TDP

పుంగనూరు నియోజకవర్గంలో ప్రవేశించిన యువగళం పాదయాత్ర బాణాసంచా కాల్పులు, కేరింతల నడుమ యువనేతకు ఘనస్వాగతం

చంద్రగిరి: చంద్రగిరి నియోజకవర్గంలో 5రోజులపాటు సుదీర్ఘంగా సాగిన యువగళం పాదయాత్ర 32వరోజు (గురువారం) సాయంత్రం పుంగనూరు నియోజకవర్గంలో ప్రవేశించింది. పులిచర్ల మండలం రాయవారిపల్లి వద్ద అభిమానుల కేరింతలు, బాణాసంచా కాల్పుల నడుమ యువనేతకు ఘనస్వాగతం పలికారు. పుంగనూరు నియోజకవర్గ ప్రజలు యువనేతపై పూలవర్షం కురిపించారు. 32వరోజు పాదయాత్రలో చంద్రగిరి నియోజకవర్గం బందార్లపల్లె గ్రామంలో స్థానికులు Nara Lokesh ను కలిశారు.  రోడ్డు పై గుంతలు కారణంగా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.  గుంతలు కూడా పూడ్చలేని ప్రభుత్వం రాష్ట్రంలో రాజ్యమేలుతోంది. రోడ్లు వెయ్యడం, అభివృద్ది చెయ్యడం వైసీపీకి చేతకాదు. టిడిపి ప్రభుత్వం వచ్చిన తరువాత రోడ్డు వేస్తామని భరోసా ఇచ్చి ముందుకు సాగారు. ఊటువంక గ్రామం వద్ద స్థానికులతో యువనేత పూలమాలలతో సత్కరించారు. కుక్కులపల్లి, దామలచెరువు గ్రామాల వద్ద యువనేతను గజమాలతో సత్కరించి భారీఎత్తున స్వాగతం పలికారు. దామలచెరువు గ్రామంలో ముస్లింలతో సమావేశమై వారి సాదకబాధలు విన్నారు. కొండేపల్లి క్రాస్ వద్ద రైతులతో యువనేత ముఖాముఖి సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. తోటతిమ్మయ్యగారిపల్లి, మొగరాల గ్రామాల్లో యువనేతకు అడుగడుగునా హారతులిచ్చి నీరాజనాలు పలికారు. చంద్రగిరివారిపల్లి రౌనక్ నగర్ వద్ద మైనారిటీలు యువనేతకు సంఘీభావం తెలిపారు. రమణయ్యగారిపల్లె వాసులు యువనేతను ఘనంగా స్వాగతించారు.

10ఎకరాల చెరకుపంట వేస్తే రూ.5లక్షల నష్టం వచ్చింది!

కూనపల్లి వద్ద మునీంద్ర అనే చెరకు రైతును యువనేత పలకరించి ఆయన కష్టాలను తెలుసుకున్నారు. తాను 10ఎకరాల చెరకు సాగుచేశానని, గిట్టుబాటు ధర లేక సంవత్సరానికి 5లక్షలు నష్టపోతున్నానని వాపోయాడు. నల్లబెల్లానికిగిట్టుబాటు ధరలేక నష్టపోతున్నామని తెలిపాడు. 9వేలుపెట్టి మిరపనారు వేస్తే పూతవచ్చే సమయానికి ఎండిపోయిందని, దీంతో 30వేలు నష్టపోయాయని తెలిపారు. కల్తీ విత్తనాలు, ఎరువులు, పురుగుమందులతో నష్టపోతున్నానని, అధికారంలోకి వచ్చాక మా సమస్యలు పరిష్కరించాలని కోరాడు.

యువనేతను కలిసిన ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు

చంద్రగిరి నియోజకవర్గం గుమ్మడివారి ఇండ్లు క్యాంప్ సైట్ లో యువనేత లోకేష్ ను యుటిఎఫ్, నోబుల్ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కలిసి సమసస్యలను విన్నవించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… సిపిఎస్ రద్దు విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాటతప్పి మడమతిప్పారు. ప్రాథమిక విద్య రెండేళ్లకు, మాధ్యమిక విద్య మూడేళ్లకు కుదించారు. దీనివల్ల విద్యాప్రమాణాలు దెబ్బతినే ప్రమాదం నెలకొంది. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీచర్ ఇప్పటివరకు డిఎస్సీ నిర్వహించకపోగా, ఒక కిలోమీటరు లోపు పాఠశాలలను విలీనం చేశారు. 10మంది విద్యార్థులకన్నా తక్కువ ఉన్న 1500 పాఠశాలలను నేడో, రేపో మూసివేయాలని ప్రయత్నిస్తున్నారు. దీనివల్ల  మారుమూల ప్రాంతాల్లోని పేదవిద్యార్థులకు విద్యకు దూరమయ్యే ప్రమాదముంది. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు  పిఎఫ్, ఎపిజిఎల్ఐ జమకావడం లేదు. లోన్లు, ఫైనల్ పేమెంట్లు సకాలంలో చెల్లించడం లేదు. సిపిఎస్ 10శాతం షేర్ ప్రభుత్వం నుంచి జమకావడం లేదు. 2022 పిఆర్ సి బకాయిలు, డిఎలు ఇంతవరరకు చెల్లించలేదు. ఎఎఎస్ ఇంక్రిమెంట్లు, ఆలవెన్స్ లు, సరెండర్ లీవ్స్ విషయంలో అనధికార కోతలు విధిస్తున్నారు. యాప్ ల పేరుతో బోధనా సమయం దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారు. అన్యాయాలను ప్రశ్నిస్తున్న ఉపాధ్యాయ సంఘాల నాయకులను కేసులతో బెదిరిస్తున్నారు. ప్రభుత్వ వేధింపులు, అన్యాయాలపై పోరాడుతున్న మాకు అండగా నిలవండి. నాడు-నేడు పనుల నుంచి ప్రధానోపాధ్యాయులను తప్పించి పనివత్తిడి భారాన్ని తగ్గించాలి. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వంలో కల్పించిన ఆర్థిక ప్రయోజనాలు కల్పించాలని కోరారు.

నారా లోకేష్ స్పందిస్తూ…

రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో సైకో ప్రభుత్వం ఉపాధ్యాయులను వేధించడమే పనిగా పెట్టుకుంది. డిమాండ్ల సాధనకోసం పోరాడిన ఉపాధ్యాయులు, ఉద్యోగులపై కేసులు బనాయించడం నియంతృత్వ పోకడలకు నిదర్శనం. భావిభారత పౌరులను తయారుచేసే గురువులను దొంగలు చిత్రీకరిస్తూ తప్పుడు కేసులు బనాయించడం జగన్మోహన్ రెడ్డి నీచత్వానికి నిదర్శనం. చరిత్రలో మద్యం షాపులవద్ద టీచర్లను కాపలాపెట్టిన పనికిమాలిన ప్రభుత్వాన్ని గతంలో ఎన్నడూ చూడలేదు. న్యాయమైన హక్కుల కోసం ఉపాధ్యాయులు చేసే పోరాటానికి తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుంది. టిడిపి అధికారంలోకి వచ్చాక ఉపాధ్యాయులపై అనవసర వేధింపులు, కక్షసాధింపు చర్యలు ఉండవు. ఉపాధ్యాయులపై వైసీపీ

ప్రభుత్వం బనాయించిన తప్పుడు కేసులు, సస్పెన్షన్లు ఎత్తివేస్తాం. టీచర్ల సేవలను సమర్థవంతంగా వినియోగించుకొని మెరుగైన విద్యాప్రమాణాలు తీసుకువస్తాం.

పెట్టుబడులు తగ్గించి వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తాం!ప్రత్యేక అజెండాగా వ్యవసాయాన్ని ఉపాధి హామీకి అనుసంధానంపంటనిల్వలకు కోల్డ్ స్టోరేజిలను అందుబాటులోకి తెస్తాండికెటి భూములపై భూ యజమానులకే హక్కులుండేలా చట్టంరైతులతో ముఖాముఖి సమావేశంలో టిడిపి యువనేత లోకేష్

చంద్రగిరి: చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వ్యవసాయ పెట్టుబడులను తగ్గించి లాభసాటిగా మారుస్తాం… వ్యవసాయాన్ని ఉపాధిహామీకి అనుసంధానం చేసే అంశాన్ని ప్రత్యేక అజెండాగా తెస్తామని తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు.  చంద్రగిరి నియోజకవర్గం కొండేపల్లి క్రాస్ వద్ద రైతులతో యువనేత నారా లోకేష్ ముఖాముఖి సమావేశమయ్యారు.  ఈ సందర్భంగా యువనేత మాట్లాడుతూ… రైతురాజ్యం తెస్తానని ఓట్లువేయించుకున్న వైసీపీ

అధికారంలోకి వచ్చాక రైతు లేని రాజ్యాన్ని తీసుకొచ్చాడు. ఎరువులు, పురుగుమందుల ధరలను విపరీతంగా పెంచడంతో పెట్టుబడులు పెరిగి అన్నదాతలు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. రైతాంగం మెడకు ఉరితాడు బిగించడానికి  ప్రభుత్వం  మోటార్లకు మీటర్లు బిగిస్తోంది. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెడతామని వస్తే ఒప్పుకోవద్దు..మేం మీకు అండగా ఉంటాం. వైసీపీ పాలనలో కొండలు, గుట్టలు, చెరువులు అన్నింటినీ వైసీపీ పాలకులు కబ్జా చేస్తున్నారు. డీకేటీ భూములపై యజమానులకే హక్కు ఉండేలా చట్టం తెస్తాం.

రైతు సంక్షేమాన్ని గాలికొదిలేసిన మంత్రులు

రాయలసీమలోని చెరకు ఫ్యాక్టరీలను 4 నుండి 6కు పెంచుతామని అన్నారు. కానీ నేడు ఒక్క ఫ్యాక్టరీకే పరిమితం చేశాడు. నల్లబెల్లం పేరుతో వైసీపీ సర్కార్ రైతులను చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సమస్యే. చంద్రబాబు సీఎంగా ఉండగా రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఉండేవి కాదు. వ్యవసాయశాఖ మంత్రి కోర్టులో దొంగతనం చేసి సీబీఐ చుట్టూ తిరుగుతున్నాడు. రైతుల సంక్షేమాన్ని గాలికొదిలేశాడు. మాజీమంత్రి అనిల్ కుమార్ 2021నాటికి పోలవరం పూర్తిచేస్తానని బల్లగుద్ది చెప్పి మంత్రిపదవి నుండి పోయాడు. నేడు మంత్రిగా ఉన్న అంబటి రోడ్లపై డ్యాన్సులు వేస్తున్నాడే తప్ప పోలవరాన్ని పట్టించుకోవడం లేదు. ముఖ్యమంత్రి కనీసం పోలవరాన్ని పట్టించుకోవడం లేదు.

వైసిపి భూకబ్జాలపై విచారణ చేపడతాం!

భూకబ్జాలు అనేవి వైసిపి నాయకుల బ్రాండ్. చెరువు, కొండలు, గుట్టలను కబ్జాలు చేస్తున్నారు. TDP అధికారంలోకి వచ్చాక పాత రికార్డులను తీసుకుని విచారణ జరిపించి కబ్జా చేసిన వాళ్లపై చర్యలు తీసుకుంటాం. దళితుల చేతుల్లో ఉన్న భూముల సంఖ్య వైసీపీ పాలనలో చాలా తగ్గిపోయాయి. వైసీపీ వాళ్లు దళితుల భూములు లాక్కుంటున్నారు. వారందరికీ టీడీపీ అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తాం. వారి భూములు వారికి ఇప్పిస్తాం. రైతులకు గుర్తింపుకార్డులివ్వడం చాలా చిన్నపని. టెక్నాలజీ ద్వారా ఈ కార్డులు మీ ఫోన్ లో వచ్చేలా చేస్తాం.

రైతులతో ముఖాముఖిలో వ్యక్తమైన అభిప్రాయాలు:

కొండేపూడి రైతు: వ్యవసాయ ఖర్చులు చాలా పెరిగిపోయాయి. వ్యవసాయ పనులను ఉపాధిహామీ పథకానికి అనుసంధానం చేయాలని కోరితే ఎవరూ పట్టించుకోవడం లేదు. మా ప్రాంతంలో డ్రిప్ ఇరిగేషన్ చాలా అవసరం. దాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. విత్తనాలు, మందులు, ఎరువుల్లో కల్తీ జరుగుతోంది. మీరు అధికారంలోకి వచ్చాక ఈ సమస్యల్ని పరిష్కరించాలి.

శ్రీరాములు: ప్రభుత్వం వ్యవసాయానికి సకాలంలో విద్యుత్ కనెక్షన్లు అందించడం లేదు. గత ప్రభుత్వాలు వైర్లు, పోల్స్ సబ్సిడీపై ఇచ్చేవి. ఈ ప్రభుత్వం ఇవ్వడం లేదు. గతంలో రిజిస్ట్రేషన్లు అయిన భూములను కూడా నేడు డీకేటీ భూములు అంటున్నారు. పశువులకు వైద్యం చేయించేందుకు ప్రతిసారి టౌన్ కు తీసుకెళ్లాల్సివస్తోంది. గ్రామాల్లోనే పశువుల ఆసుపత్రులను ఏర్పాటు చేయాలి. ఉచితంగా మందులు, దాణా ఇప్పించాలి.

లోకనాథం: మొగరాల పంచాయతీలో నీటి ఎద్దడి చాలా ఎక్కువ. హంద్రీనీవా నుండి సబ్ ఛానల్ ద్వారా మా చెరువుకు నీరు ఇవ్వగలితే మాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పంటలు వేసే పరిస్థితి ఉండడం లేదు. మా ప్రాంతంలో గతంలో చెరకు వేసేవారు. నేడు నల్లబెల్లం పేరుతో అధికారులు చెరకు రైతులను ఇబ్బందిపెడుతున్నారు.

ఈశ్వరరెడ్డి: మా గ్రామం తిరుమాలపల్లిలో చెరువు ఉంది. ఇటీవల వచ్చిన వరదలకు కట్టతెగిపోయింది. ఆ చెరువును క్రికెట్ స్టేడియం చేయాలని ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. మా భూములను రాజకీయ కక్షలతో కబ్జాచేస్తున్నారు. రైతులకు ప్రత్యేకంగా గుర్తింపుకార్డులు ఇవ్వండి.

చిట్టిబాబునాయుడు: అన్నిరకాల పంటలు పండించి నష్టపోయి చివరకు మామిడి పంట పండిస్తున్నాం. పురుగు మందుల్లో నాణ్యత లేక 5సార్లు మందులు కొట్టించినా పంట దిగుబడి రావడం లేదు. వచ్చిన పంటకు గిట్టుబాటు ధర రాకుండా దళారీ వ్యవస్థ దోచుకుంటోంది. కౌలు వ్యవసాయం చేసే పరిస్థితి కూడా పోయింది. రోడ్లు సరిగాలేక పంట కొనుగోలు చేసేందుకు వ్యాపారులు రావడం లేదు. మీరు అధికారంలోకి వచ్చాక రైతులకు న్యాయం చేయాలి.

రామనాథం: చిత్తూరుజిల్లాలో గతంలో చెరకు, వరి పండించేవారు. కానీ నేడు మామిడి పంట పండిస్తున్నారు. పంటలకు గిట్టుబాటు ధర రాక ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలు చదువుకుని బెంగళూరు, చెన్నై వెళ్లి తమ తల్లిదండ్రులను కూడా తీసుకెళ్లిపోతున్నారు. వ్యవసాయాన్ని వదిలేస్తున్నారు. గతంలో మాదిరి డ్రిప్ ఇరిగేషన్ ను ఏర్పాటుచేయాలి.

టిడిపి అధికారంలోకి వచ్చిన ఏడాదిలో ఇస్లామిక్ బ్యాంక్! కులధృవీకరణ పత్రాల సమస్యకు పరిష్కారం చూపుతాం ముస్లింల సంక్షేమానికి ప్రత్యేక కార్యాచరణ అమలుచేస్తాం ముస్లింలతో టిడిపి యువనేత నారా లోకేష్ ముఖాముఖి

చంద్రగిరి: టిడిపి ప్రభుత్వం వచ్చిన మొదటి ఏడాదిలో ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని టిడిపి యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. చంద్రగిరి నియోజకవర్గం దామల చెరువులో ముస్లింలతో యువనేత లోకేష్ ముఖాముఖి సమావేశమయ్యారు. ప్రారంభంలో ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేసి యువనేతకు సంఘీభావం తెలిపారు. అనంతరం యువనేత లోకేష్ మాట్లాడుతూ… డికేటి పట్టాల సమస్యల పరిష్కారానికి కర్ణాటక తరహా మోడల్ అమలు చేస్తాం. దూదేకుల, నూర్ బాషా కులస్తులకు బిసి సర్టిఫికేట్ ఇవ్వకుండా వైసిపి ప్రభుత్వం వేధిస్తోంది. టిడిపి ప్రభుత్వం వచ్చిన తరువాత ఫోన్ లో ఒక్క బటన్ నొక్కితే బీసీ సర్టిఫికేట్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం. చెవిరెడ్డిని రెండు సార్లు గెలిపించారు. మీ జీవితాల్లో ఏం మార్పు రాలేదు. టిడిపి గెలిస్తే చంద్రగిరి నియోజకవర్గానికి అభివృద్ది ని పరిచయం చేస్తాం. నాలుగు పదవులు ఉన్న చెవిరెడ్డి నియోజకవర్గ ప్రజలకు చీర , స్వీట్ బాక్స్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు.  10 ఏళ్ళు శాసనసభ్యుడుగా ఉన్న వ్యక్తి ఒక్క అభివృద్ది కార్యక్రమం చేపట్టలేదు. ఒక్క కంపెనీ తీసుకురాలేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ కి రాబోతున్నాయి.

టిడిపి హయాంలోనే ముస్లింల సంక్షేమం

1985 లో మైనార్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది ఎన్టీఆర్. రంజాన్ తోఫా, విదేశీ విద్య, పెళ్లి కానుక లాంటి ఎన్నో పథకాలు అమలు చేసింది చంద్రబాబు. మసీదు, ఈద్గా ల అభివృద్ది కి నిధులు కేటాయించింది టిడిపి ప్రభుత్వం. షాదిఖానా లు అభివృద్ది చేసింది టిడిపి. ఇమామ్, మౌజంలకు గౌరవ వేతనం ఇచ్చింది టిడిపి. హజ్ హౌస్ లు కట్టింది టిడిపి. హజ్ యాత్ర కు సహాయం అందిచాం.

కులధృవీకరణ పత్రాల సమస్య పరిష్కరిస్తాం

బీసీ బి లో ఉన్న మైనార్టీ కి చెందిన కొన్ని కులాల వారిని ప్రభుత్వం హిందువులుగా పరిగణించడం వలన ఉద్యోగ అవకాశాల తో పాటు అనేక హక్కులు కోల్పోతున్నారు. ఈ సమస్యని టిడిపి గెలిచిన వెంటనే పరిష్కరిస్తాం. ఖబర్ స్థాన్ లను అభివృద్ది చేసింది టిడిపి. మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఖబర్ స్థాన్ లు అభివృద్ది చేస్తాం. ఉర్దూ యునివర్సిటీ తెచ్చింది. ఉర్దూ టీచర్ పోస్టులు భర్తీ చేసింది టిడిపి. ముస్లింలకు ఉన్నత పదవులు ఇచ్చింది టిడిపి. ఉప మఖ్యమంత్రిగా అంజాద్ బాషా గారికి ఛాలెంజ్ విసురుతున్నా. ఎవరి పాలనలో ముస్లీం లకు మేలు జరిగిందో చర్చకు నేను సిద్దం.

ముస్లిం మైనారిటీలు మాట్లాడుతూ…

వైసీపీ ప్రభుత్వం ముస్లింలను మోసం చేసింది.  విదేశీ విద్య పథకం రద్దు చేశారు. ముస్లీం మహిళలకు ఉపాధి అవకాశాలు దక్కడం లేదు. మా భూములు డికేటి లో ఉన్నాయి అంటూ అమ్ముకోవడానికి అవకాశం లేదు అంటున్నారు. రంజాన్ తోఫా రద్దు చేశారు. మైనార్టీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అందడం లేదు. మైనార్టీ వ్యాపారస్తులకు ఎటువంటి రుణాలు ఇవ్వడం లేదు. కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు అందడం లేదు. మైనార్టీ నిధులు పక్కదారి పట్టించారు. షాదిఖానా నిర్మాణానికి ప్రభుత్వం ఎటువంటి సహాయం అందించడం లేదు. దుల్హన్ పథకం అమలు కావడం లేదు. ఎన్నో ఏళ్లుగా దామలచెరువు ప్రాంతంలో ఉన్న 200 ముస్లీం కుటుంబాలకు పట్టాలు లేవు.  చదువు కున్న యువత కి ఉద్యోగాలు లేక ఇతర రాష్ట్రాలకు వెళ్లి జాబ్స్ చేసుకుంటున్నారు.

ముస్లింలతో ముఖాముఖిలో వ్యక్తమైన అభిప్రాయాలు:

షఫీ: మా గ్రామంలో ఉన్న షాదీఖానాలో సదుపాయాలు సరిగా లేవు. సదుపాయాలు కల్పించే విషయంపై అధికారులు పట్టించుకోవడం లేదు. స్వయం ఉపాధి అవకాశాలు కోసం మేం ఎంతమందిని అడిగినా ఉపయోగం లేకుండా పోయింది. చదువుకున్న వాళ్లకు ఉద్యోగ అవకాశాలు లేవు. కేవలం రూ.10వేలు నుండి రూ.15వేలకు పక్కరాష్ట్రాలకు వలస వెళ్లి ఉద్యోగాలు చేసుకోవాల్సి వస్తోంది. మీరు అధికారంలోకి వచ్చాక మా పిల్లలకు ఉద్యోగాలు కల్పించండి.

మస్తాన్: మా గ్రామంలో 200ఇళ్లు ఉన్నాయి. డీకేటీ భూములని పట్టాలు ఇవ్వడం లేదు. మీరు అధికారంలోకి వచ్చాక మా భూములకు పట్టాలు ఇప్పించండి.

అన్సార్: మా గ్రామంలో ఖబరస్థాన్ ఉంది. దానికి ప్రహరీగోడ లేదు. ఎమ్మెల్యేను అడిగితే పట్టించుకోలేదు. మీరు అధికారంలోకి వచ్చాక ప్రహరీ నిర్మించండి.

ఆరిఫ్: నేను చెన్నయ్ లో ఉద్యోగం చేస్తున్నా. వాళ్లు నన్ను చాలా చిన్న చూపు చూస్తున్నారు. నా రాష్ట్రంలో నేను ఉద్యోగం చేయలేనా అనే అనుమానం కలుగుతోంది. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మాలాంటి వాళ్లకు స్థానికంగా ఉద్యోగావకాశాలు కల్పించండి.

సైదుబాషా: దూదేకుల వారికి బీసీ-బీ కేటగిరీలో ప్రాధాన్యత దక్కడం లేదు. ఉద్యోగ అవకాశాలు రావడం లేదు. మమ్మల్నిబిసి-డీ కేటగిరీలో చేర్పిస్తే మాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీరు అధికారంలోకి వచ్చాక ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.

Also read this blog: Yuvagalam 400km Milestone: A Significant Achievement of Nara Lokesh’s Unwavering Commitment to Youth!

Tagged #LokeshPadaYatra #Padayatra #YuvaGalamLokesh #YuvaGalam #NaraLokeshPadaYatra #NaraLokesh 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *