప‌తుల‌కు తెలుగుదేశం పార్టీ బీమా, టిడిపి ప్రభుత్వం అమ‌లు చేసిన చంద్రన్న బీమా ఆస‌రా అయ్యింది. చంద్రగిరి నియోజకవర్గం గాదంకి టోల్ గేట్ వద్ద విడిది కేంద్రం వ‌ద్దకి వ‌చ్చి నారా లోకేష్‌ని క‌లిసి మోహ‌న‌రావు దంప‌తులు కృత‌జ్ఞత‌లు తెలియ‌జేశారు. ఎప్పుడు ఏ అవ‌స‌రం వ‌చ్చినా పార్టీ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని లోకేష్ వారికి భ‌రోసా ఇచ్చారు.

మైక్ లాక్కోగలరు కానీ… నా గొంతు నొక్కలేరు! జి.ఓ-1 నీకు వర్తించదా? అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తాం పాకాలలో యువనేత నారా లోకేష్

చంద్రగిరి నియోజకవర్గం పాకాల గ్రామంలో TDP జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ… నా మైక్ లాక్కోగలరేమో కానీ నా గొంతు నొక్క లేరు,  నాకు ఈ గొంతు ఇచ్చింది ఎన్టీఆర్ , నా గొంతులో ఊపిరి ఉన్నంత వరకు ప్రజల కోసం పోరాడుతా .పాదయాత్ర ప్రారంభమైన నాటి నుంచి నాపై  4 కేసులు పెట్టారు, నా వాహనాలు సీజ్ చేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా తగ్గేది లేదు, ప్రజల కోసం దేనికైనా  సిద్దం.  యువగళం పాదయాత్రను అడ్డుకోవాలన్న కుట్రతోనే జీవో నెం. 1 తెచ్చారు వైసీపీ పాలనలో ప్రజలెవరూ సంతోషంగా లేరు, రైతులకు గిట్టుబాటు ధర లేదు, ఉద్యోగులకు జీతాలు లేవు, యువతకు ఉద్యోగాలు లేవు, పోలీసు సోదరులకు సరెండర్ లీవ్ లు, టీఏలు, డీఎలు లేవు.

45 ఏళ్లకే  ఎస్సీ, ఎస్సీ, బీసీ  మహిళలకు ఫించన్, యువతకు 2.30 లక్షల ఉద్యోగాలిస్తానన్న హామీలపై ప్రశ్నిస్తే  నేటీకీ సమాధానం చెప్పలేదంటే మౌనమే అర్దంగీకారమా? చంద్రబాబు గారు ఒప్పుకోకపోయినా సరే నేను మాత్రం వైసీపీ నేతల అరాచకాలకు వడ్డీతో సహా చెల్లిస్తా.

10 ఏళ్ల నుంచి చంద్రగిరి ప్రజల జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా? 10 ఏళ్లలో ఒక పరిశ్రమ  అయినా తెచ్చారా? యువతకు ఉద్యోగాలిచ్చారా? ఇలాంటి ఎమ్మెల్యే మనకు అవసరమా? పులివర్తి నానిని ఆశీర్వదించండి అభివృద్ది అంటే ఏంటో చేసి చూపించే భాధ్యత నేను తీసుకుంటా. చెవిరెడ్డి రూ. 1000 కోట్లు దొబ్బేసి మళ్లీ చీర,  స్వీట్ బాక్స్ తీసుకొని వస్తాడు, చంద్రగిరి ప్రజలు మరోసారి నమ్మి మోసపోవద్దని యువనేత పేర్కొన్నారు.

Also read this blog: Yuvagalam Padayatra: A Walk of Perseverance despite of obstacles and hurdles at Every Step

Tagged #LokeshPadaYatra #Padayatra #YuvaGalamLokesh #YuvaGalam #NaraLokeshPadaYatra #NaraLokesh 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *