500 కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్న యువగళం పాదయాత్ర! మదనపల్లిలో టమోటా ప్రాసెసింగ్ యూనిట్ కు యువనేత హామీ అడుగడుగునా అడ్డంకులు సృష్టించినా యువగళం అడుగు ముందుకే 39వరోజు మదనపల్లి నియోజకవర్గంలో ఉత్సాహంగా సాగిన పాదయాత్ర ప్రతిరోజూ సగటున 13కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసిన లోకేష్
మదనపల్లి: యువనేత నారా లోకష్ చేపట్టిన యువగళం పాదయాత్ర మదనపల్లి రూరల్ చిన తిమ్మసముద్రం-2 వద్ద 500 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా శిలాఫలకాన్ని లోకేష్ ఆవిష్కరించారు. పాదయాత్ర 500 కి.మీ. చేరిన సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… టిడిపి అధికారంలోకి వచ్చాక మదనపల్లి నియోజకవర్గంలో టమోటా రైతుల కోసం టమోటా ప్రాసెసింగ్ యూనిట్, కోల్డ్‌స్టోరేజ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. యువనేత పాదయాత్ర ప్రారంభించాక 39వరోజు యువనేత 500 కిలోమీటర్లను అధిగమించారు. కుప్పంలో జనవరి 27న ప్రారంభమైన పాదయాత్ర ఇప్పటివరకు 12 నియోజకవర్గాల్లో పూర్తయి 13వదిగా మదనపల్లి నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు యువనేత ప్రతిరోజు సగటున 13కిలోమీటర్ల పాదయాత్ర పూర్తిచేశారు. రోజుకు 10కిలోమీటర్ల చొప్పున నడవాలని లక్ష్యంగా నిర్ణయించుకోగా, నిర్ణీత లక్ష్యానికంటే సగటున 3కిలోమీటర్లు అధికంగా నడిచారు. వడివడిగా అడుగులు వేస్తూ గరిష్టంగా కొన్నిచోట్ల 19 కిలోమీటర్లు ఒకేరోజు యువనేత నడక సాగించారు. కుప్పం, పలమనేరు, పూతలపట్టు, చిత్తూరు, జిడి నెల్లూరు, నగరి, సత్యవేడు, శ్రీకాళహస్తి, తిరుపతి, చంద్రగిరి, పుంగనూరు, పీలేరు నియోజకవర్గాల్లో ఇప్పటివరకు పాదయాత్ర పూర్తయింది. యువగళానికి ప్రజలనుంచి వస్తున్న అనూహ్య స్పందన చూసిన వైసిపి ప్రభుత్వం పాదయాత్రను అడ్డుకునేందుకు చేయని ప్రయత్నమంటూ లేదు. పాదయాత్ర ప్రారంభమయ్యాక ఇప్పటివరకు 16 కేసులు నమోదుచేశారు. సగటున ప్రతి 33 కిలోమీటర్లకు ఒక కేసు నమోదైంది. పాదయాత్ర దారిలో యువగళానికి చెందిన సౌండ్ సిస్టమ్, ప్రచారవాహనం, మైక్, స్టూల్ ను సైతం పోలీసులు లాగేసుకున్నారు. అయినా ఏమాత్రం వెరవని యువనేత ప్రజాగళాన్నే తమ గొంతుకగా చేసుకుని మరింత గట్టిగా వైసిపి ప్రభుత్వ అరాచకాలు, సమస్యలను ఎండగడుతున్నారు. తమ తాజాగా పీలేరు నియోజకవర్గం కలికిరిలో అనుమతిలేకుండా బాణాసంచా కాల్చారని కూడా కేసు నమోదుచేయడం కక్షసాధింపు ధోరణికి పరాకాష్ట. జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసిపి ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఉక్కు సంకల్పంతో యువనేత లోకేష్ లక్ష్యం దిశగా ముందుకు సాగుతున్నారు. పాదయాత్రలో దారిపొడవునా మహిళలు, యువతీయువకులు, రైతులు, వివిధ సామాజికవర్గాల ప్రతినిధులు యువనేతను కలిసి సమస్యలను విన్నవిస్తూ సంఘీభావం తెలియజేస్తున్నారు. దారిపొడవునా జనం నీరాజనాలు పడుతూ యువనేతను ఆశీర్వదిస్తున్నారు. పాదయాత్రపై నిఘా కోసం వందలాది పోలీసులను మొహరిస్తున్న ప్రభుత్వం పాదయాత్ర దారిలో ట్రాఫిక్ ఆటంకాలను అధిగమించేందుకు ఎక్కడా ఒక్క కానిస్టేబుల్ ను కూడా నియమించలేదు. అయితే పాదయాత్ర ప్రారంభం నుంచి యువగళం వాలంటీర్లు క్రమశిక్షణతో ముందుకుసాగుతూ పాదయాత్ర సజావుగా సాగేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రాత్రివేళల్లో సైతం లోకేష్ బసచేసే వాహనం వద్ద కాపలా ఉంటూ యువనేతను కంటికిరెప్పలా కాపాడుకుంటున్నారు. మార్గమధ్యంలో పోలీసులు, కొందరు వైసిపి నేతలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నా ఎక్కడా సంయమనం కోల్పోకుండా క్రమశిక్షణతో యువగళం పాదయాత్ర ముందుకు సాగుతోంది. వైసిపి ప్రభుత్వంలో బాధితులైన వివిధ వర్గాల ప్రజలకు నేనున్నానన్న భరోసా ఇస్తూ యువనేత ముందుకు సాగుతున్నారు.
39వరోజు ఉత్సాహంగా సాగిన పాదయాత్ర!
యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 39వరోజు (గురువారం) మదనపల్లి నియోజకవర్గంలో ఉత్సాహంగా సాగింది. పూలవాండ్లపల్లి క్యాంప్ సైట్ నుంచి పాదయాత్రకు అడుగడుగునా జనం నీరాజనాలు పట్టారు. మార్గమధ్యంలో పాలఏకిరి, బోయ సామాజికవర్గాల ప్రతినిధులు యువనేతను కలిసి తమ సమస్యలను విన్నవించారు. మదనపల్లి రూరల్ చిన తిప్పసముద్రం వద్ద యువనేత పాదయాత్ర 500 కిలోమీటర్లు చేరుకోగానే పార్టీనేతలు, అభిమానులు, కార్యకర్తలు యువనేతను కలిసి అభినందనలతో ముంచెత్తారు. యువకులు ఆనందంతో కేరింతలు కొట్టారు. పూలవర్షం కురిపించి బాణాసంచా మోతలతో హోరెత్తించారు. కొత్తవారిపల్లి వద్ద స్థానికులు యువనేతకు ఘనస్వాగతం పలుకగా, కొద్దిసేపు వారితో ముచ్చటించారు. ఎనుమువారిపల్లి భోజన విరామ ప్రాంతంలో చేనేతలు, ముస్లింలతో సమావేశమమై వారి సమస్యలు తెలుసుకున్నారు. తురకపల్లి వద్ద యువనేతకు అపూర్వ స్వాగతం లభించింది. వెంకటప్ప కొండ వద్ద టిడ్కో గృహాల సముదాయం వద్ద లబ్ధిదారులు యువనేతను కలిసి తమ సమస్యలను విన్నవించారు.
మాటలు కోటలు సరే.. మెడికల్ కాలేజ్ నిర్మాణం ఎప్పుడు జగన్ రెడ్డి?
మదనపల్లి రూరల్ ఆరోగ్యవరంలోని మెడికల్ కాలేజి నిర్మాణ ప్రాంతాన్ని యువనేత లోకేష్ పాదయాత్ర దారిలో పరిశీలించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జగన్ రెడ్డి.. నీ మాటలు కోటలు దాటుతున్నాయి.. పనులు మాత్రం గడప దాటడంలేదు.. పునాది దశ దాటని మదనపల్లె మండలం ఆరోగ్యవరంలోని ఈ మెడికల్ కాలేజ్ పనులే అందుకు నిదర్శనం. 2021 మే 31న నువ్వు వర్చువల్ గా, పాపాల పెద్దిరెడ్డి స్వయంగా వచ్చి పునాది రాయి వేసి 475 కోట్ల రూపాయలతో 30 నెలల్లో పూర్తి చేస్తామని ప్రగల్భాలు పలికారు కదా? ఇప్పటికే 21 నెలలు పూర్తయ్యాయి.. ఎప్పుడు పనులు మొదలు పెడతారు? ఇంకెప్పుడు అడ్మిషన్లు మొదలుపెడతారు? రోగులకు సేవలు అందిస్తారో కాస్త చెప్తారా ప్లీజ్.. లేదంటే నిన్న సవాల్ విసిరిన రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గారూ మీరైనా చెప్పండంటూ యువనేత వ్యాఖ్యానించారు.
నారా లోకేష్ ను ఎదుట సమస్యలు చెప్పుకున్న పేదలు:
నా పొలంలో అక్రమమైనింగ్ చేస్తున్నారు
-యువనేతను కలిసిన బాధితుడు మెహబూబ్ బాషా
పాదయాత్ర సందర్భంగా మదనపల్లి రూరల్ వెంకటప్పకొండ వద్ద అక్రమ మైనింగ్ చేస్తున్న ప్రాంతాన్ని యువనేత నారా లోకేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత భూ యజమాని మెహబూబ్ బాషా యువనేతను కలిసి తమ సమస్యను చెప్పుకున్నాడు. నా రెండెకరాల భూమిలో వైసిపి నేతలు దౌర్జన్యంగా గ్రావెల్ తవ్వేస్తున్నారు నేషనల్ హైవే పనుల కోసం అధికారులు ఇష్టానుసారం గ్రావెల్ తవ్వకాలు చేస్తున్నారు. తనకు జరుగుతున్న అన్యాయాన్ని ఆపమని ఎంఆర్ఓకు విన్నవించాను. ఆ తర్వాత ఆ భూమే నీకు చెందకుండా చేస్తామని వైసిపి నేతలు బెదిరిస్తున్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… వాస్తవాలు పరిశీలించాక నీ తరపున పోరాడతానని చెప్పారు.
విద్యుత్ ఛార్జీలు భారంగా మారాయి
-కొక్కింటి చంద్రం, కుమ్మర వృత్తిదారుడు, చిన్నతిప్పసముద్రం
రోజూ మిషన్ తో కుండలు, పిడతలు తయారు చేస్తాం. టీడీపీ హయాంలో నెలమొత్తం మీద రూ.100 నుండి రూ.110ల విద్యుత్ ఛార్జీలు వచ్చేవి. కానీ ఇప్పుడు రూ.550 నుండి రూ.600 వస్తోంది. ఆదరణ పథకం కింద నాకు చక్రాలు, ఇతర పనిముట్లు వచ్చాయి. కానీ ఇప్పుడు రావడంలేదు. రోజురోజుకూ ఉపాధి తగ్గుతోంది. ఒక్క ఎండాకాలం తప్ప మిగతా సమయంలో పని ఉండటం లేదు. సోలార్ బట్టీలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరుతున్నాం.
భర్త చనిపోయి 7 నెలలైనా ఫింఛన్ రాలేదు
-జి.బాలమ్మ, సీటియం, నేతాజీనగర్
నా భర్త అనారోగ్యంతో ఏడు నెలల క్రితం చనిపోయారు. నాకు వితంతు ఫింఛన్ మంజూరు చేయలేదు. అడిగితే రాశాం..వస్తందని సమాధానం చెప్తున్నారు. కుటుంబ పోషన కష్టంగా మారింది. యువనేత నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా
అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేతలకు జిఎస్టీ రద్దుచేస్తాం! చేనేత వస్త్రాలకు బ్రాండింగ్ క్రియేట్ చేసి మార్కెటింగ్ కల్పిస్తాం చేనేతలుండే ప్రాంతాల్లో కామన్ఫెసిలీటీ సెంటర్లు ఏర్పాటుచేస్తాం చేనేతలతో ముఖాముఖి సమావేశంలో యువనేత నారా లోకేష్
మదనపల్లి: టిడిపి అధికారంలోకి రాగానే చేనేత పై జిఎస్టీ ఎత్తివేస్తాం. అవసరమైతే దానికి అయ్యే సొమ్ముని రాష్ట్ర ప్రభుత్వమే భరించేలా చూస్తామని టిడిపి యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. మదనపల్లి రూరల్ ఎనుమువారిపల్లిలో చేనేత కార్మికులతో యువనేత లోకేష్ ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చేనేత కళాకారులతో కలిసి రాట్నం తిప్పి నూలు వడికారు. లోకేష్ మాట్లాడుతూ… వైసిపి ఎంపీలు చేనేతపై జిఎస్టీ ఎత్తివేయాలని ఎటువంటి పోరాటం చెయ్యడం లేదు. జిఎస్టీ అంశం పై ఎంపి మిథున్ రెడ్డి కనీసం కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాయలేదు. పార్లమెంట్ లో పోరాడలేదు. గెలిపించిన చేనేత కార్మికుల కష్టాలు ఆయనకు పట్టవు. ఆయనకి ఆఫ్రికా లో ఉన్న వ్యాపారాలు మాత్రమే ముఖ్యం.
చేనేత కార్మికులకు ఇళ్లు, వర్కింగ్ షెడ్లు
చేనేత కార్మికులకు గ్రామాల్లో హౌస్ కమ్ వర్కింగ్ షెడ్ పద్దతిలో ఇళ్లు నిర్మించి ఇస్తాం. పట్టణాల్లో అంత ఖాళీ స్థలం ఉండదు కాబట్టి అక్కడ నాణ్యమైన టిడ్కో ఇళ్లు కట్టించి కామన్ వర్కింగ్ షెడ్లు నిర్మించి ఇస్తాం. పవర్ లూమ్ కు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేస్తాం. చేనేత కార్మికులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తాం అని గతంలోనే ప్రకటించాం. దానికి కట్టుబడి ఉన్నాం. మంగళగిరి లో నేను పోటీ చేస్తున్నాను. చేనేత సామాజిక వర్గం నన్ను దత్తత తీసుకోవాలని కోరుతున్నాను. మీ సమస్యల పై పోరాడతాను. టిడిపి గెలిచిన తరువాత సమస్యలు పరిష్కారం చేసే బాధ్యత నాది. మదనపల్లి లో టిడిపి హయాంలో చేనేత కార్మికులకు కామన్ వర్కింగ్ ఫెసిలిటీ ఏర్పాటుకు భూమి కేటాయించి పనులు ప్రారంభించాం. వైసిపి ప్రభుత్వం వచ్చి పనులు ఆపేసింది.
చేనేత కార్మికులకు బీమా, వడ్డీలేని రుణాలిస్తాం
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే బీమా, వడ్డీ లేని రుణాలు ఇస్తాం. నీరుగట్టువారిపల్లె పట్టుచీరలకు ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేస్తాం అని మర్చిపోయింది జగన్. టిడిపి హయాంలో కేంద్రం ప్రభుత్వం సహకారంతో 54 చేనేత క్లస్టర్స్ ఏర్పాటు చేశాం. ఇప్పుడు కేంద్రానికి ఇవ్వాల్సిన వాటా ఇవ్వకుండా క్లస్టర్స్ ఏర్పాటు చెయ్యకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. బిసిల రక్షణ కోసం బిసి రక్షణ చట్టం తీసుకొస్తాం.
చేనేత వస్త్రాలకు బ్రాండ్ క్రియేట్ చేస్తాం
పవర్ లూమ్ వస్త్రాలు, చేనేత వస్త్రాలకు తేడా తెలిసేలా లేబిలింగ్ చెయ్యాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అప్పుడే నేతన్న కష్టానికి తగిన ఫలితం వస్తుంది. చేనేత వస్త్రాలకు ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేస్తాం అని జగన్ మోసం చేశారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేత కు ఒక ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేసి మార్కెట్ లింకేజ్ ద్వారా అధిక ఆదాయం వచ్చేలా చేస్తాం. మంగళగిరిలో టాటా ప్రాజెక్టుతో అనుసంధానం చేసి సొంతగా పైలట్ ప్రాజెక్టు అమలుచేస్తున్నాం. అది సక్సెస్ అయితే మదనపల్లిలో కూడా టాటా ప్రాజెక్టు ద్వారా బ్రాండింగ్ కల్పించడానికి కృషిచేస్తాం. 50 ఏళ్ళు నిండిన చేనేత కార్మికులు 1.11 లక్షల మందికి రూ.2000 చొప్పున పెన్షన్ ఇచ్చింది టిడిపి. రూ.111 కోట్లు చేనేత రుణాలు మాఫీ చేసింది టిడిపి. రంగుల సబ్సిడీ రూ.25 కోట్లు, యార్న్ సబ్సిడీ 40 శాతం, పవర్ లూమ్ కి 50 శాతం సబ్సిడీ కోసం రూ.80 కోట్లు ఖర్చు చేసాం.
వైసిపి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు రద్దుచేసింది!
సమావేశంలో చేనేత కార్మిక సంఘ నాయకులు మాట్లాడుతూ…వైసిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే చేనేత కార్మికులకు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు అన్ని రద్దు చేసింది. చేనేత కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వడం లేదు. చేనేత వస్త్రాలకు, పవర్ లూమ్ వస్త్రాలకు తేడా తెలిసేలా ప్రభుత్వం ద్వారా ప్రత్యేక లేబిలింగ్ చెయ్యాలి. లేబిలింగ్ లేక నేత నేస్తున్న మేము నష్ట పోతున్నాం. చేనేత కార్మికులకు వర్క్ షెడ్ తో కలిసిన ఇళ్ళ స్థలాలు ఇవ్వాలి. చేనేత వస్త్రాలకు జిఎస్టి తొలగించాలి. అప్కో ద్వారా చేనేత వస్త్రాల కొనుగోలు జరగడం లేదు. సిల్క్ రాయితీ పాస్ బుక్ ను వైసిపి ప్రభుత్వం రద్దు చేసింది. దానిని తిరిగి అమలు చెయ్యాలి.చేనేత సామాజిక వర్గానికి మరింతగా రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని కోరారు.
చేనేత సమావేశంలో వ్యక్తమైన అభిప్రాయాలు:
ఆర్.ఆంజనేయులు : ఇప్పుడున్న చేనేత గుర్తింపు కార్డుల్లో భోగస్ కార్డులు ఉన్నాయి. క్యు ఆర్ కోడుతో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేలా చేయాలి.
ఎస్.మురళీ : చేనేత వస్త్రాలు చేసే వాళ్లకు గతంలో సంక్షేమాలు అందేవి. పవర్ లూమ్స్, చేనేత వస్త్రాలకు వేరువేరుగా లేబుల్ వేసి ఇస్తే మంచి వ్యాపారం జరుగుతుంది.
కుర్రా వెంకటరమణ : చేనేతల్లో గృహాలు చాలా మందికి లేవు. మీరు గెలిచాక ప్రతి చేనేత కుటుంబానికి 5 సెంట్ల భూమి ఇస్తే కుటుంబంతో పాటు అక్కడే మగ్గాలు ఏర్పాటు చేసుకుంటారు. 50 ఏళ్లకే కంటి చూపు కోల్పోతున్నారు. వారికి ఫించన్ ఇవ్వాలి. మగ్గం వస్త్రాలపై జీఎస్టీ ఎత్తేయాలి.
ఓ.వీర భాస్కర్ : 2012 నుండి సిల్క్ రాయితీ పాస్ బుక్ లు ఉన్నాయి. వాటిని వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది. మీరొచ్చాక సిల్క్ రాయితీ పాస్ పుస్తకాలు మంజూరు చేయాలి.
ఎమ్.నాగరాజు : ఏపీలో దాదాపు 12 అసెంబ్లీ నియోజకవర్గార్లో చేనేతలు మెజార్టీ టీడీపీకి ఉన్నారు. మాకు కూడా చట్టసభలో 6 స్థానాలు కేటాయిస్తే..మా సమస్యలు లేవనెత్తుతాం. చేనేత వర్గాలకు నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలి.
వెంకటసుబ్బయ్య : చేనేతలను ఆరోగ్య సమస్య వెంటాడుతోంది. గతంలో నాబార్డు ద్వారా చేనేతలకు కార్డు ఉండేది. కానీ ఇప్పుడు ఆ కార్డు లేదు. ఇప్పుడు ఐసీఐసీఐ కార్డులు ఇస్తున్నారు..కానీ అవి ఆసుపత్రుల్లో పని చేయడంలేదు.
బండి నాగరాజు : చేనేతలకు 50 ఏళ్లు నిండిన వారికి పెన్షన్ ఇవ్వాలి. చనిపోతే శవాలు పెట్టుకోవడానికి శ్మశానం లేదు. మీరు వచ్చాక శ్మశానానికి భూమి కేటాయించాలి.
ప్రభాకర్ : చేనేత కార్మికులకు ఇచ్చే పథకాలన్నీ సీఎం జగన్ రద్దు చేశారు. జీఎస్టీ కట్టేవాళ్లకే చేయూత ఇస్తున్నారు. సొంత మగ్గం ఉన్నవాళ్లకే చేయూత అంటున్నారు. చేనేత కార్మికులకు చేయూత ఇవ్వడం లేదు..
మిథున్ సాయి : దనీలు దగ్గరకు పనికోసం కూలీలు వెళ్తారు. వాళ్లకు కూలీ సరిగా రావడం లేదు. కాబట్టి కూలీలకు క్యూఆర్ కోడ్ తో కార్డులు ఇస్తే మంచిది.
బి.వెంకటేశ్వర్లు, నీరుగట్టుపల్లి : మగ్గాలున్నవారికి మా గ్రామంలోనే ఇంటి పన్నులు వసూలు చేస్తున్నారు. సబ్సీడీలు ఇంకా పెంచాలి. చేనేతకు అవసరమైనవి ఏవి కొన్నా జీఎస్టీ పడుతోంది. వాటిపై జీఎస్టీ రద్దు చేయాలి.
నీలకంఠం : టీడీపీ హయాంలో నీరుగట్టుపల్లిలో చాలా మందికి పెన్షన్లు ఇచ్చాం. కానీ ఆ పెన్షన్లు నిలిపేశారు. మదనపల్లి మగ్గాల వారికి గుర్తింపులేదు. మాకు బ్రాండ్ లేదు.
ముస్లిం మైనారిటీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం! ప్రభుత్వం పట్టించుకోకపోతే మేమే లాయర్లను పెట్టి పోరాడుతున్నాం ఇస్లామిక్ బ్యాంక్ ద్వారా పేద ముస్లింలకు వడ్డీలేని రుణాలిస్తాం ఇండస్ట్రియల్ క్లస్టర్లలో ముస్లింలకు భూములు కేటాయిస్తాం ఎనుమువారిపల్లిలో ముస్లింలతో యువనేత నారా లోకేష్
మదనపల్లి: ముస్లీం రిజర్వేషన్ల కోసం టిడిపి కట్టుబడి ఉంది. వైసిపి ప్రభుత్వం కనీసం కోర్టు లో వాదన వినిపించడానికి కూడా ముందుకు రాలేదు. టిడిపి మాత్రమే సొంత డబ్బు తో మైనార్టీల రిజర్వేషన్ల కోసం పోరాడుతోందని టిడిపి యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. ఎనుమువారిపల్లి భోజన విరామ స్థలంలో మైనార్టీలతో లోకేష్ ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా యువనేత మాట్లాడుతూ… దేశంలోనే మొదటి మైనార్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది టిడిపి. టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే ముస్లీంలకి ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తాం. పేద ముస్లింలకు వడ్డీ లేని రుణాలు అందిస్తాం. ముస్లిం జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఉర్దూ ఇంటర్, డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేస్తాం. వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడటానికి బోర్డు కి జ్యుడిషియల్ పవర్ కల్పిస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మైనార్టీల్లో పేదరికం లేకుండా స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. ప్రతి నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఏర్పాటు చేసి ముస్లీం లకి ప్రత్యేకంగా భూములు కేటాయించి పారిశ్రామికవేత్తలు గా మారుస్తాం.
మైనారిటీ ఆస్తులు కబ్జాచేస్తుంటే ఎందుకు మాట్లాడటం లేదు?
జగన్ ప్రభుత్వం వడ్డీలేని రుణాలు ఇవ్వడం లేదు. వక్ఫ్ బోర్డు ఆస్తులను వైసిపి నాయకులు కబ్జా చేస్తున్నారు. ఉర్దూ ఇంటర్, డిగ్రీ కాలేజీ లు ఏర్పాటు చేయాలి. మసీదు, ఈద్గా అభివృద్ది కి వైసిపి ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వడం లేదు. రంజాన్ తోఫా, విదేశీ విద్య పథకాలను ఆపేసారు. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ఉన్నారు. మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా ఉన్నారు. కానీ ముస్లీం ల సమస్యలు వారికి పట్టవు. వక్ఫ్ ఆస్తులను వైసిపి నేతలు కబ్జా చేస్తుంటే వైసిపి మైనార్టీ ప్రజాప్రతినిధులు కనీసం ప్రశ్నించడం లేదు.
టిడిపి హయాంలోనే ముస్లిం సంక్షేమ పథకాలు
రంజాన్ తోఫా ఇచ్చింది, దుల్హన్ పథకం, విదేశీ విద్య, మస్జిద్, ఈద్గా అభివృద్ది కి నిధులు ఇచ్చింది టిడిపి. షాదీఖానాలు అభివృద్ది చేసింది టిడిపి. ఖబర్ స్థాన్ లు అభివృద్ది చేసింది టిడిపి. ఇమామ్, మోజమ్ల కు గౌరవ వేతనం ఇచ్చింది టిడిపి. ఉర్దూ టీచర్ పోస్టులు భర్తీ చేసింది. ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు, ముస్లీం మహిళలకు ప్రత్యేక మధర్సాలు ఏర్పాటు చేసింది టిడిపి. జగన్ ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తానని మైనార్టీలను మోసం చేసారు. మైనార్టీలను ఆర్థికంగానూ, రాజకీయంగానూ ఆదుకుంది టిడిపి మాత్రమే.
జైహింద్ అన్న యువకుడు… లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు
సభలో ప్రశ్న అడిగి జై హింద్ అన్న ముస్లీం యువకుడి తో మాట్లాడుతూ లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మైనార్టీ ల సభలో జై హింద్ అన్నానని వైసిపి వాళ్ళు నన్ను ట్రోల్ చేస్తున్నారు. వైసిపి వాళ్ళు మైనార్టీలను కించపరిచేలా పోస్టులు పెడుతున్నారు. దేశంలో పుట్టి, దేశ అభివృద్ది లో భాగస్వామ్యం అయిన మైనార్టీలు జై హింద్ అంటే తప్పేంటి. దేశం తరువాతే ఏదైనా. దేశ భక్తి ని కూడా తప్పు బట్టే నీచమైన వాళ్ళు వైసిపి వాళ్ళు. బిజెపి తో రెండున్నర ఏళ్ళు పొత్తు లో ఉన్నా ఏనాడూ మైనార్టీ ల పై టిడిపి హయాంలో దాడులు జరగలేదు. మీ నిధులు పక్కదారి పట్టించలేదు.
యువనేతను కలిసిన బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ప్రతినిధులు
మదనపల్లి నియోజకవర్గం పూలవాండ్లపల్లి క్యాంప్ సైట్ లో చిత్తూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ప్రతినిధులు యువనేత నారా లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. టిడిపి ప్రభుత్వ హయాంలో రూ.60కోట్ల మూలధనంతో బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటుచేశారు. అప్పట్లో భారతీ విద్యాపథకం, వశిష్టా పోటీ పరీక్షల పథకం, భారతి విదేశీ మాస్టర్స్ డిగ్రీ పథకం, చాణుక్య ఔత్సాహిక పారిశ్రామికవేత్తల పథకం, గరుడ అంత్యక్రియల పథకం వంటివి అమలుచేసి మాకు అండగా నిలిచారు. గత ప్రభుత్వంలో బ్రాహ్మణ కార్పొరేషన్ కు రూ.365 కోట్లు మంజూరు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం గత పథకాలన్నింటినీ రద్దుచేసి కొన్నింటిని కొత్తపథకాల్లో కలిపేసింది. గతంలో 60సంవత్సరాలు దాటిన భార్యాభర్తలకు కూడా పెన్షన్ ఇచ్చేవారు. ఇప్పుడు ఒకరికి మాత్రమే ఇస్తున్నారు. విదేశీ విద్యకు సంబంధించి గత ప్రభుత్వంలో ఉన్న లబ్ధిదారుల సంఖ్య 10శాతానికి లోపు పడిపోయింది. ప్రస్తుతం పేద బ్రాహ్మణులు చనిపోతే రూ.10వేల అంత్యక్రియల ఖర్చులు కూడా ఇవ్వడం లేదు. బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్యలను సానుభూతితో పరిశీలించి ఆదుకోండి.
నారా లోకేష్ మాట్లాడుతూ…
గత టిడిపి ప్రభుత్వంలో బ్రాహ్మణ కార్పొరేషన్ కు భారీగా నిధులు కేటాయించడమేగాక పేద బ్రాహ్మణులకు అండగా ఉండటానికి అనేక పథకాలను ప్రవేశపెట్టాం. జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చాక అన్నింటినీ రద్దుచేస్తూ రద్దుల ముఖ్యమంత్రిగా పేరుతెచ్చుకున్నారు. పేద బ్రాహ్మణుల సమస్యలపై అవగాహన ఉంది. TDP అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని విధాలా ఆదుకుంటాం. చంద్రన్నను ముఖ్యమంత్రి చేసేందుకు మీవంతు సహాయ,సహకారాలు అందించండి.
నారా లోకేష్ ను కలిసిన రాష్ట్ర వాల్మీకి సంఘ ప్రతినిధులు
మదనపల్లి నియోజకవర్గం పూలవాండ్లపల్లిలో రాష్ట్ర వాల్మీకి సంఘ ప్రతినిధులు యువనేత Nara Lokesh ను కలిసి సమస్యలు విన్నవించారు. వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్చాలి. వాల్మీకి జయంతి రోజును సెలవుదినంగా ప్రకటించాలి. వాల్మీకి మహర్షి చరిత్రను పాఠ్యాంశాలుగా చేర్చాలి. వాల్మీకి కార్పొరేషన్ ద్వారా ప్రతిఏటా రూ.10వేల కోట్లు కేటాయించాలి. ఉద్యోగపరంగా రాష్ట్రప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలి. కులవృత్తిలేని వాల్మీకి జాతి యువతకు పక్కరాష్ట్రాలకు వలస వెళ్లకుండా స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేయాలి. జనాభా దామాషా ప్రకారం ఎంపి, ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలి. ప్రతి నియోజకవర్గంలో వాల్మీకి భవనాల నిర్మాణానికి రూ.5కోట్లు మంజూరు చేయాలి.
*నారా లోకేష్ మాట్లాడుతూ….*
వాల్మీకి, బోయలకు రాజకీయంగా పెద్దపీట వేసింది తెలుగుదేశం పార్టీనే. ఈ సామాజికవర్గానికి చెందిన కాల్వ శ్రీనివాసులుకు మంత్రి, ఎంపిగా అవకాశం కల్పించాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బిసి కులాల వారందరినీ మోసగించాడు. 2016లో ఆంధ్రప్రదేశ్‌లో వాల్మీకీ/ బోయల స్థితిగతులపై సమగ్ర అధ్యయనం చేసేందుకు ప్రొఫెసర్ సత్యపాల్ ఆధ్వర్యంలో కమిటీ వేశాం. ఈ కమిటీ నివేదిక ప్రకారం 15 డిసెంబర్ 2017 న భారత ప్రభుత్వానికి బోయలను ఎస్టీలో చేర్చాలని గతంలో కేంద్రానికి లేఖ కూడా రాశాం. టిడిపి అధికారంలోకి వచ్చాక సత్యపాల్ కమిటీ నివేదికను అధ్యయనం చేసి వాల్మీకి/బోయ సోదరులకు న్యాయం చేస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వాల్మీకిల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషిచేస్తాం.
పాదయాత్ర దారిలో లోకేష్ ను కలిసిన పాలఏకరి సంఘం ప్రతినిధులు
అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లి మండలం రెడ్డివారిపల్లి పంచాయితీ ఎనుగొండపల్లిలో ఉండే పాలెగారికోట సుమారు 200 సంవత్సరాల క్రితం 20 అడుగుల ప్రహరీగోడతో నిర్మించారు. ఈ పురాతన కోటను రెండునెలల క్రితం వైసిపినేతల దొంగపట్టాలు సృష్టించి కబ్జాచేశారు. పోలీసు, రెవిన్యూ అండదండలతో చారత్రాత్మకమైన కోటగోడలను కూల్చేశారు. ఈవిధంగా సర్వేనెం.1197లో 3.34 ఎకరాలను వైసిపి నేతలు ఆక్రమించారు. ఈ స్థలం విలువ ప్రస్తు మార్కెట్ రేటు ప్రకారం రూ.10కోట్ల పైనే ఉంది. పురాతనమైన ఈ కట్టడాన్ని పరిరక్షించేందుకు చర్యలు తీసుకోండి. రాష్ట్రంలో ముఖ్యంగా రాయలసీమలో 10లక్షల జనాభా ఉన్న మా కులస్తులు ఎటువంటి ఉపాధి మార్గాలు లేక కొండ ప్రాంతాల్లో జీవనం సాగిస్తున్నాం. వైసిపి ప్రభుత్వం పాల ఏకిరి కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసింది కానీ ఎటువంటి నిధులు కేటాయించలేదు. నిరక్షరాస్యత కారణంగా వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్నాం.
*నారా లోకేష్ మాట్లాడుతూ…*
రాయలసీమ అధికంగా ఉన్న పాల ఏకిరి విద్యార్ధుల కోసం ప్రత్యేక హాస్టల్ సౌకర్యం కల్పించే అంశాన్ని పరిశీలిస్తాం. వ్యవసాయ కూలీలుగా జీవిస్తున్న పాలఏకరిలకు చిరువ్యాపారాలు చేసుకోవడానికి బ్యాంకు రుణాలు ఇప్పించి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. పాల ఏకరిలకు రేషన్ కార్డులు మంజూరు చేసి అన్నీ సంక్షేమ పథకాలు అందేలా చూస్తాం.
లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించిన చిన తిప్ససముద్రం రైతులు
మదనపల్లి రూరల్ మండలం కొత్తవారిపల్లి, చిన తిప్పసముద్రం రైతులు యువనేత నారా లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. చిన తిప్పసముద్రంలో పెద్దచెరువు సుమారు 500 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ చెరువు కింద వెయ్యి ఎకరాల ఆయకట్టు భూమి ఉంది. ఈ చెరువును హంద్రీనీవాకు అనుసంధానం చేస్తే ఏడాదికి రెండు పంటలు పండించుకునే అవకాశం లభిస్తుంది. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ చెరువును హంద్రీనీవాకు అనుసంధానం చేసి మమ్మల్ని ఆదుకోండి.
*నారా లోకేష్ మాట్లాడుతూ…*
వైసిపికి దాచుకోవడం, దోచుకోవడంపై ఉన్న శ్రద్ధ రాయలసీమలో ప్రాజెక్టులపై లేదు. రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టుల కోసం టిడిపి ప్రభుత్వ హయాంలో రూ.13వేల కోట్లరూపాయలు ఖర్చుచేస్తే, వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేవలం వెయ్యికోట్లు మాత్రమే ఖర్చుచేసింది. హంద్రీనీవాకు సంబంధించి గత ప్రభుత్వంలో 80శాతం పనులు పూర్తిచేయగా, మిగిలిన 20శాతం పూర్తిచేయడం ఈ చేతగాని సిఎం వల్లకాలేదు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే హంద్రీనీవా పనులు పూర్తిచేస్తాం. రైతులు కోరిన విధంగా చిన తిప్పసముద్రం చెరువును హంద్రీనీవాకు అనుసంధానం చేస్తాం.
యువనేతను కలిసిన బెస్త, మత్స్యకార సేవాసంఘం ప్రతినిధులు
పాదయాత్ర దారిలో బెస్త, మత్స్యకార సేవాసంఘం ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. సాంప్రదాయ మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేర్చాలి. నదులు, చెరువులు, కుంటలపై పూర్తిహక్కు సాంప్రదాయ మత్స్యకారులకే కల్పించాలి. మత్స్యకార భరోసాను రాయలసీమలోని మత్స్యకారులకు కూడా వర్తింపజేయాలి. చేపలవేట చేసే ప్రతి సాంప్రదాయ మత్స్యకారునికి వేట లైసెన్సు ఇచ్చి అవకాశం ఉన్నచోట సొ,సైటీ సభ్యత్వం కల్పించాలి. మత్స్యసంపదను నిల్వచేసుకోవడానికి ఐస్ బాక్సులు, ఎలక్ట్రానిక్ బైకులు 90శాతం సబ్సిడీపై ఇవ్వాలి. సొసైటీల్లో బెస్తవారికి మాత్రమే స్థానం కల్పించాలి, ఇతరులను చేర్చకూడదు. ఇరిగేషన్ చెరువులు, పంచాయితీ చెరువులు సొసైటీలకే కేటాయించాలి. రాయలసీమలో ఎంపి లేదా ఎమ్మెల్యేస్థానాన్ని కేటాయించాలని కోరారు.
*నారా లోకేష్ మాట్లాడుతూ…*
మత్స్యకారుల పొట్టగొట్టేలా వైసిపి ప్రభుత్వం జి.ఓ 217ను తీసుకువచ్చింది. టిడిపి ప్రభుత్వ హయాంలో వేట నిషేధ సమయంలో ఆర్థికసాయం, డీజిల్ సబ్సిడీ ఇచ్చి ఆదుకున్నాం. మత్స్యకారుల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. ఇప్పటికే కోస్తాలో మాజీమంత్రి కొల్లు రవీంద్ర, వనమాడి కొండబాబు వంటివారికి అవకాశాలు కల్పించాం. రాయలసీమలో కూడా రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే అంశం పరిశీలిస్తాం. చంద్రబాబునాయుడును తిరిగి ముఖ్యమంత్రి చేసేందుకు మీ వంతు సహకారం అందించండి.
లోకేష్ ను కలిసిన టిడ్కో గృహాల లబ్ధిదారులు, సిపిఐ ప్రతినిధులు
మదనపల్లి రూరల్ వెంకటప్పకొండలో టిడ్కో గృహాల సముదాయం వద్ద టిడ్కో గృహాల లబ్ధిదారులు, సిపిఐ ప్రతినిధులు యువనేత నారా లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. పేదలు కూడా విలాసవంతమైన ఇళ్లలో నిర్మించాలన్న లక్ష్యంతో టిడిపి ప్రభుత్వం 2018లో వెంకటప్పకొండ వద్ద 3,773 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇందులో 365, 300 చదరపు అడుగులతో 1872 ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టారు. టిడ్కో గృహాల సముదాయంలో అన్ని సౌకర్యాలతో కూడిన కామన్ ఫెసిలిటీ సెంటర్, వైద్యశాల, స్కూలు పిల్లలు ఆడుకోవడానికి అన్ని సౌకర్యాలతో పార్కు, అంగన్ వాడీ కేంద్రం వంటివాటిని అప్పట్లో ప్రతిపాదించారు. వైసిపి ప్రభుత్వం వచ్చాక రివర్స్ టెండరింగ్ పేరుతో ఎక్కడి పనులు అక్కడే నిలిపివేశారు. గత ప్రభుత్వంలో 80శాతం పూర్తయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గత 45నెలలుగా పూర్తిచేసి ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు. ఫలితంగా బయట అద్దెలు చెల్లించుకోలేక నానా అగచాట్లు పడుతున్నాం. సిపిఐ ఆందోళనతో పెద్దఎత్తున పోరాటంచేశాక టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు అందజేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటివరకు పట్టించుకోలేదు. ఇళ్లు రద్దుచేసిన వారికి డిపాజిట్లు కూడా ఇప్పటివరకు వెనక్కి ఇవ్వలేదు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేసి మాకు అందించే ఏర్పాటుచేయండి.
*నారా లోకేష్ మాట్లాడుతూ….*
పేదలు కూడా విలాసవంతమైన ఇళ్లలో నివసించాలన్న ఉద్దేశంతో టిడిపి హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 166 ప్రాంతాల్లో 3.13 లక్షల టడ్కో గృహాల నిర్మాణాన్ని చేపట్టాం. అత్యాధునిక షేర్ వాల్ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణం చేపట్టి సెక్రటేరియల్ వేసిన అందమైన టైల్స్ ఈ గృహాల నిర్మాణాల్లో వినియోగించాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తాము నిర్మాణాలను ప్రారంభించిన వాటిలో 51వేల ఇళ్లను వివిధ సాకులు చూపి రద్దుచేసింది. మిగిలిన 2.62 లక్షల ఇళ్లను పూర్తిచేసి ఇస్తామని చెప్పి 45నెలలైనా ఎటువంటి పనులు చేపట్టకుండా పాడుబెడుతున్నారు. సిగ్గులేకుండా మేం నిర్మించిన ఇళ్లకు వైసిపి రంగులు మాత్రం వేసుకున్నారు. టిడిపి ప్రభుత్వ హయాంలో చేపట్టిన టిడ్కో ఇళ్లలో 2లక్షల ఇళ్లనిర్మాణం దాదాపు పూర్తయిందని, మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయని కేంద్రప్రభుత్వమే పార్లమెంటు సాక్షిగా చెప్పింది. పాపపు సొమ్ముతో ఊరికో ప్యాలెస్ కట్టుకున్న జగన్మోహన్ రెడ్డికి పేదప్రజలు గూడు కష్టాలు పట్టకపోవడం విచారకరం. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అసంపూర్తిగా నిలచిపోయిన టిడ్కో ఇళ్లంటినీ పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేస్తాం.
Also read this blog: Nara Lokesh Yuvagalam Padayatra, Reaches Out to Youth in Andhra Pradesh
Tagged:#LokeshPadaYatra #Padayatra #YuvaGalamLokesh #YuvaGalam #NaraLokeshPadaYatra #NaraLokesh