TDP

Nara Lokesh padayatra

మదనపల్లిలో యువనేతకు బ్రహ్మరథం జనసంద్రంగా మారిన మదనపల్లి వీధులు అడుగడుగునా హారతులతో మహిళల నీరాజనాలు తంబళ్లపల్లి నియోజకవర్గంలో ప్రవేశించిన యువగళం

మదనపల్లి: పోరాటాల పురిటిగడ్డ మదనపల్లిలో యువనేత Nara Lokesh యువగళం పాదయాత్రకు జనం పోటెత్తారు. యువగళం పాదయాత్ర 40వరోజు మదనపల్లి శివారు దేవతానగర్ నుంచి ప్రారంభమై పట్టణ వీధుల గుండా సాగింది. యువనేతకు అడుగడుగునా మదనపల్లి ప్రజలు స్వాగతం పలికారు. అంబేద్కర్ సెంటర్ కు చేరుకున్న లోకేష్ కు కార్యకర్తలు, ప్రజలు పెద్దఎత్తున స్వాగతం పలికారు. కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. సీటీఎం రోడ్, టౌన్ బ్యాంక్ సర్కిల్, జెఎమ్సీ చర్చి సెంటర్, బెంగళూరు బస్టాండ్ సెంటర్లో గజమాలతో యువనేతకు స్వాగతం పలికారు. యువనేత రాక సందర్భంగా బాణాసంచా మోతలు, డప్పుల శబ్ధాలతో యువతీయువకులు హోరెత్తించారు. యువనేత పాదయాత్ర సమయంలో మదనపల్లి ప్రజలు భవనాలపై నిలబడి చేతులు ఊపుతూ సంఘీభావం తెలిపారు. మదనపల్లి రోడ్లన్నీ కిటకిటలాడాయి. బస్టాండ్ సెంటర్ వద్ద కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే షాజహాన్ లోకేష్ పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. దారి పొడవునా కార్యకర్తలు, నాయకులు, మహిళలు పూలు చల్లుతూ యువనేతపై అభిమాన వర్షం కురిపించారు. మదనపల్లి నియోజకవర్గంలో రెండురోజులపాటు దిగ్విజయంగా సాగిన లోకేష్ యువగళం పాదయాత్ర శుక్రవారం సాయంత్రం తంబళ్లపల్లి నియోజకవర్గంలోకి ప్రవేశించింది. తంబళ్లపల్లి నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు, నాయకులు, అభిమానులు యువనేతకు అపూర్వస్వాగతం పలికారు.

యువనేత పాదయాత్రలో వ్యక్తమైన సమస్యలు:

జీతాల పెంపుపై స్పందించడం లేదు

-టి.అమ్ములు, ఆర్టీసీ కాంప్లెక్స్ స్వీపర్

ఆర్టీసీ కాంప్లెక్స్ లో 20 ఏళ్లుగా ఔట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగం చేస్తున్నా. ప్రస్తుతం నెలకు రూ.8,500 జీతంగా ఇస్తున్నారు. అద్దె ఇంట్లో ఉంటూ కుటుంబాన్ని పోషించుకోవాలంటే కష్టంగా ఉంది. ఈ ప్రభుత్వం సెంటు స్థలం ఇచ్చింది..కానీ పునాదికే లక్షన్నర ఖర్చు అయింది. మేము ఇళ్లు ఎలా నిర్మించుకోవాలి మమ్మల్ని పర్మినెంట్ చేయడంతోపాటు ఇంటి నిర్మాణాన్ని ప్రభుత్వమే భరించాలి.

అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు ఇవ్వడం లేదు -కె.వీణ, అంగన్వాడీ, ఈశ్వరమ్మకాలనీ

అంగన్వాడీ ఉద్యోగం చేస్తున్నందుకు నాకు రూ.10 వేల జీతం వస్తోంది. కానీ సంక్షేమ పథకాలు నిలిపేశారు. నా కూతురుకు అమ్మఒడి ఒక యేడాది ఇచ్చి..తర్వాత నిలిపేశారు. పై చదువులకు వెళ్లే మా బిడ్డలకు అంగన్వాడీ పోస్టును సాకుగా చూపి ఫీజు రీయింబర్స్ ఇవ్వడం లేదు. చాలచాలని జీతంతో నెట్టుకొస్తున్న తమను పథకాలకు దూరం చేయడం అన్యాయం. మేమేమైనా పర్మినెంట్ ఉద్యోగులమా?  కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి?

లోకేష్ సమక్షంలో పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా

మదనపల్లి: రేపు తంబళ్లపల్లి నియోకవర్గంలో ఉంటా… చిత్తూరు జిల్లాకు ఎవరేం చేశారో చర్చిద్దాం రండని ఎంపి మిథున్ రెడ్డికి యువనేత నారా లోకేష్ సవాల్ విసిరారు. అన్నమయ్య జిల్లా, మదనపల్లి శివారు నీరుగట్టువారిపల్లి బహిరంగసభలో యువనేత లోకేష్ ప్రసంగించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… చిత్తూరు అభివృద్ధికి మేము నిధులు కేటాయించాం… ఫాక్స్ కాన్, సెల్ కాన్ వంటి పరిశ్రమలు తెచ్చి వేలాదిమంది యువతకు ఉద్యోగాలిచ్చాం. పుంగనూరులో రోడ్లకు నిధులు మంజూరుచేసింది కూడా నేను పంచాయితీరాజ్ మంత్రిగా పనిచేసే సమయంలోనే. చిత్తూరును పెద్దిరెడ్డి కుటుంబం నమిలేస్తోంది. ఒకరికి ముగ్గరు ప్రజాప్రతినిధులు ఉన్న పెద్దిరెడ్డి అండ్ కో మదనపల్లిని ఎందుకు జిల్లా చేయలేదు? ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీగా పెద్దిరెడ్డి కుంటుంబం ఉంది. జిల్లా వాళ్ల  చేతిలో ఉండాలని మదనపల్లిని జిల్లా కాకుండా పెద్దిరెడ్డి అడ్డుకున్నారు. జిల్లాలో అడుగడుగునా నేను చేసిన అభివృద్ధే కనబడుతోంది.

దమ్మూధైర్యంతో పాదయాత్ర చేస్తున్నా!

దమ్మూధైర్యంతో పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్యలపై పోరాడుతున్నాం సాగనిస్తే పాదయాత్ర..లేదంటే దండయాత్ర. కార్యకర్తలకు అండగా ఉండి పోరాడతా. మీ జోలికి వచ్చిన వాళ్ల తోలు వలుస్తా.  అధికారులు కూడా చట్టాలు ఉల్లంఘించవద్దు. కార్యకర్తలను ఇబ్బందిపెట్టిన వారిపై జ్యూడిషియల్ విచారణ వేసి సర్వీస్ నుండి తప్పించి శిక్షిస్తాం. పోరాటాలకు పుట్టినిల్లు మదనపల్లి. స్వాతంత్ర్యంకోసం గాంధీ మదనపల్లి వచ్చినప్పుడు పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చారు. బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా పోరాడి తరమికొట్టింది వాళ్లు మదనపల్లి బీటీ కాలేజీ వాళ్లే. జాతీయ గీతం బెంగాళ్ నుండి ఇంగ్లీష్ లోకి అనువాదం చేసింది కూడా మదనపల్లి బీటీ కాలేజీలోనే. 500 కి.మీ మైలు రాయిని దాటింది ఈ మదనపల్లెలోనే..అది నా అదృష్టం.

ఒక్కచాన్స్ ఇస్తే ఏం చేశాడు?

జగన్ కు ఇచ్చిన ఒక్క అవకాశంతో మీ జీవితాలు మారాయా.? ఒక్క ఛాన్స్ ఇచ్చింది విధ్వంసానికే. ఒక్క అవకాశం కూల్చివేతలకు ఇచ్చారు. ప్రజావేదికతో మొదలైన కూల్చివేతలు ప్రజలు ఇళ్ల వద్దకు కూడా వచ్చాయి. మరో ఛాన్స్ ఈ ప్రభుత్వానికి ఇద్దామా.? వాళ్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన ఎంపీని దారుణంగా కొట్టి, ఇబ్బంది పెట్టారు.  ఒంగోలుకు చెందిన సుబ్బారావు గుప్తా అనే వ్యక్తి ఓ మాజీ మంత్రికి వ్యతిరేకంగా మాట్లాడితే గంజాయి కేసు పెట్టి జైలుకు పంపారు. TDP నాయకులు, ప్రజలు, ఆఖరికి సొంత కార్యకర్తలపైనా జగన్ దాడులు చేస్తున్నారు.

మైనారిటీలకు జగన్ వెన్నుపోటు

మైనారిటీలకు వెన్నుపోటు పొడిచాడు. ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తానని చేయలేదు. మైనారిటీ కార్పొరేషన్ చంపేశాడు..దుల్హన్ పథకం, రంజాన్ తోఫా, ఇమామ్, మౌజామ్ లకు ఇచ్చే వేతనాలు చంపేశాడు. పది మంది మైనారిటీలను చంపి, 46 మందిపై దాడులు చేశారు. కర్నూలులో హజీరా అనే యువతిని చంపారు..కనీసం పోస్టుమార్టం రిపోర్టు కూడా ఇవ్వలేదు. పలమనేరులో మిస్బా అనే చెల్లి బాగా చదవుతుంటే వైసీపీ నేత కూతురు నెంబర్ 2 వస్తుందని టీసీ ఇచ్చి పంపితే తట్టుకోలేక మిస్బా ఆత్మహత్య చేసుకుంది. టీడీపీ హయాంలో మైనారిటీలు ఆత్మహత్య చేసుకున్నారా? ముస్లింలను ఆదుకున్నాం. టిడిపి అధికారంలోకి వచ్చాక ఇస్లామిక్ బ్యాంక్ ముస్లింలకు ఏర్పాటు చేస్తాం. కార్పొరేషన్ నిధులిచ్చి విరివిగా రుణాలిస్తాం.

మదనపల్లికి నలుగురు ఎమ్మెల్యేలు!

మదనపల్లికి మొత్తం నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. అధికారిక ఎమ్మెల్యే నవాజ్ బాషా అయితే అనధికార ఎమ్మెల్యేలు పాపాల పెద్దిరెడ్డి, తంబళ్లపల్లి ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి.  తమిళనాడు రిజిస్ట్రేషన్ తో చేసిన లారీలతో ఇక్కడ కొండలను తవ్వి గ్రావెల్ తరలిస్తున్నారు. దళితులకు చెందిన డీకేటీ భూములు లాక్కుని మైనింగ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే నవాజ్ బాషా తన బినామీలతో బెంగళూరు బస్టాండ్ పరిధిలోని షాపింగ్ కాంప్లెక్స్ నుండి నెలకు ఐదు లక్షలు వసూలు చేస్తున్నాడు. మదనపల్లి పట్టణంలో నవాజ్ బాషా తన అనుచరులతో వెంచర్లు వేస్తున్నాడు. ప్రభుత్వ భూమి పక్కనే ఉండేలా ప్రేవేటు స్థలాల్లో వెంచర్లు వేస్తూ ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తున్నాడు.

అడుగడుగునా దోపిడీ పర్వమే!

నవాజ్ బాషా, అనుచరులు కలసి ప్రభుత్వానికి చెందిన 40 ఎకరాల్లో లేఅవుట్లు వేసి రూ.100 దోచుకున్నారు. మదనపల్లిలో లే అవుట్ వేయాలంటే కప్పం కట్టాలి. 557 ఎకరాలు ఉన్న సీటీఎం చెరువును స్థానిక ఎమ్మెల్యే, తంబళ్లపల్లి ఎమ్మెల్యే ద్వారకనాథ్  రెడ్డి అనుచులు 40 ఎకరాలు కాజేశారు. కరోనా వస్తే షాపులు, రెస్టారెంట్లు, బంగారం కొట్ల నుండి రూ.4కోట్లు వసూలు చేశారు. వలసపల్లి దగ్గర జ్యూస్ ఫ్యాక్టరీకి చెందిన మూడెకరాల భూమిని ఎమ్మెల్యే నవాజ్ బాషా లారీ ఓనర్స్ అసోషియేషన్ పేరు చెప్పి రూ.12కోట్లు విలువు చేసే భూమిని లాక్కున్నారు.  బసినికొండ రోడ్డులో అగ్గిపెట్టె పరిశ్రమ కార్మికులకు చెందిన రూ.20 కోట్ల విలువైన రెండెకరాల భూమిని ఎమ్మెల్యే నవాజ్ బాషా ఆక్రమించారు. నిమ్మనపల్లిలోని బహుదా నది నుండి రోజూ 100 టిప్పర్ల ఇసుక బెంగుళూరుకు వెళ్తోంది. మదనపల్లిలో క్వారీలు చేయాలంటే పాపాల పెద్దిరెడ్డికి 50 శాతం కమిషన్ ఇవ్వాలి.  ఘన చరిత్ర ఉన్న బీటీ కాలేజీకి చెందిన 40 ఎకరాల భూమిని కూడా స్వాహా చేసే ప్రయత్నం చేస్తున్నారు. 2024 నాటికి దొరికిన భూమి, కొండలు, చెరువులు కూడా స్వాహా చేస్తారు.

అధికారంలోకి వచ్చిన 6నెలల్లో మదనపల్లి కేంద్రంగా జిల్లా

మదనపల్లి ప్రజలకు నేను హామీ ఇస్తున్నా..పీలేరు, మదనపల్లి, పుంగనూరు, తంబళ్లపల్లిని కలిపి ఆరునెలల్లోనే జిల్లా చేస్తా. మదనపల్లి జిల్లా కేంద్రంగా ఉంటుంది. మదనపల్లిలో పెండింగులో ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పూర్తి చేస్తాం. హంద్రీనీవా కాలువలోని 59వ ప్యాకేజ్, చిప్పిలి, గుంటువారిపల్లి ఎస్ఎస్ ట్యాంక్ నిర్మాణాలకు రూ.180 కోట్లు మంజూరు చేశాం.  ఈ తాగునీటి పథకాన్ని 90 శాతం మేము పూర్తి చేస్తే.. 10 శాతం పెండింగ్ ఉంది. దాన్ని ఈ ప్రభుత్వం పూర్తి చేయలేదు..మేము వచ్చిన వెంటనే పూర్తి చేస్తాం. చేనేతలు భయపడొద్దు మీ సమస్యలు నాకు తెలుసు. పవర్ లూమ్స్ ఉన్నవాళ్లకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తాం. చేనేత కార్మికులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తాం.  నేతన్నలు వేసే వస్త్రాలకు బ్రాండ్ తీసుకొస్తాం.

టమోటా మార్కెట్ ను దత్తతతీసుకుంటా!

టమోటా రైతులను జగన్ గతంలో కలిశాడు..జ్యూస్ ఫ్యాక్టరీ తెస్తా అన్నాడు. కానీ హామీని జగన్ రెడ్డి మర్చిపోయాడు. నేను 500 కి.మీ పూర్తి చేసిన సందర్భంగా అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలో ప్రాసిసింగ్ యూనిట్లు, కోల్డ్ స్టోరోజ్ లు ఏర్పాటు చేస్తాం. టమోటా పండించే ఉమ్మడి చిత్తూరు, అనంతపురం రైతులకు మేలు చేకూర్చేలా టమోటా వాల్యూ చైస్ ప్రాజెక్టు తీసుకురావాలని నాడు టీడీపీ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ.70 కోట్లు కేటాయించాం. కానీ ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు.  రైతులకు హామీ ఇస్తున్నా..మదనపల్లి టమోటా మార్కెట్ ను నేను దత్తత తీసుకుంటా.మీరు చూపిన ప్రేమ, ఆదరణ, గౌరవం మర్చిపోలేను. మదనపల్లిలో అడుగుపెట్టినప్పుటినుండి నాకు ఘన స్వాగతం పలికి ఆశీర్వదించారు.

పరిశ్రమలు రాకపోవడానికి పెద్దిరెడ్డి కుటుంబమే కారణం

మదనపల్లికి పరిశ్రమలు రాకపోవడానికి కారణం పెద్దిరెడ్డి కుటుంబమే. వాళ్ల కుటుంబాన్ని తరిమికొట్టండి. మదనపల్లిలో వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలి. టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషాను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. దొమ్మలపాటి రమేష్, షాజహాన్ బాషా ఇద్దరూ సమన్వయంతో మదనపల్లిని టీడీపీకి కంచుకోటగా మార్చాలి.

పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా

మదనపపల్లిలో బహిరంగసభ అనంతరం మదనపల్లి వైసిపి ఎమ్మెల్యే నవాజ్ బాషా సోదరుడు, మాజీ ఎమ్మెల్యే  షాజహాన్ బాషా టిడిపిలో చేరారు.  బహిరంగ సభ వేదికపైనే ఆయనకు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. స్థానిక ఇన్చార్జి దొమ్మాలపాటి రమేష్ కలసి పార్టీ గెలుపుకోసం పనిచేయాలని  ఈ  సందర్భంగా కోరారు.

లోకేష్ ను కలిసిన మదనపల్లి ప్రముఖులు

మదనపల్లి పట్టణంలోని 8,9వార్డులకు చెందిన పలువురు ప్రముఖలు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన నిరుద్యోగ భృతిని వైసిపి ప్రభుత్వం నిలిపివేసింది. వివిధ కళాశాలల్లో చదివే విద్యార్థులకు స్కాలర్ షిప్పులు సరిగా అందడంలేదు. మదనపల్లిలో ఎటువంటి పరిశ్రమలు లేకపోవడంతో ఉద్యోగాల కోసం పొరుగు రాష్ట్రానికి వలస వెళ్లాల్సి వస్తోంది. మదనపల్లి ప్రభుత్వాసుపత్రిలో సరైన వైద్య సదుపాయాలు లేవు. పట్టణంలో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి, ట్రాఫిక్ సమస్య అధికంగా ఉంది. మదనపల్లి నియోజకవర్గంలో వేలాది రైతులు ఆధారపడిన టమోటాకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు చేపట్టాలి. మదనపల్లి కేంద్రంగా జిల్లా ఏర్పాటుచేయాలి. ఆర్టీసి బస్టాండు దగ్గరనుంచి బర్మా వీధివరకు ఫ్లైఓవర్ నిర్మించాలి. పెద్దతోపు రోడ్డును బైపాస్ రోడ్డువరకు విస్తరించి ట్రాఫిక్ ను నియంత్రించాలి.

*నారా లోకేష్ స్పందిస్తూ…*

అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తికావస్తున్నా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రాభివృద్ధిపై ఎటువంటి ఆలోచనా లేదు. అధికారంలోకి వచ్చాక కూల్చివేతలు, ఉన్నకంపెనీలను బెదిరించి పంపడం తప్ప ఆయన చేసిందేమీ లేదు. మున్సిపాలిటీలు, స్థానికసంస్థలను పూర్తిగా దివాలా తీయించి కనీసం కరెంటు బిల్లులు కూడా కట్టలేని దుస్థితికి తెచ్చారు. మదనపల్లి టమోటా రైతుల కష్టాలు తీర్చే విషయంలో టిడిపికి స్పష్టమైన విజన్ ఉంది. అధికారంలోకి వచ్చిన వెంటనే టమోటా ప్రాసెసింగ్ యూనిట్, కోల్డ్ స్టోరేజిల ఏర్పాటు ద్వారా టమోటా రైతుల కష్టాలు తీరుస్తాం. మదనపల్లి పట్టణ సమస్యల పరిష్కారానికి ప్రణాళిక బద్ధంగా కృషిచేస్తాం.

యువనేతను కలిసిన మదనపల్లి మైనారిటీలు

పాదయాత్ర దారిలో మదనపల్లిలో యువనేత లోకేష్ ను ముస్లిం మైనారిటీలు కలిసి పలు సమస్యలను విన్నవించారు. చంద్రబాబునాయుడు హయాంలో మదనపల్లికి మంజూరుచేసిన షాదీమహల్ ఇప్పటివరకు నిర్మాణదశలోనే ఉంది. అధికారంలోకి వచ్చిన వెంటనే దీనిని పూర్తిచేయాలి. మదనపల్లి నియోజకవర్గంలో ఉర్దూ జూనియర్, డిగ్రీకాలేజిలను ఏర్పాటుచేయాలి. మదనపల్లి అన్యాక్రాంతమైన వక్ఫ్ భూములను అధికారంలోకి వచ్చాక తిరిగి వక్ఫ్ బోర్డుకు స్వాధీనంచేసి రక్షణ కల్పించాలి.  జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉర్దూను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉర్దూను రెండవ అధికారభాషగా అమలుచేయాలి. హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు ఆర్థిక సహాయం పెంచాలి. ఎస్సీ, ఎస్టీ, బిసిల మాదిరి ముస్లింలకు ప్రత్యేక సబ్ ప్లాన్ కేటాయించాలి. మదనపల్లిలో మైనారిటీ భవన్ కోసం స్థలం కేటాయించాలి. మైనారిటీ కార్పొరేషన్ ద్వారా గత ప్రభుత్వంలో అమలుచేసిన పథకాలను పునరుద్దరించాలి. ముస్లింలలోని మొఘల్, సయ్యద్, పఠాన్ లను బిసి-ఇ కేటగిరిలో చేర్చాలి.

*నారా లోకేష్ స్పందిస్తూ….*

దేశంలోనే మొట్టమొదటి మైనారిటీ కార్పొరేషన్ ఏర్పాటుచేసిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుంది. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లింల ఆస్తులకేగాక మాన,ప్రాణాలకు కూడా రక్షణలేకుండా పోయింది. వైసిపి నేతలచే ఆక్రమణలకు గురైన వక్ఫ్ బోర్డు భూములను తిరిగి స్వాధీనపరుస్తాం. వక్ఫ్ బోర్డుకు జ్యుడీషియల్ అధికారాలచ్చిన ఆస్తుల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటాం. గత ప్రభుత్వ హయాంలో మైనారిటీలకు అమలుచేసిన పథకాలన్నీ పునరుద్దరిస్తాం. మదనపల్లిలో షాదీమహల్ నిర్మాణాన్ని అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తిచేస్తాం. మైనారిటీలంతా తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించి చంద్రన్నను సిఎం చేసేందుకు సహకరించండి.

లోకేష్ ను కలిసిన మదనపల్లి విద్యార్థి, యువజన సంఘాల జెఎసి ప్రతినిధులు

మదనపల్లి విద్యార్థి, యువజన జెఎసి ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. మదనపల్లిలో 1915లో స్థాపితమైన బిటి కళాశాల ఎంతోమందిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దింది. బిటి కళాశాలలో విద్యనభ్యసించిన వారు ముఖ్యమంత్రులు, న్యాయమూర్తులుగా ఎదిగారు. మద్రాసు బీసెంట్ ట్రస్ట్ కింద పనిచేసిన ఈ కళాశాలను గత ఏడాది ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. గతంలో ఇంటర్, డిగ్రీ, పీజీల్లో అన్ని కోర్సులు ఉండగా, ప్రస్తుతం కొన్ని కోర్సులను మాత్రమే కొనసాగిస్తున్నారు. కళాశాలలోని బాయ్స్, గర్ల్స్ హాస్టళ్లను మూసివేశారు.  ప్రభుత్వం స్వాధీనం చేసుకుని 7నెలలు కావస్తున్నా ఇప్పటివరకు టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీచేయలేదు. ఇప్పటికే ఉన్న సిబ్బందికి జీతాలుకూడా సక్రమంగా చెల్లించడం లేదు. ఫుల్ టైమ్ ప్రిన్సిపాల్ ను నియమించకుండా ఇన్చార్జితో నామమాత్రంగా నడిపిస్తున్నారు. బిసిటి ట్రస్ట్ కింద ఉన్న ఆస్తులన్నింటినీ స్వాధీనంచేసుకుని ప్రత్యేక యూనివర్సిటీగా అభివృద్ధి చేయాలి. ట్రస్ట్ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడేందుకు చర్యలు తీసుకోవాలి.

*నారా లోకేష్ స్పందిస్తూ…*

రాష్ట్రంలోని వేలకోట్లరూపాయల ప్రముఖ ట్రస్టులు, ఎయిడెడ్ భూముల ఆస్తులను కొట్టేయాలన్న దుర్భుద్ధితోనే జగన్ ప్రభుత్వం విలీనం నాటకానికి తెరలేపింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంతో నాణ్యమైన విద్యనంచిన క్రిస్టియన్, మైనారిటీ ఎయిడెడ్ విద్యాసంస్థలను బలవంతంగా స్వాధీనం చేసుకొని పేదలకు విద్యను దూరం చేస్తోంది. జగన్మోహన్ రెడ్డి దోపిడీ విధానాలకు విద్యాసంస్థలు సైతం బలిపశువులుగా మారాయి. ఎయిడెడ్ విద్యాసంస్థల్లో విద్యనభ్యసిస్తున్న లక్షలాది విద్యార్థులకు ఉత్తమ విద్యను దూరం చేశారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యాసంస్థల్లో రాజకీయ జోక్యాన్ని నివారిస్తాం. ఆయా కళాశాలల్లో సౌకర్యాలను మెరుగుపర్చి నాణ్యమైన విద్యను అందిస్తాం. రాయలసీమలోనే పేరెన్నికగన్న మదనపల్లి బిటి కళాశాలకు గత వైభవాన్ని తీసుకువస్తాం.

Also read this blog: Yuvagalam Continuous Drive Towards Excellence

Tagged:#LokeshPadaYatra#Padayatra#YuvaGalamLokesh#YuvaGalam#NaraLokeshPadaYatra#NaraLokesh

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *